S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/01/2016 - 07:02

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: పాకిస్తాన్ సైన్యం, ఇస్లామిక్ ఉగ్రవాదుల నుండి ఎదురయ్యే దాడిని తిప్పికొట్టేందుకు భారత సైన్యం సరిహద్దుల్లో సర్వసన్నద్ధంగా ఉందని రక్షణ, హోంశాఖ అధికారులు చెబుతున్నారు. సరిహద్దుల్లో పెద్ద ఎత్తున సైనిక మోహరింపు జరిగిపోయిందని వారు చెబుతున్నారు.

10/01/2016 - 07:01

అమృత్‌సర్/చండీగఢ్, సెప్టెంబర్ 30: పంజాబ్‌లోని భారత్-పాక్ అంతర్జాతీయ సరిహద్దులకు ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు తమ పంటలు, గొడ్డూ గోదాను వదిలిపెట్టి సరక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి వచ్చినప్పటికీ ఏమాత్రం బాధపడ్డం లేదు.

10/01/2016 - 06:59

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: ఆక్రమిత కాశ్మీర్‌లో సర్జికల్ దాడులు జరిపిన భారత్‌పై ప్రతి దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని అమెరికా హెచ్చరించటంతో పాకిస్తాన్ ఇరకాటంలో పడినట్లు తెలిసింది.

10/01/2016 - 06:57

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 30: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె)లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ సైన్యం జరిపిన దాడుల విషయంలో పాకిస్తాన్ మీడియా మొత్తం తమ దేశ ప్రభుత్వ వాదననే బలపరచింది. సర్జికల్ స్ట్రైక్ జరిపినట్టు భారత్ నాటకమాడుతోందని, ఉరీ ఉగ్రవాద దాడి తరువాత తమ దేశ ప్రజల మనోభావాలను తృప్తిపరచడానికి భారత ప్రభుత్వం ఈ నాటకం ఆడుతోందని విమర్శించింది.

10/01/2016 - 06:56

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: ఉగ్రవాదానికి ప్రధాన కేంద్రంగా మారిన పాకిస్తాన్‌కు దౌత్యపరంగా దెబ్బమీద పెద్ద ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పాక్‌లో జరుగనున్న సార్క్ (దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమాఖ్య) సభ్య దేశాల 19వ శిఖరాగ్ర సమావేశానికి భారత్, భూటాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ మాదిరిగానే తాము కూడా హాజరయ్యేది లేదని శ్రీలంక, మాల్దీవులు శుక్రవారం స్పష్టం చేశాయి.

10/01/2016 - 06:55

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 30: భారత్ సహా మొత్తం నాలుగు దేశాలు బాయ్‌కాట్ చేయడంతో నవంబర్‌లో జరగాల్సిన 19వ సార్క్ శిఖరాగ్ర సదస్సును పాకిస్తాన్ వాయిదా వేసుకుంది. ఈ సదస్సుకు హాజరుకాకూడదని నిర్ణయించడం ద్వారా మొత్తం సార్క్ ప్రక్రియనే భారత్ గాడి తప్పించిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

10/01/2016 - 06:54

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: నియంత్రణ రేఖ పొడవున పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యానికి చెందిన పారా కమాండోలు జరిపిన లక్షిత దాడులను విస్తృతంగా ప్రసారం చేసిన దేశంలోని అతిపెద్ద మీడియా సంస్థ ‘జీ న్యూస్’ను కరడుగట్టిన ఉగ్రవాది, జమాత్ ఉద్ దువా (జెయుడి) ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సరుూద్ శుక్రవారం తీవ్రంగా హెచ్చరించాడు.

10/01/2016 - 06:54

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ అసలు మెరపు దాడులు చేయలేదనే వాదిస్తున్న పాకిస్తాన్ సాక్ష్యాలు కనుమరుగు చేసేందుకు ఉగ్రవాదుల మృత దేహాలను హడావుడిగా ఖననం చేస్తోందంటూ కథనాలు వెలువడుతున్నాయి. భారత సైనికులు ఏయే ప్రాంతాల్లో దాడులు జరిపారో వాటి సమీపంలోనే దాదాపు 70మంది వరకూ ఉగ్రవాదుల మృతదేహాలను పాతిపెడుతున్నట్టు స్పష్టమవుతోంది.

10/01/2016 - 06:53

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: ఉగ్రవాదాన్ని, కళలను ఒకే గాటన కట్టరాదని, పాకిస్తాన్ నుంచి వచ్చిన కళాకారులను ఉగ్రవాదుల మాదిరిగా పరిగణించరాదని బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ అన్నాడు. ఉరీ దాడి ఘటన నేపథ్యంలో దేశీయ చిత్ర పరిశ్రమ నుంచి పాక్ నటీనటులను నిషేధించాలని భారత చలనచిత్ర నిర్మాతల సంఘం గురువారం తీర్మానించడంతో సల్మాన్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

10/01/2016 - 06:52

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: పొరబాటున సరిహద్దులు దాటి పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించి అక్కడి సైనికుల చేతికి చిక్కిన భారత జవానును విడిపించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. పాకిస్తాన్ చెరలో ఉన్న 22 ఏళ్ల జవాను చందూ బాబూలాల్ చౌహాన్‌ను విడిపించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజ్‌నాథ్ శుక్రవారం ఇక్కడ చెప్పారు.

Pages