S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/21/2016 - 03:43

హైదరాబాద్, ఆగస్టు 20: రియో ఒలింపిక్ క్రీడల్లో రజత పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించిన ‘తెలుగు తేజం’ పివి.సింధు విజయాల వెనుక ఆమె తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎనలేనిది. ఆమె తండ్రి పివి రమణ, తల్లి విజయ వాలీబాల్ ప్లేయర్లు. ఇద్దరూ రైల్వే ఉద్యోగులే. 1986 సియోల్ ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన వాలీబాల్ జట్టులో రమణ సభ్యుడు.

,
08/21/2016 - 03:06

హైదరాబాద్, ఆగస్టు 20: ఒలింపిక్స్ సిల్వర్‌క్వీన్ పివి సింధును యావత్‌దేశం జాతీయపతాకమంత ఎత్తున నిలిపి సాల్యూట్ చేస్తోంది. ఆమె అసాధారణ ప్రతిభకు ఉభయ తెలుగు రాష్ట్రాలు భారీ నజరానాలు ప్రకటించగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు ఆమె సాదరంగా గౌరవ పురస్కారాలను ప్రకటిస్తున్నాయి. మునుపెన్నడూ ఏ క్రీడాకారిణికి కూడా దక్కని అపూర్వ గౌరవాన్ని మన తెలుగమ్మాయి సింధు దక్కించుకుంటోంది.

08/21/2016 - 03:00

మిడ్నాపూర్(పశ్చిమబెంగాల్) ఆగస్టు 20: ముంబై నుంచి హౌరాకు వెళ్తున్న గీతాంజలి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు గుండెపోటుతో మరణించాడు. అయితే అతని బ్యాగ్‌లో రూ.99,03, 490 నగదు లభించింది. అంతే కాదు, బ్యాగులో మూడు బంగారు బిస్కెట్లు కూడా లభించినట్లు ఖరగ్‌పూర్ రైల్వే పోలీసులు తెలిపారు. మరణించిన వ్యక్తి పేరు సుభాష్ చంద్ సురాన అని వారు వివరించారు.

08/21/2016 - 02:59

తిరువనంతపురం, ఆగస్టు 20: కేరళలో ఓ వృద్ధురాలిపై ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా వంద పిచ్చికుక్కలు ఏకకాలంలో దాడిచేశాయి.. దొరికిన చోటల్లా కండలు ఊడబెరికాయి. ఒళ్లంతా రక్తస్రావం.. నిస్సహాయురాలైన మహిళ ఏమీ చేయలేక మృత్యువాతపడింది. కంజిరంకులమంలోని బీచ్‌లో ఈ ఘటన దేశమంతటా సంచలనం సృష్టించింది. 65 సంవత్సరాల సిలువమ్మ అదే తీర ప్రాంతంలో నివాసముంటోంది.

08/21/2016 - 02:19

సిమ్లా, ఆగస్టు 20: న్యాయ వ్యవస్థలో ప్రస్తుతం జరుగుతున్న ఆధునీకరణ మారిన సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేదిగా ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ అంటూ, స్వచ్ఛమైన, సత్వరమైన న్యాయం ఇప్పటికీ ఎండమావిగానే ఉందన్నారు.

08/21/2016 - 02:02

న్యూఢిల్లీ, ఆగస్టు 20: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కొత్త గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆర్‌బిఐ గవర్నర్‌గా ఉన్న రఘురామ్ రాజన్ స్థానంలో ఉర్జిత్ పటేల్ ఆర్‌బిఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపడతారు. రాజన్ సెప్టెంబర్ 4న పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే. 52 ఏళ్ల ఉర్జిత్ పటేల్‌ను ఆర్‌బిఐ గవర్నర్‌గా నియమించినట్లు ప్రభుత్వం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.

08/21/2016 - 01:18

న్యూఢిల్లీ, ఆగస్టు 20: ప్రభుత్వరంగ బొగ్గు ఉత్పాదక దిగ్గజం కోల్ ఇండియా కార్మికులు.. వచ్చే నెల 2న దేశవ్యాప్త సమ్మెకు దిగుతున్నారు. ఈ మేరకు కోల్ ఇండియా శనివారం దేశీయ స్టాక్ మార్కెట్లకు తెలియజేసింది. కాగా, సంస్థలో మరింతగా పెట్టుబడుల ఉపసంహరణలు, వ్యూహాత్మక విక్రయాలకు వ్యతిరేకంగా కార్మికులు ఆందోళన బాట పడుతున్నారు. మరోవైపు సమ్మెతో బొగ్గు ఉత్పత్తి, తరలింపునకు తీవ్ర అంతరాయం కలగనుంది.

08/20/2016 - 18:17

లక్నో: వచ్చే ఏడాది జరిగే యుపి అసెంబ్లీ ఎన్నికలకు అప్పుడే కోలాహలం మొదలైంది. బిఎస్‌పి అధినేత్రి, మాజీ సిఎం మాయావతి ఆదివారం నాడు ఆగ్రాలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. గత సాధారణ ఎన్నికల్లో బిజెపి తరఫున నరేంద్ర మోదీ ఆగ్రా నుంచే సమరశంఖాన్ని పూరించారు. అక్కడి నుంచే తన ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టాలని మాయావతి నిర్ణయించుకోవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

08/20/2016 - 14:43

అలహాబాద్‌ : గంగా నది సహా చాలా నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుండడంతో ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వర్షాల కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ రూ.4లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. వందలాది మట్టి ఇళ్లు నేలమట్టమయ్యాయి.

08/20/2016 - 14:01

హైదరాబాద్: జనసేన అధ్యక్షుడు, సినీ హీరో పవన్ కల్యాణ్తో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి శనివారం భేటీ అయ్యారు. సమావేశం అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ, తమ సమావేశంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. తన కుమారుడు నిఖిల్ చిత్రం విడుదల సందర్బంగా ఆశీర్వాదం కోసమే పవన్ను కలిసినట్లు చెప్పారు. చాలాకాలంగా తమ మధ్య స్నేహం ఉందని తెలిపారు.

Pages