S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/28/2015 - 06:19

న్యూఢిల్లీ, నవంబర్ 27: మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరుకావాలని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీచేసింది. ఆయనతో పాటు ఆయన సహచరులకు కూడా సమన్లు పంపింది. విచారణ నిమిత్తం డిసెంబర్ మొదటి వారంలో తమ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని సమన్లు జారీచేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అలాగే ఆయన సహచరులకు కూడా ఇదే రకమైన ఆదేశాలు అందాయని పేర్కొన్నాయి.

11/28/2015 - 06:19

న్యూఢిల్లీ, నవంబర్ 27: కార్మికుల సంక్షేమం కోసం అనేక వినూత్న పథకాలను ప్రారంభించి కార్మిక శాఖ మంత్రిగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అడుగుజాడలలోనే తమ శాఖ పని చేస్తోందని కేంద్ర కార్మిక మంత్రి బం డారు దత్తాత్రేయ స్పష్టం చేశారు.

11/28/2015 - 06:18

బాలాసోర్ (ఒడిశా), నవంబర్ 27: దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన అగ్ని-1 క్షిపణిని భారత్ శుక్రవారం విజయవంతంగా ప్రయోగించింది. అణుపదార్థాలను మోసుకెళ్లగలిగే శక్తిగల ఈ క్షిపణికి 700 కిలో మీటర్ల దూరంలో గల లక్ష్యాన్ని ఛేదించగలిగే సామర్థ్యం ఉంది. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ (ఎస్‌ఎఫ్‌సి) శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఒడిశా తీరంలోని టెస్ట్ రేంజ్ నుంచి అగ్ని-1 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారు.

11/28/2015 - 06:16

ముంబయి, నవంబర్ 27: రిలయన్స్ ముంబై మెట్రోలో పనిచేస్తున్న షీనా బోరా రాజీనామా పత్రంపై తనతో బలవంతంగా ఫోర్జరీ చేయించారని ఇంద్రాణి వ్యక్తిగత కార్యదర్శి కాజల్ శర్మ సిబిఐ విచారణలో వెల్లడించింది. షీనా సంతకాన్ని ఫోర్జరీ చేసేందుకు తొలుత తాను అంగీకరించలేదని, కానీ ఒత్తిడి చేయడం వల్ల చేయాల్సి వచ్చిందని పేర్కొంది. ఇంద్రాణికి చెందిన ఐఎన్‌ఎక్స్ కంపెనీలో 2002 నుంచి 2007 వరకు కాజల్ శర్మ ఉద్యోగిగా పనిచేశారు.

11/28/2015 - 05:19

న్యూఢిల్లీ, నవంబర్ 27: న్యాయవాదులు సమ్మెకు దిగడం లేదా కోర్టుల బహిష్కరణకు పిలుపునివ్వడం చేయరాదని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. అంతేకాదు ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి బార్ అసోసియేషన్లకు ఒక నెల రోజుల గడువు ఇచ్చింది. ‘మా దృష్టిలో లాయర్లు సమ్మెకు దిగరాదు’ అని న్యాయమూర్తులు కురియన్ జోసెఫ్, అరుణ్ మిశ్రాలతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది.

11/28/2015 - 05:15

న్యూఢిల్లీ, నవంబర్ 27: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులను నియమించే పద్ధతి ఏ చట్టం ప్రకారం కూడా సమర్థనీయం కాదని భారత ప్రభుత్వం పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులను నియమించటానికి ప్రాతిపదికగా ఉన్న కొలీజియం వ్యవస్థ చట్టబద్ధతను ప్రభుత్వం ప్రశ్నించింది.

11/28/2015 - 05:07

న్యూఢిల్లీ, నవంబర్ 27: భారత చరిత్ర పరిశోధనా మండలి (ఐసిహెచ్‌ఆర్) చైర్మన్‌గా నియమితులై 16 నెలలు తిరక్కముందే యల్లాప్రగడ సుదర్శన రావు‘వ్యక్తిగత కారణాల’పై ఆ పదవికి రాజీనామా చేశారు. సుదర్శన రావుకు నెలకు లక్షన్నర రూపాయల గౌరవ వేతనం మంజూరు చేయాలన్న ప్రతిపాదనను మానవ వనరుల మంత్రిత్వ శాఖ తోసిపుచ్చడంపై ఆయన అసంతృప్తితో ఉన్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.

11/28/2015 - 03:48

న్యూఢిల్లీ, నవంబర్ 27: దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని పరిరక్షిస్తామని, ప్రజాస్వామ్య, సామ్యవాద, లౌకిక ఆదర్శాలకు త్రికరణ శుద్ధిగా కట్టుబడి ఉంటామని లోక్‌సభ ప్రతిన చేసింది. రాజ్యాంగ సార్వభౌమత్వాన్ని, పవిత్రతను పరిరక్షిస్తామని, దాని ఆదర్శాలు, నియమ నిబంధనల పట్ల నిబద్ధతతో వ్యవహరిస్తామని ముక్తకంఠంతో ఉద్ఘాటించింది.

11/28/2015 - 03:46

న్యూఢిల్లీ, నవంబర్ 27: తమ ప్రభుత్వానికి భారతీయతే ఏకైక మతమని, రాజ్యాంగమే ఏకైక పవిత్ర గ్రంథమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశంలోని అన్ని మతాలు, వర్గాల ప్రయోజనాల పరిరక్షణకు నిబద్ధతతో కృషి చేస్తామన్నారు.

11/28/2015 - 03:44

న్యూఢిల్లీ, నవంబర్ 27: ఆంధ్రకు ప్రత్యేక హోదా ప్రకటించే విషయంపై చర్చల ప్రక్రియ కొనసాగుతోందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. రాష్ట్ర విభజన బిల్లుపై చర్చ జరిగినప్పుడు ఐదేళ్లుకాక పదేళ్లపాటు ప్రత్యేక కేటగిరి హోదా ఇస్తామని ప్రకటించామని ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ అన్నారు.

Pages