S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/01/2016 - 06:11

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణాలు తమ తుది తీర్పుకు లోబడి ఉండాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. నూతన రాజధాని అమరావతి నిర్మాణంపై శ్రీమన్నారాయణ, మాజీ ఐఎఎస్ ఈఏఏస్ శర్మ, బొలిశెట్టి సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై ట్రిబ్యునల్ శుక్రవారం విచారణ జరిపింది.

10/01/2016 - 05:18

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: దేశం 2019 నాటికి సంపూర్ణ పరిశుభ్రత సాధిస్తుందనే ఆశాభావాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి అధ్యక్షతన శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఇండోసాన్- 2016 స్వచ్చ భారత్ సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. ప్రధాని మోదీ స్వచ్ఛత దిశగా వేస్తున్న అడుగులు, తీసుకుంటున్న చర్యలు ఎంతో బాగున్నాయని చంద్రబాబు తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు.

10/01/2016 - 05:17

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: సంవత్సరానికి కోటిన్నర రూపాయల టర్నోవర్ కలిగిన పరిశ్రమలు, సంస్థలన్నింటినీ రాష్ట్రాల పరిధిలోనే ఉంచాలని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)పై శుక్రవారం న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు.

10/01/2016 - 05:17

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: తెలంగాణలో బహిరంగ మలమూత్ర విసర్జన లేని 17 పట్టణాల పేర్లను అక్టోబరు 2వ తేదీన ప్రకటిస్తామని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామరావు తెలిపారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఇండోపాన్-2016 స్వచ్ఛ భారత్ సదస్సులో కెటిఆర్ పాల్గొన్నారు.

10/01/2016 - 04:44

దుమ్ముగూడెం, సెప్టెంబర్ 30: ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర కిష్టారం పోలీసుస్టేషన్ పరిధిలోని వీరాపురం అటవీ ప్రాంతంలో గురువారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో సోడె గంగ(30) అనే మావోయిస్టు మిలీషియా కమాండర్ మృతి చెందాడు. ఛత్తీస్‌గఢ్ కోబ్రా దళాలు, సిఆర్‌పిఎఫ్ బలగాలు వీరాపురం అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా గంగతో పాటు పలువురు తారసపడ్డారు. ఎదురుకాల్పుల్లో సోడె గంగ మృతి చెందాడు.

10/01/2016 - 04:42

బులంద్‌షహర్ (యుపి), సెప్టెంబర్ 30: ఎన్‌డిఏ ప్రభుత్వంపైనా, ప్రధాని నరేంద్ర మోదీపైనా ఎప్పుడూ విమర్శలు గుప్పించే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తొలిసారిగా ప్రశంసించారు.

10/01/2016 - 04:38

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: పెట్రోల్ ధర శుక్రవారం లీటర్‌కు 28 పైసలు పెరగగా, డీజిల్ ధర లీటర్‌కు 6పైసలు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న ధోరణులకు అనుగుణంగా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి) ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయి. ఢిల్లీలో లీటర్‌కు రూ.

10/01/2016 - 04:31

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) చట్టం ప్రకారం ప్రస్తుత రిజిష్టర్డ్ సర్వీస్ ప్రొవైడర్లను టర్నోవర్‌తో సంబంధం లేకుండా కేంద్ర పన్నుల వ్యవస్థ పరిధికిలోకి తీసుకురావటం తమకు ఎంత మాత్రం ఇష్టం లేదని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. జిఎస్‌టిపై రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో శుక్రవారం కేంద్రం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

10/01/2016 - 04:30

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: తమిళనాడుకు కావేరి జలాలను విడుదల చేయాలంటూ తాను ఇచ్చిన ఆదేశాలను పదే పదే ఉల్లంఘిస్తున్న కర్నాటకపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్రస్థాయిలో మండిపడింది. శనివారంనుంచి అక్టోబర్ 6 దాకా రోజుకు 6 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేసి తీరాలని ఆ రాష్ట్రాన్ని ఆదేశించిన సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్రంపై చట్టం కొరడా ఎప్పుడు పడుతుందో ఎవరికీ తెలియదని హెచ్చరించింది.

10/01/2016 - 03:30

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: తమిళనాడుకు కావేరి జలాలను విడుదల చేయాలంటూ తాను ఇచ్చిన ఆదేశాలను పదే పదే ఉల్లంఘిస్తున్న కర్నాటకపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్రస్థాయిలో మండిపడింది. శనివారంనుంచి అక్టోబర్ 6 దాకా రోజుకు 6 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేసి తీరాలని ఆ రాష్ట్రాన్ని ఆదేశించిన సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్రంపై చట్టం కొరడా ఎప్పుడు పడుతుందో ఎవరికీ తెలియదని హెచ్చరించింది.

Pages