S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/05/2019 - 13:32

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రీవాలో జరిగిన ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు - ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

12/05/2019 - 13:31

న్యూఢిల్లీ: దేశంలో ఏర్పడిన ఉల్లి సంక్షోభం నివారణకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని లోకసభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇందుకోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు. ఉల్లి ధరల పెరుగుదలపై ఆమె మాట్లాడుతూ.. తాను ఉల్లి, వెల్లుల్లి ఎక్కువగా తినను. ఆ రెండింటితో పెద్దగా సంబంధం లేని కుటుంబం నుంచి వచ్చానని వ్యాఖ్యానించటంపై విపక్షాలు మండిపడ్డాయి.

12/05/2019 - 13:30

బెంగళూరు: కర్ణాటకలోని 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక ప్రశాంతంగా జరుగుతుంది. అయితే 15 స్థానాల్లో కనీసం 6 సీట్లు వస్తేనే బీజేపీ ప్రభుత్వం మనుగడ కొనసాగుతుంది. దీంతో ఈ ఉప ఎన్నికలు యెడియూరప్ప ప్రభుత్వానికి కీలకంగా మారాయి.

12/05/2019 - 13:29

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో మరో దారుణం జరిగింది. కోర్టుకు వెళుతున్న అత్యాచార బాధితురాలిని పెట్రోల్ పోసి దహనం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి, ఉన్నావ్ జిల్లాలో తల్లిదండ్రుల గ్రామానికి వెళ్లి వస్తున్న మహిళపై అదే గ్రామానికి చెందిన ఇరువురు వ్యక్తులు అత్యాచారం చేశారు. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ఒక నిందిడుడ్ని పోలీసులు అరెస్టు చేయగా.. మరొక వ్యక్తి పరారీలో ఉన్నాడు.

12/05/2019 - 13:28

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైలులో ఉన్న మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరానికి నిన్న సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయటంతో ఆయన విడుదల అయ్యారు. ఈరోజు శీతాకాల పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారు. కాగా చిదంబరం తమిళనాడు నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. 106 రోజుల తరువాత తనకు స్వేచ్ఛ లభించిందని ఆయన సంతోషంగా తెలిపారు.

12/05/2019 - 05:08

న్యూఢిల్లీ: ఉత్తరాంధ్ర నీటి వనరులు, నీటి ప్రాజెక్ట్‌లు, సమస్యలు, పరిష్కార మార్గాలు అనే అంశాలపై వైజాగ్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టు అయిన నేషనల్ జర్నలిస్టు యూనియన్ ప్రతినిధి నాగబోయిన నాగేశ్వర్‌రావు రాసిన ‘ఉత్తరాంధ్ర కన్నీళ్లు’ హిందీ అనువాదం ‘ఉత్తరాంధ్రాకే ఆన్సూ’ పుస్తకాన్ని బుధవారం ఉదయం పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆవిష్కరించారు.

12/05/2019 - 02:21

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: సంచార, విముక్తజాతుల వారిని ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పరిధిలోకి తీసుకునిరావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు విజయసాయి రెడ్డి బుధవారం రాజ్యసభలో డిమాండ్ చేశారు.

12/05/2019 - 02:14

*చిత్రం...పూరీలో జరిగిన అత్యాచారం కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భువనేశ్వర్‌లో బుధవారం ఆందోళనకు దిగిన సామాజిక కార్యకర్తలను అరెస్టు చేస్తున్న పోలీసులు

12/05/2019 - 02:24

భోపాల్, డిసెంబర్ 4: మధ్యప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఇమార్తీ దేవి డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బుధవారం ఓ ఫంక్షన్‌కు హాజరైన మంత్రిణి ఉత్సాహం పట్టలేక డాన్స్ చేశారు. గులాబీ రంగు చీర ధరించిన ఇమార్తీ బాలీవుడ్ సాంగ్ ‘ముఝకో రానా జీ మాఫ్ కర్నా’కు నృత్యం చేశారు. ఇక అంతే ఆమె చుట్టూ చేరిన జనం కేరింతలు కొట్టారు. మంత్రిణిపై కరెన్సీ నోట్లు విసరడం మొదలెట్టారు.

12/05/2019 - 01:27

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: దేశంలోని కోట్లాది మంది వయో వృద్ధుల ప్రయోజనాల పరిరక్షణకు సంబంధించిన చట్ట సవరణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వయోవృద్ధుల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణ కోసం తల్లిదండ్రులు, వృద్ధుల సంక్షేమ పరిరక్షణ చట్టాన్ని సవరించాలని మోదీ ప్రభుత్వం ప్రతిపాదించింది.

Pages