S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/25/2016 - 07:11

న్యూఢిల్లీ, ఆగస్టు 24: విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వర ప్రాతిపదికన పరిష్కరించాలని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అధికారులను ఆదేశించారు. 5-18 సంవత్సరాల మధ్య వయసుకలిగిన పిల్లలను ఆధార్‌తో అనుసంధానం చేయాలని ఆ విధంగా వారికి విద్యాపరమైన ప్రయోజనాలు, ఉపకార వేతనాలు అందేలా చూడాలని రాష్ట్రాలను ఆదేశించారు.

08/25/2016 - 07:11

న్యూఢిల్లీ, ఆగస్టు 24: రాజకీయాల్లో ఉన్నవారికి విమర్శలు తప్పవని సుప్రీం కోర్టు బుధవారం స్పష్టం చేసింది. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత దాఖలు చేసిన ఓ పరువునష్టం కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

08/25/2016 - 07:10

ముంబయి, ఆగస్టు 24: శ్రీకృష్ట భగవానుడి జయంతి సందర్భంగా దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో జన్మాష్టమి వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులు పాటు జన్మాష్టమి వేడుకలు జరుగుతాయి. నగరంలోని గిర్‌గావ్ చౌపట్టీలోని ప్రసిద్ధ ఇస్కాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం మహాఆరతి చేపట్టినట్టు ఇస్కాన్ ఆధ్యాత్మి గురువు రాధానాథ్ స్వామి మహారాజ్ ఓ ప్రకటనలో వెల్లడించారు.

08/25/2016 - 07:10

న్యూఢిల్లీ, ఆగస్టు 24: మహాత్మాగాంధీ హత్యకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) కారణమని తాను ఎప్పుడూ అనలేదని, ఆ సంస్థతో సంబంధం ఉన్న వ్యక్తి కారణమని మాత్రమే అన్నానని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు. గాంధీ హత్యకు ఆర్‌ఎస్‌ఎస్ కారణమంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆ సంస్థ ఆయనపై పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే.

08/25/2016 - 07:09

ముంబయి, ఆగస్టు 24: శరీరాలు అతుక్కుని పుట్టిన కవల శిశువులను వేరు చేయడానికి ఆ పిల్లల తల్లి ససేమిరా ఇష్టపడకపోవడంతో దాదాపు మూడు వారాలుగా ఇక్కడి ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న ఆ చిన్నారులను డిశ్చార్జి చేయక తప్పలేదు.

08/25/2016 - 07:08

న్యూఢిల్లీ, ఆగస్టు 24: దేశవ్యాప్తంగా ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన జనాభా లెక్కల సేకరణలో దేశంలోని వివిధ మతాల్లో భార్యాభర్తల విడాకులు, విడిపోవడానికి సంబంధించి పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. అన్ని మతాలకన్నా కూడా హిందువుల్లోనే విడాకుల రేటు చాలా తక్కువగా ఉందని దీనిలో వెల్లడయింది. హిందువుల్లో ప్రతి వెయ్యి మందికి 1.8 మంది మాత్రమే విడాకులు తీసుకున్నారట.

08/25/2016 - 07:08

న్యూఢిల్లీ, ఆగస్టు 24: మహారాష్టల్రో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పెద్దఎత్తున నిర్వహించే ‘దహీహండీ’ కార్యక్రమాల నిర్వాహకులకు ఇది ఎదురుదెబ్బ. దహీహండీని కొట్టడానికి ఏర్పాటయ్యే మానవ పిరమిడ్ ఎత్తు 20 అడుగులకు మించరాదని బొంబాయి హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సవరించడానికి సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది.

08/25/2016 - 06:59

న్యూఢిల్లీ,ఆగస్టు 24: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగకుండా చూసేందుకు భయంకరమైన కుట్ర జరుగుతోందని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన కమీషన్లు, స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర పరిధిలో ప్రాజెక్టు నిర్మాణం కొనసాగిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ఆరోపించారు.

08/25/2016 - 06:43

న్యూఢిల్లీ, ఆగస్టు 24: దేశ రాజధాని ఢిల్లీలో ఆకస్మాత్తుగా చికున్‌గునియా విజృంభించడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ద్రవరూప ఆహారం మాత్రమే తీసుకోవాలని వైద్యులు, అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. వ్యాధి సోకినంతమాత్రాన ప్రాణహాని ఉండదని, ముందు జాగ్రత్తలు తీసుకుంటే నివారించవచ్చని వారు స్పష్టం చేశారు. దోమల బారినపడకుండా దూరంగా ఉండాలని వారు సూచించారు.

08/25/2016 - 06:34

న్యూఢిల్లీ ఆగస్టు 24: తెలంగాణలో నీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం మహారాష్టత్రో ఒప్పదం కుదుర్చుకోవడాన్ని చీకటి రోజుగా భావిస్తున్నట్లు శాసన మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ విమర్శించారు. ఢిల్లీలో బుధవారం షబ్బీర్ అలీ విలేఖరులతో మాట్లాడుతూ 2012లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి హయంలో జరిగిన ఒప్పందానే్న మళ్లీ ఇప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్ కుదుర్చుకుని ఊరేగింపులు చేసుకుంటున్నారని ఆరోపించారు.

Pages