S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/19/2016 - 12:01

హైదరాబాద్: గురుపూర్ణిమ సందర్భంగా మహారాష్టల్రోని షిర్డీతో పాటు తెలుగురాష్ట్రాల్లోని సాయిబాబా ఆలయాల్లో మంగళవారం నాడు ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో రావడంతో షిర్డీ సాయి ఆలయం వద్ద తెల్లవారు జాము నుంచే కోలాహలం నెలకొంది. ఇక, హైదరాబాద్‌లోని పంజగుట్ట, దిల్‌సుఖ్‌నగర్, ఫిల్మ్‌నగర్‌లోని సాయిబాబా ఆలయాల్లో భక్తులు బారులు తీరారు.

07/19/2016 - 11:50

ఢిల్లీ : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రెండో రోజు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. బంగ్లాదేశ్‌, ఫ్రాన్స్‌లో ఉగ్రదాడి మృతులకు సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై లోక్‌సభలో టీడీపీ నోటీస్‌ ఇచ్చింది. భారత వైద్య మండలి చట్టసవరణ బిల్లు, దంత వైద్యులచట్ట సవరణ బిల్లుపై లోక్‌సభ‌లో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

07/19/2016 - 11:16

మంగళూరు: బంగారంస్మగ్లర్లకు సాయం చేస్తున్న ఇద్దరు స్పైస్‌జెట్‌ ఉద్యోగులను మంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ అంతర్జాతీయ విమానంలో సీటు కింద దాచి ఉంచిన బంగారాన్ని గుర్తించారు. స్మగ్లర్లకు సాయం చేస్తున్న మంగళూరు ఎయిర్‌పోర్టులో పనిచేసే మహ్మద్‌ హనీఫ్‌, ముద్దయ్యలను పోలీసులు అరెస్టు చేశారు. ఆ ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్‌ చేసినట్లు స్పైస్‌జెట్‌ తెలిపింది.

07/19/2016 - 04:54

బెంగళూరు, జూలై 18:దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన డిఎస్‌పి ఆత్మహత్య కేసులో కర్నాటక మంత్రి కెజె జార్జి సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. డిఎస్‌పి ఎమ్‌కె గణపతి ఆత్మహత్యకు కారకులయ్యారంటూ తనపైనా, మరో ఇద్దరు అధికారులపైనా ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలని స్థానిక కోర్టు ఆదేశించడంతో మంత్రి జార్జి ఈ నిర్ణయం తీసుకున్నారు.

07/19/2016 - 03:28

న్యూఢిల్లీ, జూలై 18: కృష్ణా నదీ జలాల కేటాయింపులపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వీలైనంత త్వరగా పూర్తయ్యేలా ఆదేశించాలని కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతిని సిఎం కెసిఆర్ కోరారు. ఢిల్లీ పర్యటనలోవున్న కెసిఆర్, సోమవారం పలువురు ఎంపీలతో వెళ్లి ఉమాభారతిని కలిశారు.

07/19/2016 - 02:27

న్యూఢిల్లీ, జూలై 18: కొందరు న్యాయాధికారులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం న్యాయ వ్యవస్థను రోడ్డుకీడ్చి పరిస్థితులను విషపూరితం చేశారని దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. తెలంగాణకు చెందిన కొందరు న్యాయాధికారులు రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలకు దిగడంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

07/19/2016 - 02:20

న్యూఢిల్లీ, జూలై 18: కాశ్మీర్ అల్లర్లకు ఆజ్యం పోస్తున్నది పాకిస్తానేనని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పొరుగున ఉన్న పాకిస్తాన్ బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని, ముస్లింలను రక్షించేది తామేనని చెప్పుకునే అర్హత దానికెంత మాత్రం లేదని సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా అన్నారు.

07/19/2016 - 02:17

పాట్నా, జూలై 18: బీహార్‌లోని గయలో సోమవారం రాత్రి పొద్దుపోయిన తరువాత జరిగిన నక్సల్ దాడిలో ఎనిమిది మంది సిఆర్‌పిఎఫ్ కమాండోలు మరణించారు. కోబ్రా కమాండోలతో కలిసి సిఆర్‌పిఎఫ్ దళాలు తిరిగి వస్తున్న సమయంలో ఐఈడీ పేలుళ్లకు నక్సల్స్ పాల్పడటంతో ఈ సంఘటన జరిగింది. మరణించిన ఎనిమిది మంది సిఆర్‌పిఎఫ్ కోబ్రా కమాండోలేనని స్పష్టం అవుతోంది.

07/19/2016 - 00:12

న్యూఢిల్లీ, జూలై 18: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఫలవంతమైన చర్చలు జరుగుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు భుజం భుజం కలిపి విస్తృతమైన చర్చల ద్వారా ముఖ్యమైన నిర్ణయాలు ఈ సమావేశాల్లో తీసుకోవటం ద్వారా దేశానికి ఒక కొత్త దిశానిర్దేశం చేయాలని ఆయన అన్నారు.

07/19/2016 - 00:07

న్యూఢిల్లీ, జూలై 18: పంజాబ్‌కు చెందిన సీనియర్ నాయకుడు, నవజ్యోత్‌సింగ్ సిద్దు సోమవారం రాజ్యసభ సభ్యత్వంతోపాటు బిజెపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మాజీ క్రికెటర్ సిద్దు నిర్ణయం ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు షాక్ ఇచ్చేదే.

Pages