S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/15/2016 - 08:10

న్యూఢిల్లీ, ఆగస్టు 14: దేశంకోసం ప్రాణాలర్పించిన లాబ్రాడర్ జాతికి చెందిన నాలుగేళ్ల సైనిక శునకం ‘మాన్సీ’ని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆదివారం ‘మెన్షన్ ఆఫ్ డిస్పాచెస్’ సర్ట్ఫికెట్‌తో గౌరవించింది. దేశ సైనిక చరిత్రలో మరణానంతరం ఈ అరుదైన అవార్డుకు ఎంపికైన తొలి శునకం బహుశా ఇదే.

08/15/2016 - 08:09

న్యూఢిల్లీ, ఆగస్టు 14: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం సిబిఐకి చెందిన 31 మంది అధికారులకు రాష్టప్రతి పోలీసు పతకాలను, పోలీసు పతకాలను ప్రదానం చేసింది.

08/15/2016 - 08:09

ఇంఫాల్, ఆగస్టు 14: రాజకీయాల్లో చేరాలనే తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని మణిపూర్ ‘ఉక్కు మహిళ’ ఇరోం షర్మిల స్పష్టం చేశారు. మణిపూర్‌లో వివాదాస్పదమైన సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (అఫ్‌స్పా) అమలును రద్దు చేయాలన్న తన ప్రచారానికి రాజకీయాల్లో చేరడం ద్వారా నూతన దశ మొదలవుతుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.

08/15/2016 - 07:59

న్యూఢిల్లీ, ఆగస్టు 14: ఉత్తర కాశ్మీరులోని హిమాలయ సానువుల్లో దాదాపు 13 వేల అడుగుల ఎత్తున ఎముకలను కొరికే తీవ్రమైన చలిలో చొరబాటుదారులతో వీరోచితంగా పోరాడి నలుగురు ఉగ్రవాదులను హతమార్చిన తర్వాత ప్రాణాలు కోల్పోయిన హవల్దార్ హంగ్పన్ దాదా (36) దేశ అత్యున్నత సైనిక పురస్కారమైన ‘అశోక చక్ర’ అవార్డును గెలుచుకున్నారు.

08/15/2016 - 07:59

న్యూఢిల్లీ, ఆగస్టు 14: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర, రాష్ట్ర భద్రతా బలగాలకు చెందిన మొత్తం 948 మంది పోలీసు సిబ్బందికి ఆదివారం సాహస, సేవా పతకాలను ప్రదానం చేశారు. వీటిలో అత్యున్నతమైన రాష్టప్రతి సాహస పోలీసు పతకాన్ని (పిపిఎంజి) ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసు (ఐటిబిపి) విభాగానికి చెందిన ముగ్గురు సిబ్బందికి అందజేశారు.

08/15/2016 - 06:50

న్యూఢిల్లీ, ఆగస్టు 14:దళితులు, మైనార్టీలపై జరుగుతున్న దాడుల్ని కఠినంగా అణచివేయాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. 70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం జాతినుద్దేశించి మాట్లాడిన రాష్టప్రతి విచ్ఛిన్నకర, విషపూరిత ధోరణుల్ని ఎండగట్టారు. ప్రజాస్వామ్యమంటే నిర్ణీత కాల వ్యవధిలో ప్రభుత్వాలను ఎన్నుకోవడం మాత్రమే కాదన్న వాస్తవాన్ని విస్మరించకూడదన్నారు.

08/15/2016 - 06:36

న్యూఢిల్లీ, ఆగస్టు 14: ఉగ్రవాదానికి ఎదురెళ్లి సిమి ముష్కరుల ఎదురు కాల్పుల్లో అసువులు బాసిన తెలంగాణ ఎస్‌ఐ దూదేకుల సిద్దయ్య, కానిస్టేబుల్ చౌగోని నాగరాజులకు రాష్టప్రతి శౌర్య పతాకాలు లభించాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలందించిన పోలీసులకు కేంద్రం ఏటా ప్రకటించే శౌర్య పతకాలు, ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంటరీ అవార్డులు 38మందికి లభించాయి.

08/14/2016 - 15:25

శ్రీనగర్:జమ్ముకాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ కాల్పులకు తెగబడింది. పూంఛ్ సెక్టార్ పరిథిలో ఆదివారం తెల్లవారుఝాము 3 గంటలనుంచి ముందస్తు హెచ్చరికలు లేకుండా కాల్పులకు తెరతీసింది. భారతసైన్యం దీటుగా జవాబిస్తోంది. నాలుగు నెలల తరువతా పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.

08/14/2016 - 07:49

న్యూఢిల్లీ, ఆగస్టు 13: జైషే మొహమ్మద్ ఉగ్రవాది మసూద్ అజార్‌పై ఐరాస నిషేధం విధించకుండా అడ్డుకోవడం, అలాగే ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వానికి మెలికలు పెట్టడం సహా అనేక వివాదాస్పద అంశాలను చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈతో జరిపిన చర్చల్లో భారత్ ప్రస్తావించింది. దాదాపు మూడు గంటలకు పైగా వాంగ్ ఈతో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ శనివారం చర్చలు జరిపారు.

08/14/2016 - 07:44

న్యూఢిల్లీ, ఆగస్టు 13: ఘనంగా అత్యంత భద్రతాయుత పరిస్థితుల మధ్య 70వ స్వాంతత్య్ర దినోత్సవాన్ని జరుపుకోడానికి భారత్ సన్నద్ధమవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించే ఎర్రకోట చుట్టూ కనీవినీ ఎరుగని రీతిలో విస్తృత భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో కూడా రెప్పవాల్చని నిఘాకు అధికార వర్గాలు సమాయత్తం అవుతున్నాయి.

Pages