S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/19/2016 - 18:08

దిల్లీ: బిజెపి దిల్లీ శాఖలో కీలక బాధ్యతలు నిర్వహించిన మాజీ క్రికెటర్, ఎంపి కీర్తి అజాద్ భార్య పూనమ్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరతారన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. రాజ్యసభకు, బిజెపికి నవ్‌జ్యోత్‌సింగ్ సిద్ధూ రాజీనామా చేసిన నేపథ్యంలో కీర్తి అజాద్ భార్య కూడా బిజెపికి రాజీనామా చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.

07/19/2016 - 18:04

చండీగఢ్: తన భర్త బిజెపికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినప్పటికీ తాను మాత్రం బిజెపిలోనే ఉంటానని ఎమ్మెల్యే నవ్‌జ్యోత్ కౌర్ మంగళవారం స్పష్టం చేశారు. తన భర్త నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ బిజెపికి రాజీనామా చేసినంత మాత్రాన తాను కూడా పార్టీ మారతానని అనుకోవడంలో అర్థం లేదని ఆమె వివరించారు.

07/19/2016 - 17:14

ఢిల్లీ: గత మూడేళ్ళలో మతపరమైన విద్వేష కేసులు పెరిగినట్లు, విద్వేషాలు, మత కలహాలు రెచ్చగొట్టే వెబ్‌సైట్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు మంగళవారం లోక్ సభలో తెలిపారు. దాద్రి వంటి ఘటనలపై కొన్ని వెబ్ సైట్లు, సోషల్ మీడియాలో విస్త్రృత ప్రచారం జరిగిందన్నారు.

07/19/2016 - 16:26

బెంగళూరు: కర్ణాటకలోని గుల్బర్గాలో మంగళవారం మధ్యాహ్నం కారును లారీ ఢీకొనడంతో ఎనిమిది మంది మృతిచెందారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు.

07/19/2016 - 16:22

ముంబయి: నేడు స్వల్ప లాభాలతో దేశీయ మార్కెట్లు ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 67.16 వద్ద కొనసాగుతోంది.సెన్సెక్స్‌ 41 పాయింట్లు లాభపడి 27,787 వద్ద ముగిసింది. నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో 8,528 వద్ద ముగిసింది.

07/19/2016 - 16:20

దిల్లీ: నిన్న రూ.200 తగ్గి రెండు వారాలు కనిష్ఠానికి చేరుకున్న బంగారం ధర ఈరోజు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌ పెరగడంతో పసిడి ధర పైకి వెళ్లింది. దేశీయ మార్కెట్లో పది గ్రాముల పసిడి ధర రూ.200 పెరిగి రూ.30,750కి చేరింది. కేజీ వెండి ధర రూ.70 పెరిగి రూ.46,330కి చేరుకుంది.

07/19/2016 - 16:17

దిల్లీ: ఆర్‌ఎస్‌ఎస్‌కు తమ పార్టీ యువనేత రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. మహాత్మాగాంధీ హత్యకు ఆరెస్సెస్ కారణమంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పరువునష్టం కేసులో తాము న్యాయపరంగా ముందుకు పోతామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఆరెస్సెస్‌కు క్షమాపణ చెబుతారా? లేక విచారణను ఎదుర్కొంటారా? అని సుప్రీం కోర్టు ప్రశ్నించడంపై కాంగ్రెస్ నేతలు స్పందించారు.

07/19/2016 - 16:15

దిల్లీ: జాతిపిత మహాత్మా గాంధీ హత్యకు ఆరెస్సెస్ కారణమని గతంలో ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడికి సుప్రీం కోర్టు మంగళవారం గట్టి షాక్ ఇచ్చింది. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఆరెస్సెస్ దాఖలు చేసిన పరువునష్టం కేసులో కోర్టు ఘాటుగా స్పందించింది. ఆరెస్సెస్‌కు క్షమాపణలు చెబుతారా? లేక పరువునష్టం కేసులో విచారణ ఎదుర్కొంటారా?- అని సుప్రీం కోర్టు కాంగ్రెస్ యువనేతను ప్రశ్నించింది.

07/19/2016 - 12:04

దిల్లీ: కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉత్తరాది రాష్ట్రాల్లో జన జీవనం అతలాకుతలమవుతోంది. నదులు, వాగులు పొంగి ప్రవహిస్తుండడంతో వరద తాకిడి సుమారు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్, ఉత్తరాఖండ్, యుపి, బిహార్‌లో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనం అవస్థల పాలయ్యారు. అస్సాం, పశ్చిమబెంగాల్, అరుణాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు ఇబ్బందులను తెచ్చిపెట్టాయి.

07/19/2016 - 12:02

దిల్లీ: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్‌ను ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఎంపీ కెవిపి రామచంద్రరావు మంగళవారం ఇక్కడ కలిశారు. ఎపికి ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో తాను ప్రవేశపెట్టిన ప్రైవేటుబిల్లుపై కెవిపి ఈ సందర్భంగా దిగ్విజయ్‌కు వివిరించారు. ఈ బిల్లు ఆమోదానికి వివిధ పార్టీల సహకారం తీసుకునే విషయమై ఆయన దిగ్విజయ్ నుంచి సలహాలు తీసుకున్నారు.

Pages