S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/30/2016 - 07:39

న్యూఢిల్లీ, జూలై 29: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, విదేశీ, దేశీయ గ్రాంట్లు పొందే స్వచ్ఛంద సంస్థలు (ఎన్జీవోలు) వాటి ఎగ్జిక్యూటివ్‌లు తమ ఆస్తులు, అప్పుల వివరాలను పొడిగించిన గడువు అయిన డిసెంబర్ 31లోగా దాఖలు చేయాల్సి ఉంటుంది.

07/30/2016 - 07:39

న్యూఢిల్లీ, జూలై 29: సమాజంలో అన్ని రకాల హింసలకు గురవుతున్న మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని కేంద్ర మహిళా,శిశు సంక్షేమ మంత్రి మేనకాగాంధీ శుక్రవారం లోక్‌సభలో వెల్లడించారు. బాధిత మహిళలకు వైద్య, న్యాయ సహాయం అన్నీ ఒకే చోట లభించేందుకు వీలుగా దేశ వ్యాప్తంగా 660 వన్ స్టాప్ సెంటర్లు(ఒఎస్‌సి)లు ఏర్పాటు చేయనున్నట్టు ఆమె ప్రకటించారు.

07/30/2016 - 07:39

న్యూఢిల్లీ, జూలై 29: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం మరో శుభవార్తను అందించింది. ఏడో వేతన సంఘం సిఫార్సులకు సంబంధించిన ఎరియర్స్ అన్నీ కూడా ఒకేసారి ఆగస్టు వేతనాలతో కలిపి ఇవ్వాలని శనివారం నిర్ణయించింది. ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ఉద్యోగులకు ఇప్పటికే 2.57రెట్లు మూలవేతనం పెరిగింది. 125శాతం డిఏ పెరిగింది. మొత్తంమీద 23.5శాతం పెరుగుదల జరిగింది.

07/30/2016 - 07:38

న్యూఢిల్లీ, జూలై 29: గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌కు చెందిన 14 ఏళ్ల తుషార్ తలావత్ అంతర్జాతీయ గణిత శాస్త్ర పోటీలో విజయం సాధించి అందరి దృష్టినీ ఆకర్షించాడు. హేమచంద్రాచార్య సంస్కృత పాఠశాలలో చదువుతున్న తుషార్ ఇటీవల ఇండోనేసియాలో నిర్వహించిన ఇంటర్నేషనల్ మ్యాథెమెటిక్స్ కాంపిటీషన్‌లో నెగ్గడం ద్వారా తాను చదువుతున్న ‘గురుకులానికి’ కీర్తి ప్రతిష్ఠలను తీసుకొచ్చారు.

07/30/2016 - 07:36

న్యూఢిల్లీ, జూలై 29: పిఎఫ్ కనీస పింఛనును నెలకు రూ 3 వేల రూపాయలకు పెంచాలని, ఉద్యోగుల పింఛను పథకాన్ని సమీక్షించాలని, ఉద్యోగుల భవిష్య నిధి (ఇపిఎఫ్)లో ప్రభుత్వ వాటాను పెంచాలని శుక్రవారం లోక్‌సభలో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.

07/30/2016 - 07:43

గుర్గావ్, జూలై 29: గురువారం సాయంత్రం ఢిల్లీతో పాటుగా పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు గుర్గావ్ నగరం పూర్తిగా స్తంభించి పోయింది. డ్రైనేజిలు పొంగి, రోడ్లపై వర్షపు నీళ్లు నిలిచి పోవడంతో ఢిల్లీనుంచి గుర్గావ్ వెళ్లే 8వ నంబరు జాతీయ రహదారిపై వేలాది వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకు పోయాయి. వాహనదారులు తమ వాసనాలను ఎక్కడివక్కడే వదిలేసి నడుంలోతు నీళ్లలో ఈదుకుంటూ వెళ్తుండడంతో పరిస్థితి దారుణంగా మారింది.

07/30/2016 - 07:15

న్యూఢిల్లీ, జూలై 29: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హామీల అమలుపై పార్లమెంట్‌లో కేంద్రం చేసిన ప్రకటనపై టిడిపి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఆ పార్టీకి చెందిన ఎంపీలు సి.ఎం.రమేష్, గరికపాటి మోహనరావు, టి.జి.వెంకటేష్, తోట సీతారామలక్ష్మి శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని విమర్శిచారు.

07/30/2016 - 05:16

న్యూఢిల్లీ, జూలై 29: కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి సుజనా చౌదరి (టిడిపి) మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీపై ప్రశంసల వర్షం కురిపించారు.

07/30/2016 - 05:15

న్యూఢిల్లీ,జూలై 29: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై రెండు సంవత్సరాలుగా నానుతున్న ఊహాపోహలన్నింటికీ కేంద్ర ప్రభుత్వం ఫుల్‌స్టాప్ పెట్టేసింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వటం కుదరదని కుండబద్దలు కొట్టింది. ఈ అంశంపై ఇకపై ఎలాంటి అంచనాలకు తావులేకుండా తాను చెప్పదలచుకున్నది సూటిగా స్పష్టంగా చెప్పేసింది. పధ్నాలుగో ఆర్థిక సంఘం సిఫార్సుల కారణంగా ఏ రాష్ట్రానికీ హోదా ఇవ్వటం సాధ్యం కాదని తేల్చిచెప్పింది.

07/29/2016 - 17:56

న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఏఎన్-32 విమానం అదృశ్యంపై కుట్ర జరగలేదనుకుంటున్నానని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ప్రకటన చేశారు. వరుసగా ఎనిమిదో రోజు కూడా గాలింపు కొనసాగుతోందని చెప్పారు. ఈ నెల 22న తమిళనాడు చెన్నై నుంచి పోర్ట్‌బ్లెయిర్ వెళ్తూ ఉదయం ఎనిమిదిన్నర సమయంలో అదృశ్యమైంది. విమానంలో ఆరుగురు సిబ్బందితో పాటు 23 మంది ఉన్నారు. వీరిలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది కూడా ఉన్నారు.

Pages