S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/13/2016 - 01:38

రాయ్‌బరేలీ, ఫిబ్రవరి 12: పా ర్లమెంట్ ప్రతిష్ఠంభనపై తమ పార్టీని పదేపదే ప్రధాని మోదీ విమర్శించడాన్ని కాంగ్రె స్ అధినేత్రి సోనియా గాంధీ తిప్పికొట్టారు. పేదలు, సామాన్యులకు సంబంధించిన అంశాలను సభ లో లేవనెత్తిన ప్రతిసారీ తమ పార్టీ గొంతు నొక్కేందుకు ప్ర యత్నిస్తున్నారని అన్నారు.

02/13/2016 - 01:38

ముంబయి, ఫిబ్రవరి 12: దేశ వాణిజ్య రాజధాని ముంబయిపై 26/11 దాడి తరువాత కూడా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఆల్‌ఖైదా భారత్‌పై దాడులకు కుట్ర పన్నింది. దీనిపై ఆల్‌ఖైదా తనతో సంప్రదింపులు జరిపినట్టు 26/11 ఉగ్రదాడిలో ప్రధాన నిందితుడు డేవిడ్ కోల్మెన్ హెడ్లీ వెల్లడించాడు. అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉగ్రవాది హెడ్లీ నుంచి ప్రత్యేక న్యాయమూర్తి జిఎ సనప్ వాంగ్మూలం నమోదు చేశారు.

02/13/2016 - 01:37

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: పాకిస్తాన్‌కు ఇవ్వాలని భావిస్తున్న 860మిలియన్ డాలర్ల సహాయాన్ని నిలిపివేయాలని భారత దేశం శుక్రవారం అమెరికాకు విజ్ఞప్తి చేసింది.

02/13/2016 - 01:59

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్ట స్థాయిలో వినియోగించుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుసంధానమైన పాఠశాలలకు ప్రధా ని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో ఎప్పటికప్పుడు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని.. విద్యా నాణ్యతనూ పెంచుకోవాలని కోరారు.

02/13/2016 - 01:36

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మ కం పోయిందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వంలో విశ్వాస సంక్షోభం నెలకొందని పేర్కొన్న ఆయన ప్రజా సంక్షేమం కోసమే తా ను పనిచేస్తున్నానన్న నమ్మకాన్ని ప్రతి పౌరుడిలో కలిగించాల్సిన బా ధ్యత మోదీపై ఉంద్నారు. గోవధ, మత కలహాల వంటి సునిశిత అంశాలపై మోదీ మాట్లాడక పోవడాన్ని మన్మోహన్ తప్పుబట్టారు.

02/13/2016 - 01:22

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: పార్లమెంటుపై దాడి కేసులో దోషి అయిన అఫ్జల్ గురును ఉరితీయడానికి వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో నిరసన ర్యాలీ నిర్వహించడంపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

02/13/2016 - 01:19

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: పార్లమెంటుపై దాడి చేసిన కేసులో అఫ్జల్ గురును ఉరి తీయడాన్ని వ్యతిరేకిస్తూ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు)లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించిన కేసుకు సంబంధించి పోలీసులు జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయా కుమార్‌ను శుక్రవారం అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి కన్హయా కుమార్‌ను అరెస్టు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

02/13/2016 - 01:59

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: పెళ్లిళ్ల సీజన్ మొదలు కావడంతో బంగారం ధరకు కూడా రెక్కలొచ్చాయి. శుక్రవారం ఒక్క రోజే పది గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 850 పెరిగి రూ. 29,650కి చేరుకుంది. గత 11 రోజులుగా వరసగా పెరుగుతూ వస్తున్న బంగారం ఈ 11 రోజుల్లోనే 2,600 రూపాయలు పెరిగింది. ఈ ఏడాది వరసగా ఇన్ని రోజులు బంగారం ధర పెరగడం ఇదే మొదటిసారి.

02/13/2016 - 02:00

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: రామగుండంలో ఏర్పాటు చేస్తున్న 4వేల మెగావాట్ల ధర్మల్ విద్యుత్కేంద్రాన్ని 2021నాటికి పూర్తి చేస్తామని కేంద్ర ఇంధన మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. శుక్రవారం సిఎం కెసిఆర్‌తో చర్చల అనంతరం మీడియాతో మాట్లాడారు. విద్యుత్ సంస్కరణలు అమలుకు కేంద్రం చేపట్టిన ‘ఉదయ్’లో చేరేందుకు కెసిఆర్ అంగీకరించటం పట్ల గోయల్ సంతోషం వ్యక్తం చేశారు.

02/13/2016 - 02:01

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: రామగుండంలో ఎన్టీపీసీ చేపడుతున్న 4వేల మెగావాట్ల ధర్మల్ విద్యుత్కేంద్రం శంఖుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోదీ మార్చి మొదటివారంలో తెలంగాణకు వస్తున్నారని సిఎం కె చంద్రశేఖర్ రావు ప్రకటించారు. తెలంగాణకు సంబంధించి వివిధ ప్రాజెక్టుల పూర్తికి 1.15 లక్షల కోట్లు కేటాయించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి 11 డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందించారు.

Pages