S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/29/2016 - 17:24

ఢిల్లీ: కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ ఓ ట్వీట్‌లో చిన్నపొరపాటు చేశారు. వెంటనే ఆ విషయం గ్రహించి ట్వీట్ తొలగించినప్పటికీ అప్పటికే యూజర్ల నుంచి ఆమె కామెంట్లు ఎదుర్కోవలసి వచ్చింది. ప్రముఖ రచయిత్రి, సామాజిక ఉద్యమకారిణి మహాశ్వేతాదేవికి నివాళులర్పిస్తూ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ ట్వీట్‌ చేశారు.

07/29/2016 - 16:36

దిల్లీ: రాజకీయ ప్రత్యర్థులపై నిత్యం విమర్శనాస్త్రాలు సంధిస్తూ, ట్విట్టర్‌లో సంచలన వ్యాఖ్యలు చేసే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, దిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ ఏకంగా 12 రోజుల పాటు మీడియాకు దూరంగా ఉంటారట. ధ్యానయోగాన్ని అభ్యసించేందుకు ఆయన నాగపూర్‌లోని ఓ యోగా కేంద్రంలో చేరుతున్నారు. అక్కడ 12 రోజులు విపాసన అనే ధ్యాన విధానాన్ని ఆయన నేర్చుకుంటారు.

07/29/2016 - 16:04

ఢిల్లీ : ఏపీ రాజధాని నిర్మాణానికి ఇప్పటికే రూ.2050 కోట్లు ఇచ్చామని, దశలవారీగా సాయం అందజేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ శుక్రవారం రాజ్యసభలో అన్నారు. విశాఖ మెట్రో డీపీఆర్‌ కేంద్రం పరిశీలనలో ఉందని, ఏపీ రైల్వే జోన్‌ను సురేష్‌ప్రభు పరిశీలిస్తున్నారన్నారు. 13వ షెడ్యూల్‌లోని హామీలన్నీ అమలు చేశామని చెప్పారు

07/29/2016 - 15:58

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు విభజన హామీలపై రాజ్యసభలో రెండో రోజు శుక్రవారం చర్చ జరుగుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా సహా విభజన హామీలన్నీ నెరవేర్చాలని అన్ని పక్షాలు ప్రభుత్వాన్ని గురువారం నిలదీశాయి. ఈరోజు చర్చ అనంతరం ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ వివరణ ఇస్తారు.

07/29/2016 - 15:24

దిల్లీ: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌ను లెఫ్టినెంట్‌గా ఆర్మీ చీఫ్‌ జనరల్‌ దల్బీర్‌ ఎస్‌ సుగాగ్‌ నియమించారు. చిన్నప్పటి నుంచి ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని కలలు కనేవాడిని, ఇప్పుడు లెఫ్టినెంట్‌ హోదాలో నా దేశ ప్రజలకు సేవ చేస్తా అని అనురాగ్‌ ఠాకూర్‌ పేర్కొన్నారు.

07/29/2016 - 15:22

తిరువనంతపురం: కేరళ మాజీ ముఖ్యమంత్రి వూమెన్‌చాందీ కొల్లం నుండి తిరువనంతపురం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. దాదాపు దశాబ్దకాలం తర్వాత బస్సులో ప్రయాణిస్తున్నానని చాందీ తెలిపారు. తనకు బస్సులో ప్రయాణించడమంటే ఎంతో ఇష్టమని కానీ ముఖ్యమంత్రి పదవి వల్ల అది కుదర్లేదన్నారు. కారులో వెళ్లే అవకాశం ఉన్నా తిరస్కరించి బస్సులో వెళ్లారు.

07/29/2016 - 15:17

పట్నా: బీఎస్పీ అధినేత్రి మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బహిష్కృత భాజపా నేత దయాశంకర్‌ సింగ్‌ను బిహార్‌లోని బక్సర్‌లో పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు. కేసు నమోదైన అనంతరం దయాశంకర్‌ పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నారు. ఝార్ఖండ్‌లోని ఆలయంలో ఆయన దిగిన ఫొటోలు బయటకు రావడంతో పోలీసులు ముమ్ముర గాలింపు చేపట్టి బిహార్‌లో అరెస్ట్‌ చేశారు.

07/29/2016 - 12:14

పుణె : నిర్మాణంలో ఉన్న ఓ భవనం శుక్రవారం కూలిపోవడంతో పుణెలో తొమ్మిది మంది కార్మికులు మృతిచెందారు. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు.

07/29/2016 - 11:45

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై రాజ్యసభలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు చర్చ జరుగనుంది. చర్చలో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రత్యేక హోదాపై స్ఫష్టత ఇవ్వనున్నట్లు సమాచారం. ఏపీకి ప్రత్యేక హోదాపై నిన్న చర్చ అసంపూర్ణంగా ముగియడంతో ఈరోజు కూడా కొనసాగించాలని నిర్ణయించారు. ఉదయం 11 గంటలకు హోదాపై చర్చ జరిపి, అరుణ్‌జైట్లీ సమాధానం ఉంటుందని భావించారు.

07/29/2016 - 11:42

గడ్చిరోలి (మహారాష్ట్ర) : గడ్చిరోలి జిల్లా థనోరా అటవీప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మహిళా మావోయిస్టు మృతి చెందింది. తప్పించుకున్న మావోల కోసం పోలీసులు కూంబింగ్ కొనసాగిస్తున్నారు. ఘటనాస్థలంలో పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా సరిహద్దుల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Pages