S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/02/2016 - 02:43

న్యూఢిల్లీ, ఆగస్టు 1: జమాత్ ఉద్ దావా (జెయుడి), హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలు బహిరంగ హెచ్చరికలు చేసినప్పటికీ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం పాకిస్తాన్‌కు వెళ్తున్నారు. సార్క్ దేశాల మంత్రుల స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు పాకిస్తాన్‌కు వెళ్తున్న రాజ్‌నాథ్ సింగ్ ఆ దేశ హోంమంత్రితో ఎలాంటి ద్వైపాక్షిక చర్చలు జరుపబోరని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

08/02/2016 - 02:41

న్యూఢిల్లీ, ఆగస్టు 1:కరువు పీడిత రాష్ట్రాల్లోని రైతులకు ఆర్థిక సహాయం అందించాలంటూ తాము జారీ చేసిన ఆదేశాలు అమలు కాకపోవడం పట్ల సుప్రీం కోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతులకు ఏ విధంగానూ రుణాలు అందడం లేదన్న విషయం వాస్తవమేనని తేలిపోయిందని తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించింది. ‘వర్షాలు మొదలయ్యాయి.

08/02/2016 - 02:38

న్యూఢిల్లీ, ఆగస్టు 1: సౌదీ అరేబియాలో చిక్కుకుపోయిన సుమారు పది వేల మంది భారతీయులను స్వదేశానికి తీసుకు వస్తామని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సోమవారం పార్లమెంటుకు చెప్పారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.కె.సింగ్ ఈ తరలింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు సౌదీ అరేబియాకు వెళ్తున్నారని ఆమె పార్లమెంటు ఉభయసభల్లో చేసిన ప్రకటనలో వెల్లడించారు.

08/02/2016 - 02:36

న్యూఢిల్లీ, ఆగస్టు 1: సొహ్రాబుద్దీన్ షేక్ బూటకపుఎన్‌కౌంటర్ కేసులో బిజెపి అధ్యక్షుడు అమిత్ షాకు ఊరట లభించింది. ఆయన్ని నిర్దోషిగా ప్రకటిస్తూ దిగువ కోర్టులు ఇచ్చిన క్లీన్‌చిట్‌ను సుప్రీం కోర్టు సోమవారం ధ్రువీకరించింది. ఈ కేసును తిరగదోడాలంటూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్టు న్యాయమూర్తులు ఎస్‌ఎ బాబ్దే, అశోక్ భూషణ్‌లతో కూడిన సుప్రీం కోర్టు బెంచి స్పష్టం చేసింది.

08/02/2016 - 02:36

అహ్మదాబాద్, ఆగస్టు 1: మరో మూడు నెలల్లో 75 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్న తనను పార్టీ సంప్రదాయం ప్రకారం అన్ని రకాల బాధ్యతల నుంచి విముక్తం చేయాలంటూ గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ చేసిన అభ్యర్థనను బిజెపి నాయకత్వం ఆమోదించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి సోమవారం రాజీనామా చేయడం, వెంటనే దానిని ఆమోదించడం వెంటనే జరిగిపోయాయి.

08/02/2016 - 02:33

లండన్, ఆగస్టు 1: అన్ని సంస్కృతులు, వాటిలోని భిన్నత్వాలకు సమానమైన గౌరవం లభించినప్పుడే ప్రపంచం గుభాళిస్తుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్ అన్నారు. హిందూయిజం ఒక జీవన విధానమని ఆయన అన్నారు.

08/02/2016 - 02:32

నోయిడా, ఆగస్టు 1: బులంద్‌షహర్‌లో తల్లీకూతుళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను తమకు అప్పగించాలని, వారిని ప్రజల మధ్యలో నిలబెట్టి కాల్చిపారేస్తామని బాధితుల బంధువులు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌ను కోరారు. ఢిల్లీ-కాన్పూర్ జాతీయ రహదారిపై జరిగిన ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా విస్మయం కలిగించిన సంగతి తెలిసిందే.

08/02/2016 - 02:30

న్యూఢిల్లీ, ఆగస్టు 1: న్యూయార్క్ నగరానికి చెందిన ఓ టాబ్లాయిడ్ పెను సంచలనాన్ని రేకెత్తించింది. అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ మోడల్‌గా ఉన్నప్పటి నగ్న ఫొటోలను ప్రచురించింది. 1995లో ఫ్రాన్స్ మ్యాగజిన్‌కోసం అలె డె బాసెవిల్లే అనే ఫొటోగ్రాఫర్ వీటిని తీసినట్టు న్యూయార్క్ పోస్టు తెలిపింది.

08/02/2016 - 02:27

చెన్నై/న్యూఢిల్లీ, ఆగస్టు 1: అన్నాడింకె ఎంపి శశికళ పుష్పను ఆ పార్టీ అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పార్టీ నుంచి సోమవారం బహిష్కరించారు. ఢిల్లీ విమానాశ్రయంలో శనివారం నాడు తమిళనాడు ప్రతిపక్ష పార్టీ డిఎం కెకు చెందిన తోటి పార్లమెంట్ సభ్యుడు త్రిచి శివ చెంప చెళ్లుమనిపించిన ఆరోపణలపై శశికళను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

08/02/2016 - 02:23

బీజింగ్, ఆగస్టు 1: భద్రతాపరంగా తమకు ఎలాంటి సవాళ్లు ఎదురైనా వాటిని ముఖాముఖీ ఢీకొని నిలబడ గలిగే శక్తియుక్తులు తమకు ఉన్నాయని చైనా స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ తీరప్రాంత హక్కుల విషయంలో రాజీపడేది లేదని దక్షిణ చైనా మహాసముద్రంపై చెలరేగుతున్న వివాదాల నేపథ్యంలో మరింత ఘాటుగానే తేల్చిచెప్పింది.

Pages