S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/12/2016 - 01:59

న్యూఢిల్లీ, ఆగస్టు 11: ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ తీసుకునే అంశంపై తెలుగుదేశం పార్టీలో తీవ్ర స్థాయి విభేదాలు నెలకొన్నాయి. పార్టీకి చెందిన సీనియర్ నేతలు కొందరు ప్రత్యేక ప్యాకేజీ తీసుకుని ఈ సమస్యకు తెరదించాలని ఆలోచిస్తుంటే, మరి కొందరు మాత్రం ప్రత్యేక హోదా సాధించుకోవలసిందే తప్ప ప్యాకేజీతో రాజీ కూడదని పట్టుపడుతున్నారు.

08/12/2016 - 01:57

న్యూఢిల్లీ, ఆగష్టు 11: ఉమ్మడి ఉన్నత విద్యామండలి ఆస్తుల పంపకాలపై ఇటీవల ఇచ్చిన తీర్పును పున:పరిశీలించాలంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ ఏడాది మార్చి 18న ఉమ్మడి ఉన్నత విద్యామండలి ఆస్తుల పంపకాలపై తీర్పు ఇవ్వటం తెలిసిందే. ఈ తీర్పును పున:పరిశీలించాలంటూ తెలంగాణా సర్కారు సుప్రీం కోర్టులో ఏప్రిల్ 18 నాడు రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.

08/12/2016 - 01:54

న్యూఢిల్లీ, ఆగస్టు 11: ఆంధ్రప్రదేశ్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటి) ఏర్పాటుకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. ఎన్‌ఐటి స్థాపనకు అవకాశమిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సైన్స్ ఎడ్యుకేషన్, రీసర్చ్ సవరణ బిల్లుపై ప్రణబ్ సంతకం చేశారు.

08/12/2016 - 01:16

న్యూఢిల్లీ, ఆగస్టు 11: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 15న ఎర్రకోట బురుజుపై నుంచి తాను చేసే ప్రసంగానికి సలహాలు ఇవ్వవలసిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలను కోరారు. ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగానికి సలహాలు ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తూ కొన్ని ప్రభుత్వ వెబ్‌సైట్లలో సందేశాలను ఉంచారు.

,
08/12/2016 - 01:15

న్యూఢిల్లీ, ఆగస్టు 11: గోరక్షణ పేరుతో సంఘ విఘాతక కృత్యాలకు పాల్పడుతున్న సంఘ విద్రోహక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. ఈ రకమైన విపరీత ధోరణులను ఉమ్మడిగానే ఎదుర్కోవాలని పిలుపునిచ్చింది. దేశంలో దళితులపై జరుగుతున్న దాడులకు సంబంధించి గురువారం లోక్‌సభలో జరిగిన విస్తృత చర్చ జరిగింది.

08/12/2016 - 01:12

న్యూఢిల్లీ, ఆగస్టు 11: వ్యాన్ ఢీకొని తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిపోయిన సాటి మనిషిని ఆస్పత్రికి తరలించకపోయినా కనీసం పోలీసులకు కూడా సమాచారం అందించని అమానుష ఘటన ఇది. రోడ్డుమీద పడిపోయి అల్లల్లాడుతున్న ఓ సెక్యూరిటీ గార్డును ఆ రోడ్డు మీదుగా పోయే ఎంతోమంది చూస్తూ వెళ్లిపోయారే తప్ప అతడిని ఆదుకోవడానికి మాత్రం ప్రయత్నించలేదు.

08/12/2016 - 01:10

లక్నో, ఆగస్టు 11: మరికొన్ని నెలల వ్యవధిలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం ఆశిస్తున్న బిజెపికి అనుకోని వరమే ఎదురైంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమాజ్‌వాది పార్టీసహా కాంగ్రెస్, బిఎస్‌పిలకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు గురువారం బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాగా, ఇద్దరు బిఎస్‌పికి, ఒకరు సమాజ్‌వాది పార్టీకి చెందినవారు.

08/12/2016 - 01:09

న్యూఢిల్లీ, ఆగస్టు 11: కాశ్మీర్ విషయంలో పాక్ వ్యవహరిస్తున్న తీరును భారత్ మరోసారి తీవ్రంగా తప్పుబడుతూ, ఈ విషయంలో జోక్యం చేసుకునే హక్కు పాక్‌కు ఎంతమాత్రం లేదని స్పష్టం చేసింది. కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయం చేయడానికి ప్రయత్నించినంతమాత్రాన భారత్‌లో సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడడం, చొరబాట్లను ప్రోత్సహిస్తున్న దాని పాపం తుడిచిపెట్టుకుపోదని కూడా స్పష్టం చేసింది. ‘కాశ్మీర్ సమస్య భారత్ అంతర్గత వ్యవహారం.

08/12/2016 - 01:09

న్యూఢిల్లీ, ఆగస్టు 11: ఆక్రమిత కాశ్మీర్‌లో పాకిస్తాన్ సర్కార్‌కు ప్రజల నుంచి సెగ మొదలైంది. కాశ్మీర్‌పై కాదు ఆక్రమిత కాశ్మీర్‌పైనే ఇక చర్చలంటూ భారత ప్రభుత్వం కరాఖండిగా తేల్చేసిన నేపథ్యంలో ఆజాదీ కాశ్మీర్‌గా పేర్కొంటున్న ఈ ప్రాంత ప్రజలు పాక్ దురాక్రమణపై నిప్పులు చెరుగుతున్నారు.

08/12/2016 - 01:07

బహ్రయిచ్ (యూపీ), ఆగస్టు 11: చికిత్సకోసం తల్లిదండ్రులు లంచం ఇవ్వలేకపోవడమే ఆ పసిబిడ్డకు శాపమైంది. సకాలంలో సరైన చికిత్స అందక యూపీలోని ఓ ప్రభుత్వం ఆసుపత్రిలో పదినెలల బాబు మృత్యువాత పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లో ఈ అమానుషం చోటుచేసుకుంది. జ్వరంతో ఆసుపత్రికి వెళ్లిన బాలుడికి సకాలంలో వైద్య సేవలందించకపోగా, ఏదో ఇంజక్షన్ ఇచ్చి తల్లిదండ్రులకు పుట్టెడు శోకం మిగిల్చారు.

Pages