S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/31/2016 - 02:15

చెన్నై, జూలై 30: ఆంధ్రప్రదేశ్ ఏకపక్షంగా పాలార్ నదిపై ఎలాంటి డ్యామ్ పనులు చేపట్టకుండా నిరోధిస్తూ పర్మనెంట్ ఇంజంక్షన్ ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తమిళనాడు ముఖ్యమంత్రి జె.జయలలిత శనివారం ఇక్కడ ఒక ప్రకటనలో తెలిపారు.

07/31/2016 - 02:08

విశాఖపట్నం, జూలై 30: చెన్నై ఎయిర్‌బేస్ నుంచి గత 22న గల్లంతైన విమానం ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. గల్లంతైన విమానంలో మొత్తం 22 మంది ఉండగా, వీరిలో విశాఖ నేవల్ ఆర్మ్‌డ్ డిపో (ఎన్‌ఎడి)కి చెందిన ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారు.

07/30/2016 - 18:46

ఇంఫాల్‌: మణిపూర్‌ సెంట్రల్‌ జైల్లోశనివారం ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు ఖైదీలు మృతి చెందారు. ఈ ఘటనలో ముగ్గురు జైలు అధికారులతో పాటు మరో ఖైదీ గాయపడ్డట్లు పోలీసులు చెప్పారు.ఇంఫాల్‌లో గల సెంట్రల్‌ జైల్లో యూసుఫ్‌(21), అబ్దస్‌(22) అనే ఇద్దరు ఖైదీలు అదే జైల్లో ఖైదీగా ఉంటున్న చురాచంద్‌పూర్‌ జిల్లాకు చెందిన తంగిమిన్‌లీన్‌ అనే వ్యక్తిని దారుణంగా కొట్టి చంపారు.

07/30/2016 - 17:56

పంజాబ్‌ : పంజాబ్‌లోని మలెర్‌కోట్లలో ఇటీవల మతగ్రంథాన్ని అపవిత్రం చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నరేశ్‌ యాదవ్‌కు బెయిల్‌ మంజూరైంది. సంగ్రూర్‌లోని అదనపు జిల్లా, సెషన్స్‌ కోర్టు యాదవ్‌కు బెయిల్‌ మంజూరు చేసినట్లు ఆమ్‌ఆద్మీ పార్టీ న్యాయ విభాగ అధ్యక్షుడు హిమ్మత్‌ సింగ్‌ షెర్గిల్‌ తెలిపారు. ఈ నెల 24న పంజాబ్‌ పోలీసులు యాదవ్‌ను అరెస్టు చేసి జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు.

07/30/2016 - 17:24

బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పెద్ద కుమారుడు రాకేష్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ బ్రస్సెల్స్‌లోని యూనివర్సిటీ ఆస్పత్రిలో మరణించారు. స్నేహితులతో కలిసి యూరప్ పర్యటనకు వెళ్లిన రాకేష్‌కు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో బ్రస్సెల్స్‌లోని యూనివర్సిటీ ఆస్పత్రిలో చేర్పించారు.

07/30/2016 - 16:36

దిల్లీ: కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ 2014-15 ఏడాదికి గాను జాతీయ పర్యాటక పురస్కారాలు అందించింది. వరంగల్‌ నగరం దేశంలోని అత్యుత్తమ వారసత్వ నగరంగా ఎంపికైంది. పర్యాటక అభివృద్ధిలో మధ్యప్రదేశ్‌ తొలిస్థానంలో, గుజరాత్‌, కర్ణాటక రాష్ట్రాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. రాజస్థాన్‌లోని సవాయ్‌ మాధోపూర్‌ రైల్వే స్టేషన్‌ ఉత్తమ పర్యాటక స్నేహపూర్వక రైల్వేస్టేషన్‌గా ఎంపికైంది.

07/30/2016 - 14:45

శ్రీనగర్: జమ్ము-కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వద్ద శనివారం ఉదయం భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించగా భద్రతాదళం తిప్పికొట్టింది. ఈ సందర్భంగా ఇద్దరు ఉగ్రవాదులను భారత సైనికులు హతమార్చారు. ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. శనివారం మధ్యాహ్నానికి ఎదురుకాల్పులు ఇంకా కొనసాగతూనే ఉన్నాయి.

07/30/2016 - 13:48

పట్నా: బిహార్‌లో వరదల కారణంగా 26మంది మృతి చెందగా, పుర్నియా, కతిహర్‌, మధెపురా, అరేరియా, సహర్సా జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దాదాపు 22లక్షల మంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ విపత్తు కారణంగా పంటలతో పాటు గుడిసెలు, పలు పక్కా ఇళ్లు ధ్వంసమయ్యాయి.

07/30/2016 - 08:25

న్యూఢిల్లీ, జూలై 29: గోమాంసం అంశంపై మధ్యప్రదేశ్‌లో ఇద్దరు దళిత మహిళలపై దాడి చేసిన సంఘటనపై శుక్రవారం లోక్‌సభలో ప్రతిపక్షాలు అధికార బిజెపిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దళితులు, ముస్లింలపై దాడులు రాను రాను పెరిగిపోతున్నాయంటూ విమర్శించాయి. దీంతో హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జోక్యం చేసుకుని ఈ విషయంలో న్యాయం చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు.

07/30/2016 - 07:40

న్యూఢిల్లీ, జూలై 29: పాకిస్తాన్‌లో వచ్చే నెల 4వ తేదీన జరిగే సార్క్ దేశాల మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇస్లామాబాద్‌కు వెళ్లనున్నారు. అయితే ఈ పర్యటన సందర్భంగా రాజ్‌నాథ్‌కు, పాకిస్తాన్ నాయకులకు మధ్య ఎటువంటి ద్వైపాక్షిక సమవేశం ఉండదని విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఇఎ) అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ శుక్రవారం స్పష్టం చేశారు.

Pages