S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/18/2016 - 08:38

లక్నో, జూలై 17: ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి షీలాదీక్షిత్‌కు పెద్దప్రమాదం తప్పింది. ఆదివారం రోడ్‌షోలో భాగంగా ఒక మినీ ట్రక్కుపై ఏర్పాటు చేసిన తాత్కాలిక వేదిక కూలిపోవడంతో స్వల్ప గాయాలతో ఆమె బైటపడ్డారు.

07/18/2016 - 08:37

న్యూఢిల్లీ, జూలై 17: అనేక అంశాలపై కేంద్రంతో పోరాడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. మోదీ పనితీరువల్ల కేంద్ర-రాష్ట్ర సంబంధాలు ‘్భరత్-పాకిస్తాన్’ సంబంధాల్లా మారాయని అన్నారు.

07/18/2016 - 08:37

అహ్మదాబాద్, జూలై 17: పటేళ్ల కోటా ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్‌కు గుజరాత్ హైకోర్టు ఆరునెలల రాష్ట్ర బహిష్కరణ శిక్ష విధించడంతో ఆదివారం ఉదయం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు వెళ్లారు. శుక్రవారం బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు రాష్ట్రం విడిచివెళ్లడానికి 48 గంటల గడువు విధించిన విషయం విదితమే.

07/18/2016 - 08:36

న్యూఢిల్లీ, జూలై 17: పార్టీ ఫిరాయింపుల చట్టంలో సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు వైకాపా లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్ అన్నారు. ఆదివారం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్షం సమావేశానికి ఆ పార్టీ ఎంపీలు మేకపాటి, విజయ సాయిరెడ్డి హాజరయ్యారు.

07/18/2016 - 08:35

శ్రీనగర్, జూలై 17: హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హన్ వనీ హత్య దరిమిలా తలెత్తిన అల్లర్లు, హింసాకాండ దృష్ట్యా జమ్మూ, కాశ్మీర్‌లో ఆదివారం తొమ్మిదో రోజు కూడా కర్ఫ్యూ కొనసాగింది. ఈ అల్లర్లలో 39 మంది మరణించగా, 3100 మంది గాయపడిన విషయం తెలిసిందే. శాంతిభద్రతలను కాపాడడానికి ముందుజాగ్రత్త చర్యగా కాశ్మీర్ లోయలోని మొత్తం పది జిల్లాల్లోను ఆదివారం కూడా కర్ఫ్యూ అమలులో ఉందని పోలీసు అధికారి ఒకరు చెప్పారు.

07/18/2016 - 08:35

న్యూఢిల్లీ, జూలై 17: పార్లమెంట్ భవనంపై మరోసారి దాడి జరగకుండా నిరోధించటానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దుర్భేద్యమైన భద్రతాచర్యలకు పూనుకుంది. ‘‘ఆపరేషన్ గోల్డెన్ నోస్’’ పేరుతో కరడుగట్టిన కోరపళ్లున్న జాగిలాలతో ప్రత్యేక భద్రతావలయాన్ని ఏర్పాటు చేసేందుకు హోంశాఖ ఆదివారం ఆమోదం తెలిపింది. ఇండియా టుడే కథనం ప్రకారం పార్లమెంట్‌లో ఇప్పటికే బహుళ అంచెల భద్రతావ్యవస్థ అమలులో ఉంది.

07/18/2016 - 08:30

ఇస్తాంబుల్/న్యూఢిల్లీ, జూలై 17: మన దేశంలోని చండీగఢ్, ప్రపంచంలోని మూడో ఎత్తయిన పర్వతం ఖంగ్జ్‌చెండ్‌జోంగాకు పుట్టినిల్లయిన సిక్కిం నేషనల్ పార్కును యునెస్కో ఆదివారం ప్రపంచ వారసత్వ సంపద స్థలాల జాబితాలో చేర్చించింది. మన దేశంతో ముడిపడిన మూడు నామినేషన్లకూ ఈ జాబితాలో చోటు దక్కడం గమనార్హం.

07/18/2016 - 07:36

న్యూఢిల్లీ, జూలై 17: విశిష్టాద్వైత తత్త్వవేత్త, వైష్ణవ భక్తి ఉద్యమసారధి భగవద్రామానుజుల సహస్రాబ్ది సందర్భంగా హైదరాబాద్‌లో నెలకొల్పనున్న ఆయన భారీ పంచలోహ విగ్రహ ఆవిష్కరణకు రావలసిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి ఆహ్వానించారు. ఆదివారం ఆయన ప్రధానిని కలిసారు.

07/18/2016 - 07:18

న్యూఢిల్లీ, జూలై 17: గుజరాత్, పంజాబ్, ఢిల్లీ సహా ఉత్తర భారతంలోని అనేక ప్రాంతాల్లో ఆదివారం మూడు ఓ మోస్తరు భూప్రకంపనలు సంభవించాయి. ఆదివారం సాయంత్రం 5 గంటల 24 నిమిషాల సమయంలో పంజాబ్‌లోని భారత్-పాక్ సరిహద్దులకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో రిక్టర్ స్కేలుపై 4.6 పాయింట్ల తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయి. పాకిస్తాన్, దేశ రాజధాని డిల్లీ సహా ఉత్తర భారతంలోని అనేక ప్రాంతాల్లో ఈ ప్రకంపనల ప్రభావం కనిపించింది.

07/18/2016 - 05:56

న్యూఢిల్లీ, జూలై 17: పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎంపీలకు సిఎం కెసిఆర్ దిశానిర్దేశం చేశారు. ఆదివారం ఢిల్లీలోని సిఎం నివాసంలో కెసిఆర్ అధ్యక్షతన తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. కేంద్రానికి పార్లమెంట్‌లో అంశాలవారీగా మద్దతిస్తూనే రాష్ట్రానికి సంబంధించిన అంశాలను పార్లమెంట్‌లో లేవనేత్తాలని ఎంపీలకు సూచించారు.

Pages