S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/01/2016 - 14:50

దిల్లీ: ఈ వారంలో రాజ్యసభ సమావేశాలకు పార్టీ సభ్యులెవరూ గైర్హాజరు కావొవ్వని భాజపా ఆదేశించింది. పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులకు భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం విప్‌ జారీ చేసింది. జీఎస్టీ బిల్లు ఈ వారంలో రాజ్యసభలో చర్చకు రానున్న నేపథ్యంలో భాజపా అధిష్ఠానం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

08/01/2016 - 14:46

దిల్లీ: బాబ్లీ పర్యవేక్షక కమిటీలో ఆంధ్రప్రదేశ్‌ కొనసాగుతుందని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత బాబ్లీ ప్రాజెక్టు పట్ల ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి ఆసక్తి లేదని తెలంగాణ తరపు న్యాయవాది వైద్యనాథన్‌ వాదనలు వినిపించారు. మహారాష్ట్ర తరపున వాదించిన అంధ్యార్జున ఏపీని తొలగించాలని వాదనలు వినిపించారు.

08/01/2016 - 13:08

చెన్నై: పార్టీ ప్రతిష్టను మంటగలిపేలా ప్రవర్తించినందుకు అన్నాడిఎంకె ఎంపీ శశికళ పుష్పను ఆ పార్టీ అధినేత్రి, తమిళనాడు సిఎం జయలలిత సస్పెన్షన్ వేటు వేశారు. డిఎంకె ఎంపీ తిరుచ్చి శివపై చేయి చేసుకున్నందుకు శశికళపై ఈ క్రమశిక్షణ చర్య తీసుకున్నారు. దిల్లీ ఎయిర్‌పోర్టులో శశికళ తనపై దౌర్జన్యం చేస్తూ నాలుగుసార్లు చెంపపై కొట్టారని డిఎంకె ఎంపీ తిరుచ్చి శివ ఆరోపించారు.

08/01/2016 - 13:06

దిల్లీ: ప్రభుత్వానికి చెందిన ఖరీదైన భవంతుల్లో మాజీ ముఖ్యమంత్రులకు వసతి కల్పించనక్కర్లేదని సుప్రీం కోర్టు సోమవారం సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. దేశవ్యాప్తంగా చాలామంది మాజీ సిఎంలు ఇప్పటికీ వివిఐపిల మాదిరి విలాసవంతమైన భవనాల్లో ఏళ్లతరబడి తిష్టవేశారు. వీరికి వివిఐపిల మాదిరి భారీ భవనాలు కేటాయించనవసర లేదని కోర్టు తీర్పు చెప్పడంతో చాలా మంది సిఎంలకు స్థాన చలనం తప్పదేమో.

08/01/2016 - 12:43

దిల్లీ: రెండు రోజుల విరామం అనంతరం పార్లమెంటు ఉభయ సభలు సోమవారం ఉదయం తిరిగి ప్రారంభమయ్యాయి. ఈరోజు రాజ్యసభలో జిఎస్‌టి బిల్లు, లోక్‌సభలో రుణ రికవరీ బిల్లుపై చర్చ జరుగుతుంది.

08/01/2016 - 12:43

దిల్లీ: ఎపికి ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టిడిపికి చెందిన రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు సోమవారం ఉదయం పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, కేంద్ర నిధులు, రాయితీలను ఎపికి ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ధర్నాకు ముందు జరిగిన ఎంపీల భేటీలో నిర్ణయించారు.

08/01/2016 - 01:38

న్యూఢిల్లీ, జూలై 31: గత నాలుగు వారాల్లో వరుసగా మూడోసారి దేశంలోని పెట్రోలు వినియోగదారులకు ఊరట లభించింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చే విధంగా పెట్రోలుపై లీటరుకు రూ.1.42, డీజిల్‌పై లీటర్‌కు రూ.2.01 ధరలు తగ్గాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ఉత్పత్తుల ధరలు తగ్గటంతో ఈ వెసులుబాటును కల్పిస్తున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది.

08/01/2016 - 01:33

న్యూఢిల్లీ, జూలై 31: నేపాల్‌లోని ముక్తినాథ్ వద్ద మంచుకొండలు విరిగిపడటంతో హైదరాబాద్‌కు చెందిన ఎనిమిది మంది మహిళా యాత్రికులు చిక్కుకున్నారు. దీనిపై స్పందించిన ఢిల్లీ తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి, నేపాల్ ఎంబసి అధికారులతోను మాట్లాడారు. యాత్రికులను రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించే చర్యలు చేపట్టాలని కోరారు.

08/01/2016 - 01:32

న్యూఢిల్లీ, జూలై 31: సామాజిక శాస్తవ్రేత్త డాక్టర్ ఎంవికె శివమోహన్ విద్యారతన్ గోల్డ్ అవార్డు అందుకొన్నారు. ఇంటర్ నేషనల్ ఆఫ్ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్, ఇండియన్ సాలిడారిటీ కౌన్సిల్‌లు ఈ అవార్డును ఆయనకు ప్రకటించాయి. ఢిల్లీలోని ఇండియన్ సొసైటీ ఆఫ్ ఇంటర్నేషనల్ లా ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు.

08/01/2016 - 01:31

న్యూఢిల్లీ, జూలై 31: ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ అయిన నేషనల్ హ్యూమన్‌రైట్స్ అండ్ క్రైం కంట్రోల్ ఆర్గనైజైషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడుగా కృష్ణా జిల్లా గన్నవరానికి చెందన మెర్ల వంశీవిజయ్ కళ్యాణ్ ఎంపికయ్యారు. రాజ్యాంగం ప్రకారం ప్రజలకు దక్కాల్సిన హక్కులకోసం ఈ సంస్థ కృషి చేస్తుంది.

Pages