S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/21/2016 - 01:26

గయ, సెప్టెంబర్ 20: ఓ పక్క కని పెంచిన తండ్రి పాక్ ముష్కరుల దాడిలో మరణించిన బాధ పెల్లుబుకుతున్నా ఆ కుమార్తెలు మాత్రం తండ్రికిచ్చిన మాటను ఆ బాధలోనూ నిలబెట్టుకున్నారు. కాశ్మీర్‌లోని ఉరీలో జరిగిన పాక్ మిలిటెంట్ల కాల్పుల్లో ఎస్.కె.విద్యార్థి అనే సైనికుడు మరణించాడు. ‘బాగా చదువుతామని, పరీక్షలు బాగా రాస్తామని మా నాన్నకు మాటిచ్చాం.

,
09/21/2016 - 01:22

న్యూఢిల్లీ/శ్రీనగర్ సెప్టెంబర్ 20: పద్ధెనిమిది మంది జవాన్లను దొంగదాడి చేసి హతమార్చిన పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలపై ఎలా వ్యవహరించాలన్న అంశంపై కేంద్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. న్యూఢిల్లీలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలో, శ్రీనగర్‌లో కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మెహర్షి నాయకత్వం జమ్ము కాశ్మీర్‌తోపాటు దేశమంతటా నెలకొన్న పరిస్థితులపై అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాలు జరిగాయి.

09/21/2016 - 01:19

పాట్నా, సెప్టెంబర్ 20: ‘మా పిల్లలు దేశంకోసం ప్రాణత్యాగం చేయడం నాకు గర్వంగా ఉంది’ అంటూ బిహార్‌కు చెందిన ముగ్గురు సైనికుల తల్లిదండ్రులు ముక్తకంఠంతో స్పష్టం చేశారు. కుమారుల్ని కోల్పోయిన బాధ ఒకపక్క తమను కుంగదీస్తున్నా, వారు చేసిన అత్యున్నత త్యాగం తాము ఉప్పొంగేలా చేస్తోందని పేర్కొన్నారు.

09/21/2016 - 01:15

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: తమిళనాడుకు బుధవారం నుంచి ఈ నెల 27వరకు రోజుకు 6 వేల క్యూసెక్కుల చొప్పున కావేరి జలాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు మంగళవారం కర్నాటకను ఆదేశించింది. తమిళనాడుకు బుధవారంనుంచి ఈ నెల 30 తేదీ దాకా రోజుకు 3 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాలని కావేరి జలాల పర్యవేక్షక కమిటీ సోమవారం కర్నాటకను ఆదేశించిన విషయం తెలిసిందే.

09/21/2016 - 01:11

బెంగళూరు, సెప్టెంబర్ 20: తమిళనాడుకు రోజుకు 6వేల క్యూసెక్కుల చొప్పున 27వరకూ కావేరీ జలాలను విడుదల చేయాలంటూ సుప్రీం కోర్టు జారీ చేసిన తాజా ఆదేశాన్ని అమలు చేయలేమని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. దీనిపై తీసుకోవాల్సిన తదుపరి చర్యపై చర్చించేందుకు బుధవారం అఖిల పక్ష సమావేశాన్ని, కేబినెట్ భేటీనీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ‘సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వును జారీ చేసింది.

09/21/2016 - 01:10

అమృత్‌సర్, సెప్టెంబర్ 20: అమృత్‌సర్‌లో పాఠశాల బస్సు వాగులో పడిన దుర్ఘటనలో ఆరుగురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. భారత్-పాక్ సరిహద్దుల్లోని అట్టారీ వద్ద బార్డర్ అవుట్‌పోస్ట్ సమీపంలో ఉన్న ఒక వాగులో మంగళవారం ఉదయం స్కూలు బస్సు అదుపుతప్పి పడిపోయింది. 37మంది విద్యార్థులతో వెళ్తున్న ఈ బస్సు వాగుపై ఉన్న సన్నటి వంతెన దాటుతుండగా ప్రమాదం జరిగింది.

09/21/2016 - 01:08

బాలాసోర్ (ఒడిశా), సెప్టెంబర్ 20: రక్షణ సామర్థ్యానికి మరింత పదును పెట్టుకుంటూ భారత్ మంగళవారం రెండు క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది. సుదూర ఉపరితల లక్ష్యాలను ఛేదించగలిగే ఈ క్షిపణులను ఇజ్రాయెల్‌తో కలిసి రూపొందించింది. మొదటి క్షిపణిని ఇక్కడి చాందిపూర్ ప్రయోగ కేంద్రం నుంచి పదిగంటల 13నిముషాలకు, రెండో క్షిపణిని మధ్యాహ్నం 2గం 25నిముషాలకు పరీక్షించామని రక్షణ అధికారులు తెలిపారు.

09/21/2016 - 01:07

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర గిరిజన సంక్షేమశాఖ చర్యలు తీసుకోవాలని టిఆర్‌ఎస్ ఎంపీ సీతారాం నాయక్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర గిరిజన వ్యవహరాల శాఖ మంత్రి జ్యువెల్ ఓరంని కలిసి కోరారు. అక్టోబర్‌లో ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభిస్తున్న జాతీయ గిరిజన కార్యక్రమంలో తెలంగాణ గిరిజనుల సంస్కృతి నృత్యాలు ప్రదర్శింపచేయాలన్నారు.

09/21/2016 - 01:07

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: దళితులను బిజెపి నుంచి దూరం చేసేందుకు కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ప్రయత్నాస్తున్నాయని ఏపి దళితమోర్చా అధ్యక్షుడు దారా సాంబయ్య ఆరోపించారు. ఇందులో భాగమే గోరక్షణ పేరుతో బిజెపి దళితులపై దాడులకు పాల్పడుతోందని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బిజెపి జాతీయ దళిత మోర్చా ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొన్నారు.

09/21/2016 - 01:06

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: న్యాయమూర్తులకు ఎవరినుంచి ఎలాంటి యోగ్యతా పత్రాలు అవసరం లేదని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. హైకోర్టుల్లోనూ, సుప్రీంకోర్టులోనూ న్యాయమూర్తుల నియామకం నిస్పాక్షికంగా జరిగేందుకు ఇటు న్యాయవ్యవస్థ, ఇటు కార్యనిర్వాహక వ్యవస్థతో సంబంధం లేకుండా ఒక స్వతంత్ర ప్రజా వ్యవస్థను ఏర్పాటుచేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.

Pages