S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/16/2016 - 03:33

న్యూఢిల్లీ, ఆగస్టు 15: సామాజిక ఐక్యత లేకుండా సమాజం మనుగడ సాగించడం అసాధ్యమని, దీనిని దృష్టిలో ఉంచుకుని సామాజిక రుగ్మతలపట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇటీవల దళితులు, ముస్లింలపై దాడులు జరిగిన నేపథ్యంలో మోదీ సోమవారం ఎర్రకోట బురుజుల నుంచి చేసిన స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

08/16/2016 - 03:32

న్యూఢిల్లీ, ఆగస్టు 15: డెబ్భై ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేదలకు, స్వాతంత్య్ర సమర యోధులకు నజరానాలు ప్రకటించారు. చరిత్రాత్మక ఎర్రకోట సాక్షిగా ఆయన ప్రసంగిస్తూ దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదల కుటుంబాలకు వైద్య ఖర్చుల కోసం ఏడాదికి రూ.లక్ష రూపాయలు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు.

08/16/2016 - 03:29

న్యూఢిల్లీ, ఆగస్టు 15: ఆసేతుహిమాచలం డెబ్భై ఏళ్ల స్వాతంత్య్రాన్ని అపూర్వంగా జరుపుకుంది. వినీలాకాశంలో రెపరెపలాడిన ఏడు పదుల మువ్వనె్నల ఝండాకు సమస్త భారతావని సగౌరవ వందనం సమర్పించింది. అన్ని రాష్ట్రాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, విద్యా సంస్థల్లో, అత్యంత ఎతె్తైన హిమనదం సియాచిన్ గ్లేసియర్ నుంచి హిందూ మహాసముద్రం దాకా అన్ని చోట్లా ఆకాశం త్రివర్ణమైంది. ప్రతి పౌరుడిలో దేశభక్తి తొణికిసలాడింది.

08/16/2016 - 03:27

ఉనా (గుజరాత్), ఆగస్టు 15: గుజరాత్ ప్రభుత్వం తమ డిమాండ్‌ను నెరవేర్చకుంటే ఆందోళనను ఉద్ధృతం చేయాలని దళితులు నిర్ణయించారు. గుజరాత్ ప్రభుత్వం నెల రోజులలోగా ఒక్కో దళిత కుటుంబానికి అయిదు ఎకరాల చొప్పున భూమిని మంజూరు చేయకపోతే భారీస్థాయిలో రైల్ రోకో కార్యక్రమాన్ని చేపడతామని స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఇక్కడ నిర్వహించిన నిరసన ప్రదర్శనలో దళితులు హెచ్చరించారు.

08/16/2016 - 03:25

శ్రీనగర్, ఆగస్టు 15: జమ్మూకాశ్మీర్‌లో జాతీయ పతకావిష్కరణలో అపశ్రుతి చోటుచేసుకుంది. శ్రీనగర్‌లోని స్టేడియంలో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ జాతీయ జెండా ఆవిష్కరణ చేస్తుండగా ఒక్కసారిగా జెండా పడిపోయింది. ఆమె ముఖ్యమంత్రిగా తొలిసారి త్రివర్ణపతాకం ఎగురవేస్తుండగా ఈ ఘటన చోటుకేసుకోవడంతో అంతా హతాశురాలయింది. వెంటనే దీనిపై దర్యాప్తునకు ఆదేశించారు.

08/16/2016 - 03:23

లక్నో, ఆగస్టు 15: మరికొన్ని నెలల వ్యవధిలో ఉతరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో అధికార సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తాయి. రాష్ట్రంలో అవినీతిపై తీవ్ర స్వరంతో విరుచుకు పడ్డ తన సోదరుడు,రాష్ట్ర మంత్రి శివ్‌పాల్ యాదవ్‌ను ములాయం గట్టిగా సమర్థించారు. శివ్‌పాల్ వెళ్లిపోతే పార్టీ చీలికలు పేలికలైపోతుందని హెచ్చరించారు.

08/16/2016 - 02:53

హైదరాబాద్, ఆగస్టు 15: ‘పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగాన్ని సాధిస్తాం...అంగుళం కూడా పోనివ్వం..’ అని బిజెపి అగ్ర నాయకుడు, కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు తెలిపారు. కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని ఆయన అన్నారు. సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.

08/16/2016 - 02:50

న్యూఢిల్లీ, ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం ప్రజలంతా ఒకవైపు దేశభక్తి పారవశ్యంలో మునిగి తేలుతుంటే మరోవైపు జమ్మూ-కాశ్మీరు, అస్సాం, మణిపూర్ రాష్ట్రాలు ఉగ్రవాదుల దాడులతో దద్దరిల్లాయి. 40 రోజుల నుంచి హింసాకాండతో అట్టుడుకుతున్న కాశ్మీరు లోయలో సోమవారం ఉదయం శ్రీనగర్ నడిబొడ్డున భద్రతా దళాలపై ఉగ్రవాదులు తాజాగా దాడికి తెగబడ్డారు.

08/16/2016 - 02:48

సారంగ్‌పూర్ (గుజరాత్), ఆగస్టు 15: బొచ్చసన్వాసి అక్షర్ పురుషోత్తం సంస్థాన్ (బిఎపిఎస్) స్వామినారాయణ్ సంస్థ అధిపతి ప్రముఖ్ స్వామి మహరాజ్ కాలధర్మంతో తాను తండ్రిలాంటి వ్యక్తిని కోల్పోయానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శనివారం కాలధర్మం చేసిన ప్రముఖ్ స్వామి భౌతికకాయాన్ని భక్తులు, ప్రజల చివరి దర్శనం కోసం ఇక్కడి ఆలయం వద్ద ఉంచారు. ఈ నెల 17వరకు భౌతికకాయాన్ని ఇక్కడే ఉంచుతారు.

08/16/2016 - 03:42

న్యూఢిల్లీ, ఆగస్టు 15: ఎర్రకోట బురుజుల సాక్షిగా పాకిస్తాన్ దుర్నీతిని, ఉగ్ర నైజాన్ని ప్రధాని మోదీ ఎండగట్టారు. తీరుమారకుంటే ఇక దూకుడేనన్న స్పష్టమైన సంకేతాల్ని అందించారు. గంటన్నర పాటు సాగిన తన ప్రసంగంలో రెండేళ్ల తన ప్రభుత్వ అభివృద్ధి చిట్టాను ఆవిష్కరించారు.

Pages