S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/31/2016 - 05:26

బెంగళూరు: మహాదాయ వాటర్ ట్రిబ్యునల్ తీర్పునకు నిరసనగా శనివారం కర్నాటకలో పూర్తిస్థాయ బంద్ జరిగింది. ముందు జాగ్రత్తగా బెంగళూరులోని నటరాజ్ థియేటర్‌లో ప్రదర్శిస్తున్న కబాలి సినిమా పోస్టర్లను కనిపించకుండా మూసివేశారు. ఈ సందర్భంగా వివిధ సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించయ.

07/31/2016 - 05:21

గుర్గావ్, జూలై 30: గుర్గావ్‌లో రెండు రోజులుగా కొనసాగిన ట్రాఫిక్ చక్రబంధం శనివారం చాలావరకు సడలిపోయింది. ట్రాఫిక్ సాఫీగా సాగిపోవడానికి వీలుగా హీరో హోండా చౌక్ సహా నగరంలోని 14 కీలక ప్రాంతాల్లో పోలీసు అధికారులను నియమించడంతో ట్రాఫిక్ జామ్‌లు లేకుండా పోయాయి. నగరంలో ఎక్కడా ట్రాఫిక్ జామ్‌లు లేవని, అయితే ట్రాఫిక్ నిదానంగా సాగుతోందని నగర పోలీసు కమిషనర్ నవ్‌దీప్ విర్క్ చెప్పారు.

07/31/2016 - 05:18

ముంబయి, జూలై 30: విదర్భ రీజియన్‌లోని వన్యప్రాణుల సరంక్షణ కేంద్రం నుంచి తప్పిపోయిన పులి ‘జై’ ఆచూకీకోసం దాదాపు వంద రోజుల నుంచీ గాలిస్తున్నప్పటికీ ప్రయోజనం కనిపించడం లేదు. ఉమ్రద్ కర్హాండ్ల కేంద్రంలో ఉండే ఈ పులికి అమర్చిన ఎలక్ట్రానిక్ ట్యాగ్ ఏప్రిల్ 18నుంచి పనిచేయడం లేదు. దాదాపు 400 గ్రామాల్లో పులి జాడకోసం వెతికారు.

07/31/2016 - 05:15

దర్భంగా, జూలై 30: మంత్రగత్తెగా ముద్రవేసి ఒక దళిత మహిళను చితకబాదడంతో పాటు ఆమె మూత్రాన్ని ఆమెతోనే తాగించిన అమానుష ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. దర్భంగా జిల్లాలోని పిప్రా గ్రామంలో నలుగురు వ్యక్తులు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు శనివారం తెలిపారు.

07/31/2016 - 05:13

బెంగళూరు, జూలై 30: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కుమారుడు రాకేశ్ శనివారం బెల్జియంలో కన్నుమూశారు. శరీరంలోని అవయవాలన్నీ దెబ్బతినడం వల్ల రాకేశ్ చనిపోయినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. సిద్దరామయ్య పెద్ద కుమారుడైన రాకేశ్ గత వారం స్నేహితులతో కలిసి ఐరోపా పర్యటనకు వెళ్లారు.

07/31/2016 - 05:11

ముంబయి, జూలై 30: సుప్రీం కోర్టు ఆదేశం మేరకు సైనిక దళం దక్షిణ ముంబయిలోని కొలాబాలో ఆదర్శ్ కుంభకోణంతో కళంకితమైన బహుళ అంతస్తుల భవనాన్ని స్వాధీనం చేసుకునే ప్రక్రియను ప్రారంభించింది. సైనిక సిబ్బందితో కూడిన ఒక బృందం శుక్రవారం వివాదాస్పదమైన ఈ ప్రదేశానికి చేరుకుని ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ నుంచి అధికారికంగా ఆ భవనాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఉపక్రమించింది.

07/31/2016 - 05:10

శ్రీనగర్, జూలై 30: జమ్మూ-కాశ్మీరులోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద శనివారం ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు చేసిన ప్రయత్నాన్ని సైనిక దళం భగ్నం చేసింది. ఇందుకు సంబంధించిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవగా, ఇద్దరు సైనికులు మృతిచెందారు.

07/31/2016 - 03:05

అస్సాం: ఉత్తర, ఈశాన్య భారత రాష్ట్రాలు వరదలతో విలవిల్లాడుతున్నాయి. బ్రహ్మపుత్ర నది ఉగ్రరూపానికి ఈశాన్యరాష్ట్రం అస్సాం పూర్తిగా మునిగిపోయింది. ఇప్పటి వరకు దాదాపు 34మంది మరణించారు. అటు పశ్చిమబెంగాల్‌లో 31గ్రామాలు

,
07/31/2016 - 03:02

గౌహతి/ మాల్దా/ ముంబయి, జూలై 30: భారీ వర్షాలు అస్సోం, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, బిహార్ రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. కుండపోత వర్షాల కారణంగా ముంచెత్తిన వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న అసోంలో మృతుల సంఖ్య 34కు పెరిగింది. కజిరంగా జాతీయ పార్కులో దాదాపు 80 శాతం నీట మునిగింది. 22 జిల్లాల్లోని సుమారు 19 లక్షల మంది వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన అసోంను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం సందర్శించారు.

07/31/2016 - 02:41

న్యూఢిల్లీ, జూలై 30: నాటి కాకతీయుల రాజధాని వరంగల్లు దేశంలోనే అత్యుత్తమ వారసత్వ నగరంగా ఎంపికైంది. కేంద్ర పర్యాటక శాఖ ప్రతి ఏటా ఇచ్చే అవార్డులలో వారసత్వ నగరం విభాగంలో వరంగల్లుకు పురస్కారం దక్కింది. దాదాపు పదకొండు వందల సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్న అపూర్వ కాకతీయ వారసత్వ సంపద అయిన శిల్పకళ, నాట్యకళ, నిర్మాణకళ ఇవాల్టికీ చెక్కుచెదరకుండా నిలబడటం వల్లనే ఈ జాతీయ గుర్తింపు లభించింది.

Pages