S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/04/2016 - 08:00

న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు పరిష్కారానికి కేం ద్రం హామీ ఇచ్చినందునే ప్రస్తుతానికి ఆందోళనలు విరమించినట్లు టీపీపీ ఎంపీలు చెప్పారు. బుధవారం నాడు టీడీపీ ఎంపీలు మురళీమోహన్, అవంతిశ్రీనివాస్, రామ్మోహన్‌నాయుడు విలేకరులతో మాట్లాడారు. కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, అనంత్‌కుమార్ ఆంధ్రప్రదేశ్‌కి తప్పక సాయం చేస్తామని చెప్పారని అందుకే నిరసనలకు విరామం ఇచ్చామన్నారు.

08/04/2016 - 07:57

న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సభ్యులు బుధవారం లోక్‌సభ పోడియం వద్ద రెండు గంటల పాటు ధర్నా చేశారు. వైకాపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి, సభ్యులు సుబ్బారెడ్డి, బుట్టా రేణుక, వర ప్రసాదరావు, అవినాష్‌రెడ్డి ఉదయం 11గంటలకు సభ సమావేశం కాగానే పోడియం వద్దకు వచ్చి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నినాదాలు ప్రారంభించారు.

08/04/2016 - 06:24

న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఏకీకృత మార్కెట్ దిశగా భారత్ బలమైన ముందడుగు వేసింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎన్నడూ చేపట్టని రీతిలో అతిపెద్ద పన్నుల సంస్కరణల వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. సెంట్రర్ ఎక్సైజ్ సుంకం,రాష్ట్రాల వ్యాట్/ అమ్మకం పన్నులు సహా అన్ని రకాల పరోక్ష పన్నులు ఒకే జిఎస్‌టి పన్నుల విధానం పరిధిలోకి వచ్చే వ్యవస్థకు ఊతం లభించింది.

08/04/2016 - 06:21

న్యూఢిల్లీ, ఆగస్టు 3: దేశంలో పరోక్ష పన్నులకు సంబంధించి విప్లవాత్మక మార్పు తీసుకువచ్చే వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదించటం చారిత్రక పరిణామమని ప్రధాని నరేంద్రమోదీ అభివర్ణించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర లక్ష్య సాధనకు సహకరించిన అన్ని పార్టీల నాయకులకు ధన్యవాదాలు చెప్పారు.

08/04/2016 - 06:17

ఇస్లామాబాద్, ఆగస్టు 3:‘గో బ్యాక్..గో బ్యాక్..అంటూ ఉగ్రవాద సంస్థలు తీవ్ర స్ధాయి నిరసనలు, ప్రదర్శనల మధ్య భారత హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం ఇస్లామాబాద్ అడుగు పెట్టారు. ఉగ్రవాద సంస్థలు, వాటి మద్దతుదారులు వీధుల్లో పడి నిరసనలు తీవ్రస్థాయిలో ఉద్యమిస్తున్నప్పటికీ వారిని నిరోధించే ప్రయత్నాలేవీ జరుగలేదు. ముఖ్యంగా అత్యంత సునిశితమైన రాజ్‌నాథ్ పర్యటన ప్రాధాన్యతను కూడా పట్టనట్టే వ్యవహరించింది.

08/04/2016 - 06:14

న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వటంతోపాటు రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలు గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించనున్నారు. నరేంద్ర మోదీ మొదట తెలుగుదేశం ఎంపీలతో సమావేశమై ఆ తరువాత చంద్రబాబును కలుస్తారని అంటున్నారు.

08/04/2016 - 06:03

న్యూఢిల్లీ, ఆగస్టు 3: కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం అమృత్ పథకం కింద రెండు తెలుగు రాష్ట్రాలకు 1,432 కోట్ల పెట్టుబడులకు అనుమతి మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు 877 కోట్లు, తెలంగాణాకు 555 కోట్ల రూపాయలు పెట్టుబడులకు అనుమతి లభించింది. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 877 కోట్ల పెట్టుబడుల్లో కేంద్ర సహాయం 352 కోట్లు.

08/03/2016 - 17:47

గాంధీనగర్: గుజరాత్ సిఎం ఆనందిబెన్ పటేల్ తన రాజీనామా పత్రాన్ని బుధవారం గవర్నర్ ఓపీ కోహ్లీకి సమర్పించారు. ముఖ్యమంత్రి రేసులో ఆరోగ్యమంత్రి నితిన్ పటేల్, గుజరాత్ బిజెపి చీఫ్ విజయ్ రూపాణి, కేంద్ర మంత్రి పురుషోత్తమ్ రుపాలా, అసెంబ్లీ స్పీకర్ గణ్‌పత్ వాసవ ఉన్నారు. ఆనందిబెన్ రాజీనామాను బిజెపి పార్లమెంటరీ బోర్డు కూడా ఆమోదించిందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడించారు.

08/03/2016 - 17:22

దిల్లీ: సహారా గ్రూప్‌ అధినేత సుబ్రతారాయ్‌ పెరోల్‌ను సెప్టెంబర్‌ 16వరకు సుప్రీంకోర్టు మరోసారి పొడిగించింది. సహారా గ్రూప్‌ అవకతవకలకు పాల్పడిన నేపథ్యంలో 2014 మార్చిలో సుబ్రతరాయ్‌కు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 3తో పెరోల్‌ గడువు ముగిసింది. రాయ్‌ సుప్రీంను ఆశ్రయించారు. ఈ మేరకు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు రూ.300 కోట్ల డిపాజిట్‌ను కట్టాల్సిందిగా ఆదేశించింది.

08/03/2016 - 16:37

దిల్లీ: వరుసగా రెండో రోజు బుధవారం బంగారం ధర పెరిగింది. రూ. 220 పెరగడంతో పది గ్రాముల పసిడి ధర రూ. 31,250కి చేరింది. సింగపూర్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,364.30 అమెరికన్‌ డాలర్లుగా ఉంది. వెండి ధర ఒక్క రోజే రూ. 470 పెరిగింది. దేశీయ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 47,820కి చేరింది.

Pages