S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/14/2016 - 07:44

కకోరీ (యూపీ), ఆగస్టు 13: స్వాతంత్య్రం వచ్చాక సుదీర్ఘకాలం అధికారం చెలాయించిన కాంగ్రెస్ దేశాభివృద్ధిని పట్టించుకోలేదని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విరుచుకుపడ్డారు. అరవై ఏళ్ల కుటుంబ పాలనలో అభివృద్ధి ఊసేలేదని ఆయన ఆరోపించారు. బిజెపి ప్రభుత్వంలోనే అభివృద్ధి చెందుతోందని ఆయన చెప్పారు. ‘అరవై ఏళ్లు అధికారంలో ఉన్న నెహ్రూ-గాంధీ కుటుంబం అభివృద్ధిపై దృష్టిపెట్టలేదు.

08/14/2016 - 07:43

డల్లాస్, ఆగస్టు 13: చైనాలాంటి దేశాలనుంచి ఉద్యోగాలను అమెరికాకు తీసుకువస్తానని అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. పెన్సిల్వేనియాలో జరిగిన ఒక ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్ పాల్గొని ప్రసంగించారు. అమెరికానుంచి తరలివెళ్లిన ఉద్యోగాలన్నిటినీ తిరిగి తీసుకు వస్తామని ఆయన చెప్పారు.

08/14/2016 - 07:43

జమ్ము, ఆగస్టు 13: పాకిస్తాన్ ఆక్రమణలోని ఆక్రమిత కాశ్మీర్ ప్రజలకు విమోచనం కలిగించేందుకు ఉద్యమం చేపడతామని ప్రధాన మంత్రి కార్యాలయ వ్యవహారాల మంత్రి జితేంద్ర సింగ్ శనివారం నాడిక్కడ స్పష్టం చేశారు. ‘మరో స్వేచ్ఛా పోరాటాన్ని చేపట్టాల్సి ఉంది. అది పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న పిఓకె ప్రాంత ప్రజలకు స్వేచ్ఛను కల్పించి వారు భారత్‌లోకి తిరిగి వచ్చేలా చేయడం..’అని ఆయన అన్నారు.

08/14/2016 - 07:42

ముంబయి, ఆగస్టు 13: బాలీవుడ్ నటుడు షారుక్‌ఖాన్ అమెరికాలోని విమానాశ్రయంలో తనను నిర్బంధించి, విడుదల చేసిన వెంటనే తన దేశభక్తిని చాటుకోవలసిందని, స్వదేశానికి తిరిగి రావలసిందని శివసేన వ్యాఖ్యానించింది. ‘మీరు ఈ రీతిలో నన్ను అవమానిస్తే నేను మీ దేశంలో అడుగుపెట్టను’ అని షారుక్ అమెరికాకు తెగేసి చెప్పవలసి ఉండిందని పేర్కొంది.

08/14/2016 - 07:42

న్యూఢిల్లీ, ఆగస్టు 13: ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ వద్ద గత నెలలో తన తల్లితోపాటు సామూహిక అత్యాచారానికి గురయిన బాలిక శనివారం రాష్ట్ర మంత్రి, సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు ఆజంఖాన్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమపై జరిగిన నేరాన్ని ‘రాజకీయ కుట్ర’గా పేర్కొన్న మంత్రిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆ బాలిక అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

08/14/2016 - 07:41

న్యూఢిల్లీ, ఆగస్టు 13: పాకిస్తాన్ గనుక కాశ్మీర్ విషయంలో తలదూర్చడం, అక్కడ హింసను, ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడం మానక పోతే బలూచిస్థాన్‌లో ఆ ప్రభుత్వం పాల్పడుతున్న అకృత్యాలను తాము బైటపెట్టాల్సి వస్తుందంటూ ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం చేసిన హెచ్చరిక బాగానే పని చేస్తున్నట్లు కనిపిస్తోంది.

08/14/2016 - 07:40

న్యూఢిల్లీ, ఆగస్టు 13: రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ కూతురు శర్మిష్ట ముఖర్జీ తనకు ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా అసభ్య సందేశాలు పంపిస్తున్న ఓ వ్యక్తి గుట్టును బట్టబయలు చేశారు. అత్యంత నీచమైన అశ్లీలమైన సందేశాలు పంపిస్తున్న పార్థామండల్ అనే వ్యక్తికి సంబంధించిన ఫేస్‌బుక్ ప్రొఫైల్, అతను పంపించిన సందేశాలను తన టైమ్‌లైన్‌లో ఉంచేసి అతని గుట్టు రట్టు చేశారు.

08/14/2016 - 04:09

న్యూఢిల్లీ, ఆగస్టు 13: పార్లమెంటు సభ్యుల వేతనాన్ని యాభై వేల నుండి లక్ష రూపాయలకు పెంచటంతోపాటు అన్ని అలవెన్సులు కలిపి మొత్తం వేతనాన్ని రెండు లక్షల ఎనభై వేలకు పెంచాలనే ప్రతిపాదనను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తిరస్కరించినట్లు తెలిసింది. బిజెపి సభ్యుడు యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోని పార్లమెంటరీ కమిటీ ఎంపీల వేతనాలను పెంచాలని సిఫారసు చేసింది.

08/13/2016 - 18:02

న్యూఢిల్లీ : దేశభక్తిని, ప్రజలలో ఐక్యతను పెంపొందించటమే తిరంగా యాత్ర ముఖ్య ఉద్దేశ్యమని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. గజల్ శ్రీనివాస్ రూపొందించిన ‘తిరంగా యాత్ర’ నేపథ్య గీతాన్ని ఆవిష్కరణ సందర్భంగ జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ 70వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకుల సందర్భంగా నాలుగు భాషల్లో ఈ గీతాన్ని రూపొందించినట్లు వెల్లడించారు.

08/13/2016 - 18:01

ఢిల్లీ : వేతనాలు పెంచాలని రాజ్యసభలో ఎంపీలు డిమాండ్ చేశారు. ఏడవ వేతన సవరణ సంఘం సిఫార్సులకు అనుగుణంగా ఎంపీల సెక్రటరీల వేతనాలు తమ కంటే అధికంగా పెరుగుతున్నాయని వారు అన్నారు. ఎంపీల వేతనాలు పెంచాలని పార్లమెంటరీ కమిటీ నివేదిక ఇచ్చినా ప్రధాని ఎలాంటి చర్య తీసుకోలేదని అన్నారు. ఆయన విదేశీ పర్యటనలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్‌శర్మ అన్నారు.

Pages