S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/26/2016 - 01:13

శ్రీనగర్, ఆగస్టు 25: జమ్మూ, కాశ్మీర్‌లో తాజా అల్లర్లలో పెద్ద ఎత్తున గాయాలకు కారణమైన పెల్లెట్ గన్స్ స్థానంలోనే కొద్ది రోజుల్లోనే ప్రత్యామ్నాయాలను ప్రవేశపెడతామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. కాశ్మీర్‌లో రెండు రోజుల పర్యటనకోసం బుధవారం వచ్చిన రాజ్‌నాథ్ సింగ్ గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో సమావేశమైనారు. ఈ సందర్భంగా ఆయన మెహబూబాతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.

08/26/2016 - 01:11

ముంబయి, ఆగస్టు 25: సుప్రీం కోర్టు మార్గదర్శకాలను తోసిరాజని మహారాష్ట్ర అంతటా కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. మైనర్లు వేడుకల్లో పాల్గొనకూడదని, మానవ పిరమిడ్లు ఎత్తు 20 అడుగులు మించకూడదని సర్వోన్నత న్యాయస్థానం ఆంక్షలు విధించింది. అయినప్పటికీ ముంబయి సహా పలు పట్టణాల్లో ఎక్కడా కోర్టు నిబంధనలు పట్టించుకోలేదు. ఇరవై అడుగుల కంటే ఎక్కువ ఎత్తునలో మానవ పిరమిడ్లు ఏర్పాటు చేయవద్దని బుధవారం సుప్రీం ఆదేశించింది.

08/26/2016 - 01:09

శ్రీనగర్, ఆగస్టు 25: జమ్మూ, కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ గురువారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి పాల్గొన్న మీడియా సమావేశంలో సంయమనం కోల్పోయి సమావేశాన్ని మధ్యలోనే ముగించి వెళ్లిపోయారు. ప్రస్తుత అల్లర్లను ఎదుర్కోవడంలో మీ పాత్ర ఏమిటని సమావేశంలో మీడియా ప్రతినిధులు పదే పదే ప్రశ్నించడంతో ఆమె ఒక్కసారిగా సహనం కోల్పోయి మీడియాపై మండిపడ్డారు.

08/26/2016 - 01:06

న్యూఢిల్లీ, ఆగస్టు 25: తన మంత్రివర్గ సహచరులు చాలా మందికంటే ప్రధాని నరేంద్ర మోదీ పేదవాడేనని తాజాగా వెలువడిన ఓ కథనాన్ని బట్టి స్పష్టమవుతోంది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ, అప్పుల వివరాలు మోదీ వెల్లడించారు. వాటి ప్రకారం ఆయనకు తాను రాసిన, తన గురించి రాసిన పుస్తకాల ద్వారా 12,35,000 ఆదాయం వస్తోంది. 2016 మార్చినాటికి ప్రధాని వద్ద 89,700 నగదు మాత్రమే ఉంది.

08/26/2016 - 01:05

న్యూఢిల్లీ, ఆగస్టు 25: కాశ్మీర్‌లో ఆందోళనకారులను అదుపు చేయడానికి పెల్లెట్ గన్స్ స్థానంలో ప్రత్యామ్నాయాన్ని కనుగొనడానికి నియమించిన నిపుణుల కమిటీ అంతకన్నా తక్కువ శక్తి కలిగిన, కొత్తగా అభివృద్ధి చేసిన ‘పావా’ షెల్స్ సరయినవనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

08/26/2016 - 01:02

న్యూఢిల్లీ, ఆగస్టు 25: స్కార్పీన్ జలాంతర్గాముల రహస్య సాంకేతిక, సామర్థ్య వివరాలు లీకైన వ్యవహారాన్ని ఫ్రాన్స్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఆర్మమెంట్ దృష్టికి తీసికెళ్లినట్టు భారత నావికాదళం గురువారం తెలిపింది. ఈ లీకేజీ అంశంపై అత్యవసరంగా విచారణ జరపాలని, విచారణలో తేలిన అంశాలను తమకు తెలియజేయాలని ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని ఇండియన్ నేవీ కోరింది.

08/26/2016 - 01:00

న్యూఢిల్లీ, ఆగస్టు 25: మహాత్మాగాంధీ హత్యలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) పాత్రకు సంబంధించి చేసిన వ్యాఖ్యలనుంచి తాను యు-టర్న్ తీసుకున్నట్లు వచ్చిన వార్తలను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తోసిపుచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్ గురించి తాను చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నానని ఆయన గురువారం స్పష్టం చేశారు.

08/26/2016 - 00:57

న్యూఢిల్లీ, ఆగస్టు 25: రాజ్యాంగం కల్పించిన 27 శాతం రిజర్వేషన్లు ఓబిసిలకు పూర్తిస్థాయిలో అమలుకావడం లేదని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఓబిసి పార్లమెంటరీ కమిటీకి చట్టబద్ధత కల్పించడానికి తనవంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

08/26/2016 - 00:56

న్యూఢిల్లీ, ఆగస్టు 25: ఢిల్లీ సామూహిక అత్యాచారం కేసులో మరణశిక్ష పడ్డ వినయ్ శర్మ బుధవారం రాత్రి జైలులోనే ఆత్మహత్యా యత్నం చేశాడు. నిర్భయ కేసులో దోషిగా ఉన్న అతడు తీహార్ జైలులో ఉన్నాడు. సెల్‌లోని ఐరన్ గ్రిల్‌కు టవల్ కట్టి మెడకు బిగించుకోబోయాడని అధికారులు వెల్లడించారు. రాత్రి 9.30 ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో సెంట్రీ గమనించి భగ్నం చేశారు.

08/25/2016 - 18:15

మంగళూరు: పాకిస్తాన్ నరకం కాదని, అక్కడి ప్రజలు మంచివారేనని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ మాజీ ఎంపీ, కన్నడ నటి రమ్యపై మంగళూరు ఎయిర్‌పోర్టు వద్ద గురువారం ఆందోళనకారులు కోడిగుడ్లతో దాడి చేశారు. పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడినందుకు ఆమె బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని వారు పట్టుబట్టారు. ఆమెను ఆందోళనకారులు ఘెరావ్ చేయడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఎయిర్‌పోర్టు వద్ద కొంతసేపు ఉద్రిక్తత ఏర్పడింది.

Pages