S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/25/2016 - 06:34

న్యూఢిల్లీ, ఆగస్టు 24: ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతి రావుఫూలేకు భారతరత్న అవార్డును ప్రకటించాలని, జాతీయ బిసి కమిషన్ కేంద్రప్రభుత్వానికి సిఫార్సు చేయాలని తెలంగాణ బిసి సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది. బుధవారం నాడు జాతీయ బిసి కమిషన్ చైర్మన్ జస్టిస్ వి. ఈశ్వరయ్యను తెలంగాణ బీసి సంక్షేమ సంఘం నాయకులు జాజుల శ్రీనివాస్‌గౌడ,రాచకొండ సత్యనారాయణరావుకలిసి ఒక విజ్ఞాపన పత్రాన్ని ఆందచేశారు.

08/25/2016 - 06:11

న్యూఢిల్లీ/మెల్‌బోర్న్, ఆగస్టు 24: భారత నౌకా దళం కోసం ఫ్రాన్స్ కంపెనీ నిర్మిస్తున్న ఆరు అత్యాధునిక స్కార్పీన్ జలాంతర్గాములకు సంబంధించిన 22వేల పేజీల సాంకేతిక రహస్య వివరాలు బహిర్గతమయ్యాయి. ఈ పరిణామం భద్రతా విభాగాల్లో తీవ్ర ప్రకంపనలు పుట్టిస్తోంది. జలాంతర్గాములకు సంబంధించిన సాంకేతిక, సామర్థ్య వివరాలు ఎలా లీకు అయ్యాయన్న దానిపై నౌకాదళం బుధవారం దర్యాప్తునకు ఆదేశించింది.

08/25/2016 - 06:08

న్యూఢిల్లీ, ఆగస్టు 24: 2019 ఎన్నికల్లో తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంగా పార్టీని బలోపేతం చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అస్సాం స్ఫూర్తిగా తీసుకొని పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం నాడు జరిగిన వివిధ రాష్ట్రాల కోర్ కమిటి సభ్యులకు బూత్ స్థాయి నుండి పార్టీ బలోపేతంపై అధిష్ఠానం తమకు మార్గనిర్దేశం చేసిందని వెల్లడించారు.

08/25/2016 - 01:47

న్యూఢిల్లీ, ఆగస్టు 24: అద్దెగర్భం వ్యాపారమయం కాకుండా నిరోధించే బిల్లుకు కేంద్ర మంత్రిమండలి బుధవారం ఆమోదం తెలిపింది. కేవలం చట్టపరంగా భార్యాభర్తలైన భారతీయులకు మాత్రమే అద్దెగర్భం ద్వారా సంతానాన్ని పొందేలా ఈ బిల్లును రూపొందించారు. సరోగసీ నియంత్రణ బిల్లు-2016ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

08/25/2016 - 00:52

న్యూఢిల్లీ,ఆగస్టు 24: ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ-గూడూరు మధ్య రూ. 3,875 కోట్ల వ్యయంతో మూడో రైల్వే లైను నిర్మించాలని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఉదయం జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆర్థిక వ్యవహారాల ఉపసంఘం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

08/25/2016 - 00:40

న్యూఢిల్లీ, ఆగస్టు 24: ఉమ్మడి ఉన్నత విద్యామండలి ఆస్తుల పంపకాలపై అత్యున్నత ధర్మాసనం తీర్పును పున:పరిశీలించాలంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రెండో రివ్యూ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. రెండో పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్ గోపాల్ గౌడ్,జస్టిస్ అరుణ్ మిశ్రాలు తమ చాంబర్‌లో పరిశీలించి గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించేది లేదని మరోసారి స్పష్టం చేశారు.

08/25/2016 - 00:38

న్యూఢిల్లీ,ఆగస్టు 24: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగకుండా చూసేందుకు భయంకరమైన కుట్ర జరుగుతోందని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన కమీషన్లు, స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర పరిధిలో ప్రాజెక్టు నిర్మాణం కొనసాగిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ఆరోపించారు.

08/24/2016 - 18:09

దిల్లీ: అద్దె గర్భం (సరోగసీ) ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. సరోగసీ విధానాన్ని మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా మార్గదర్శకాలను రూపొందించింది.సహజీవనం చేసేవారు, స్వలింగ సంపర్కులు, జీవిత భాగస్వామి లేని, పెళ్లి కానివారు, విదేశీయులు, ప్రవాస భారతీయులకు అద్దెగర్భం ద్వారా సంతానం పొందే అవకాశం లేదని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి సుష్మాస్వరాజ్‌ స్పష్టంచేశారు.

08/24/2016 - 18:06

దిల్లీ: మహాత్మా గాంధీ హత్య విషయంలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ను తాను నిందించలేదని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. రాహుల్‌ వ్యాఖ్యలపై ఆర్‌ఎస్‌ఎస్‌ పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌పై బుధవారం జరిగిన విచారణలో రాహుల్‌ తరఫున ఆయన న్యాయవాది కపిల్‌ సిబాల్‌ రాహుల్‌ స్పందన కోర్టుకు తెలియజేశారు.

08/24/2016 - 18:01

దిల్లీ: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంట్లో పెళ్లి రిసెప్షన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ వెళితే తప్పులేదు గానీ, పాక్ ప్రజలను తమ పార్టీ మాజీ ఎంపీ, సినీనటి రమ్య మెచ్చుకుంటే తప్పేముందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్‌లో విమర్శలు సంధించారు. సార్క్ సదస్సు సందర్భంగా ఇటీవల రమ్య పాకిస్థాన్ వెళ్లినపుడు అక్కడి ప్రజలు మంచివారేనని అనడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు.

Pages