S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/16/2016 - 02:34

న్యూఢిల్లీ, ఆగస్టు 15: న్యాయమూర్తుల నియామకం అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రస్తావించక పోవడం పట్ల సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘గంటన్నర పాటు మోదీ ప్రసంగాన్ని విన్నాను. న్యాయ వ్యవస్థ గురించి, న్యాయమూర్తుల నియామకం గురించి ప్రస్తావిస్తారని ఆశించాను’అని సోమవారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో ఠాకూర్ అన్నారు.

08/16/2016 - 01:55

న్యూఢిల్లీ, ఆగస్టు 15: కృష్ణా నదీ జలాలకు సంబంధించి నాలుగు రాష్ట్రాలతో ముడిపడివున్న వివాదాలపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట నేటినుంచి మళ్లీ వాదనలు ప్రారంభమవుతున్నాయి. వరుసగా మూడు రోజులపాటు అంటే గురువారం వరకూ ఆంధ్ర, కర్నాటక, మహారాష్టల్రు తమ వాదనలు వినిపించనున్నాయి.

08/15/2016 - 15:09

చండీగఢ్: ఇక్కడ సోమవారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో హర్యానా గవర్నర్ కప్తాన్ సింగ్ సోలంకి హఠాత్తుగా అస్వస్థతకు లోనై సొమ్మసిల్లి కిందపడి పోయారు. ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. వెంటనే వ్యక్తిగత సిబ్బంది గవర్నర్‌కు నీళ్లు అందించి సపర్యలు చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, వేడి వాతావరణం వల్ల ఆయన సొమ్మసిల్లి పడిపోయారని వైద్యసేవలు అందించిన డాక్టర్లు తెలిపారు.

08/15/2016 - 15:09

గౌహతి: ఓ వైపు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతుండగా మరోవైపు అస్సాంలో సోమవారం ఉదయం నాలుగుచోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయి. ఎక్కడా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. వరుస పేలుళ్లతో జనం భీతావహులయ్యారు. ఉదయం 7 గంటలు దాటాక మొదటిగా లయ్‌పురిలో ఓ ప్రైవేటు స్కూలు వద్ద, ఆ తర్వాత దుందుమాలోని ఓ టీ ఎస్టేట్ వద్ద, ఆ తర్వాత మసువా, ఫిలోబరి ప్రాంతాల్లో పేలుళ్లు జరిగాయి.

08/15/2016 - 14:45

దిల్లీ: కేంద్ర మంత్రి మేనకా గాంధీ ఉత్తరాఖండ్‌లోని ఇండో-నేపాల్‌ సరిహద్దు పోస్టును సందర్శించి అక్కడి సహస్త్ర సీమా బల్‌(ఎస్‌ఎస్‌బీ) అధికారులకు, జవాన్లకు రాఖీలు కట్టారు. దేశ భద్రత కోసం విధి నిర్వహణ చేస్తున్న సైనికులకు ధన్యవాదాలు తెలిపినట్లు ఆమె ట్విట్టర్లో పేర్కొన్నారు.

08/15/2016 - 13:42

శ్రీనగర్‌: జమ్ము-కశ్మీర్‌ స్వాత్రంత్య దిన వేడుకల్లో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తుండగా కిందపడిపోయింది. ఆమె సెల్యూట్‌ చేసేవరకు ఇద్దరు భద్రతాసిబ్బంది జెండాను చేతులతో పట్టుకుని నిలబడ్డారు. ఆ తర్వాత భద్రతా సిబ్బంది జెండాను సరిచేసి ఎగురవేశారు.

08/15/2016 - 12:06

దిల్లీ: సురాజ్యం ఏర్పడాలంటే త్యాగాలు తప్పనిసరని, మాన్యుడి జీవితంలో మార్పు తీసుకురావడమే సురాజ్యమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. 70వ స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా దిల్లీలోని ఎర్రకోటపై ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేళ దేశాన్ని కొత్త శిఖరాలకు చేర్చేందుకు మనమందరం సంకల్పించుకోవాలన్నారు.

08/15/2016 - 08:13

న్యూఢిల్లీ, ఆగస్టు 14: గత కొన్ని రోజులుగా కాశ్మీర్ విషయంలో భారత్‌ను రెచ్చగొట్టే రీతిలో వ్యవహరిస్తున్న పాకిస్తాన్ మరింతగా కవ్వించు చర్యలకు పాల్పడింది. ఈసారి తమ స్వాతంత్య్ర దినోత్సవాన్ని కాశ్మీర్ ప్రజల స్వేచ్ఛకోసం అంకితం చేస్తామని, వారికి దౌత్యపరంగా, నైతికంగా, రాజకీయంగా కూడా మద్దతునిస్తామని భారత్‌లోని పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ వివాదాస్పద ప్రకటన చేశారు.

08/15/2016 - 08:11

న్యూఢిల్లీ, ఆగస్టు 14: డబ్భయ్యవ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించే ఢిల్లీలోని ఎర్రకోట సహా దేశవ్యాప్తంగా భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. కాశ్మీర్ లోయలో గత కొన్ని రోజులుగా హింసాకాండ చెలరేగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వని రీతిలో భద్రతను పటుతరం చేశారు.

08/15/2016 - 08:11

న్యూఢిల్లీ, ఆగస్టు 14: పదకొండు రోజులపాటు ఆస్పత్రిలో ఎడం భుజం శస్త్ర చికిత్స, జ్వరానికి చికిత్స తీసుకున్న తర్వాత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదివారం సర్ గంగారామ్ ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయ్యారు. సోనియా గాంధీ అనారోగ్యం, ఎడంభుజం గాయంనుంచి బాగా కోలుకుంటున్నారని, ఆమె ఆరోగ్యం ఇప్పుడు నిలకడగా ఉందని ఆస్పత్రి డాక్టర్లు చెప్పారు.

Pages