S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/03/2016 - 06:38

న్యూఢిల్లీ,ఆగష్టు 2:ఏపీ విభజన చట్టంలో హామీలు ఇచ్చి, ఎన్నికలకు ముందు వాగ్దానాలూ చేసినప్పుడు మళ్లీ పార్లమెంట్‌లో చర్చలెందుకని వైకాపా ఎంపీలు ప్రశ్నించారు. మంగళవారం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌తో జరిగిన అఖిల పక్ష సమావేశం అనంతరం పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి,సుబ్బారెడ్డి,బుట్టా రేణుక,వరప్రసాద్‌రావులు విలేఖరులతో మాట్లాడారు.

08/03/2016 - 06:37

హైదరాబాద్, ఆగస్టు 2: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేయటం రాష్ట్ర ప్రజలను అవమానించడమే అవుతుందని ఎపిసిసి నాయకుడు, మాజీ మంత్రి డాక్టర్ ఎస్. శైలజానాథ్ అన్నారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో చేసిన ప్రకటనపై డాక్టర్ శైలజానాథ్ మంగళవారం విలేఖరుల సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

08/03/2016 - 06:36

న్యూఢిల్లీ, ఆగస్టు 2: గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఆనందీబెన్ పటేల్ స్థానే కొత్త సిఎంను ఎన్నుకునే అంశాన్ని బుధవారం జరిగే బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చర్చించనున్నారు. ఆనందీ రాజీనామాను ఆమోదించడంతో పాటు కొత్త సిఎంగా ఎవర్ని నియమించాలన్న దానిపైనా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది.

08/03/2016 - 06:08

న్యూఢిల్లీ, ఆగస్టు 2:‘ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను అమలు చేస్తాం. ఇందుకు సంబంధించి త్వరలోనే ఒక ప్రకటన చేస్తాం. అంతవరకు ఎంపిలు ఓపిక పట్టాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించటంతో లోక్‌సభలో ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేస్తున్న తెలుగుదేశం ఎంపిలు తమ నిరసన ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమించుకున్నారు.

08/03/2016 - 05:29

న్యూఢిల్లీ, ఆగస్టు 2:గత కొన్ని నెలలుగా అధికార, విపక్షాల మధ్య తీవ్ర వివాదానికి కారణమవుతున్న వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)బిల్లు బుధవారం పార్లమెంట్‌లో చర్చకు రానుంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ బిల్లుకు పెద్దల సభ ఆమోద ముద్ర వేయించుకోవాలన్న పట్టుదలతో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం అన్ని పక్షాల మద్దతు లభించగలదన్న ధీమాను వ్యక్తం చేస్తోంది.

08/02/2016 - 17:17

దిల్లీ: 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక సాయం కింద రూ.500కోట్లు విడుదల చేసినట్లు కేంద్రమంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ తెలిపారు. ఏపీకి ఆర్థిక సాయంపై విభజన చట్టంలో ఎక్కడా పేర్కొనలేదని తెలుగుదేశం పార్టీ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

08/02/2016 - 14:45

ముంబయి: ఔరంగాబాద్‌ అక్రమ ఆయుధాల కేసులో ఏడుగురు దోషులకు ప్రత్యేక కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది. మరో ఇద్దరికి 14ఏళ్లు, ముగ్గురికి 8ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2006లో జరిగిన ఈ కేసుకు సంబంధించి కోర్టు 12 మందిని దోషులుగా ఇటీవల నిర్ధారించింది. ముంబయి దాడుల (26/11) కేసులో నిందితుడు అబు జుందాల్‌ సహా ఏడుగురు దోషులకు జీవిత ఖైదు విధించింది.

08/02/2016 - 13:53

దిల్లీ: లోక్‌సభలో మంగళవారం నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ, వైసీపీ ఎంపీలతో స్పీకర్ సుమిత్రామహాజన్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. స్పీకర్ సభను కొనసాగిస్తుండగా, మరోవైపు టీడీపీ, వైసీపీ ఎంపీలు నిరసనను కొనసాగిస్తున్నారు. నిరసన విరమించాలని స్పీకర్ కోరగా, ప్రత్యేక హోదా ప్రకటించేవరకు తమ నిరసన కొనసాగుతుందని ఎంపీలు స్పష్టం చేశారు.

08/02/2016 - 13:49

దిల్లీ: గుజరాత్‌లో తాజాగా ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనందీబెన్ కారకురాలు కాదని, ప్రధాని మోదీ పాలన వల్లే శాంతిభద్రతలు క్షీణించాయని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆనందీబెన్‌ను బలిపశువును చేసినప్పటికీ ఆమె పదవీ త్యాగం వల్ల గుజరాత్‌లో బిజెపి బలపడలేదన్నారు.

08/02/2016 - 12:04

దిల్లీ: రాజ్యసభలో బుధవారం నాడు వస్తుసేవల వినియోగ బిల్లు (జిఎస్‌టి) చర్చకు రానున్న నేపథ్యంలో తమ పార్టీ సభ్యులకు బిజెపి, కాంగ్రెస్ విప్ జారీ చేశాయి. రాజ్యసభకు వరసగా మూడు రోజులు విధిగా హాజరుకావాలని విప్‌లో పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో పాటు ప్రధాన పార్టీలు ఇప్పటికే జిఎస్‌టి బిల్లుకు మద్దతు ప్రకటించారు.

Pages