S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/28/2016 - 05:31

న్యూఢిల్లీ, జూలై 27: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఇక్కడ జరుగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. దేశ సమగ్రాభివృద్ధిని వేగవంతం చేయడానికి 15 ఏళ్ల విజన్ డాక్యుమెంట్‌కు పటిష్ఠమైన రూపాన్ని ఇవ్వడానికి ఈ సమావేశం జరుగుతోంది. ‘ఈ సమావేశంలో నీతి ఆయోగ్.. విజన్ డాక్యుమెంట్‌పై ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని ప్రధానమంత్రికి వివరిస్తుంది’ అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

07/28/2016 - 05:30

న్యూఢిల్లీ, జూలై 27: ప్రైవేట్ పరువునష్టం ఫిర్యాదును విచారించాలని మెజిస్ట్రేట్‌లు పోలీసులను ఆదేశించలేరని సుప్రీం కోర్టు బుధవారం స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై దాఖలైన ప్రైవేట్ క్రిమినల్ పరువునష్టం కేసులో సుప్రీం కోర్టు విచారణ జరిపింది.

07/28/2016 - 05:30

శ్రీనగర్, జూలై 27: జమ్మూ, కాశ్మీర్‌లో మంగళవారం భీకర ఎన్‌కౌంటర్ తర్వాత భద్రతా దళాలు ప్రాణాలతో పట్టుకున్న టెర్రరిస్టు పాకిస్తాన్ జాతీయుడని హోం మంత్రిత్వ శాఖ వర్గాలు తెలియజేశాయి. అతనిని పాకిస్తాన్‌లోని లాహోర్ నగరానికి చెందిన బహదూర్ అలీగా గుర్తించినట్లు హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ అహిర్ కూడా చెప్పారు.

07/28/2016 - 05:29

న్యూఢిల్లీ/ లండన్, జూలై 27: భారత్, బ్రిటన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావాలని, ఇరు దేశాలు మరింత సన్నిహితం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వాణిజ్యం, రక్షణ రంగాలుసహా వివిధ రంగాలలో ఇరు దేశాల మధ్య సంబంధాలు పటిష్ఠం కావాలని ఆయన బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి థెరిసా మేకు సూచించారు.

07/28/2016 - 05:28

న్యూఢిల్లీ, జూలై 27: జాతీయ భద్రత, ప్రాదేశిక సమగ్రత విషయంలో రాజీలేదని వీటి పరిరక్షణకు అన్ని చర్యలూ చేపడతామని భారత్ బుధవారం పాకిస్తాన్‌కు విస్పష్టంగా తెలియజేసింది. కాశ్మీర్‌లో రోజుల తరబడి అంశాంతిమయ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాక్ చర్యలకు చాలా ఘాటుగానే భారత్ ప్రతిస్పందించింది.

07/28/2016 - 05:21

న్యూఢిల్లీ, జూలై 27: కేంద్ర ప్రభుత్వంతో నిత్యం ఘర్షణ పడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

07/28/2016 - 05:21

న్యూఢిల్లీ, జూలై 27: కేంద్ర ప్రభుత్వం విషయంలో కొన్ని అంశాల్లో అసంతృప్తి ఉన్నట్టు టిడిపి పార్లమెంటరీ పార్టీ నాయకుడు, కేంద్రమంత్రి సుజనా చౌదరి వెల్లడించారు.

07/28/2016 - 05:19

న్యూఢిల్లీ, జూలై 27: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలు తీరు, విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలుపై గురువారం రెండు గంటలకు రాజ్యసభలో చర్చ జరగనుంది. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ సభ్యుడు కెవిపీ రామచంద్రరావు ప్రతిపాదించిన ప్రైవేటు బిల్లు విషయంలో ఓటింగ్‌పై సోమ, మంగళవారాలలో కాంగ్రెస్ రాజ్యసభను స్తంభింపజేయడం తెలిసిందే.

07/28/2016 - 05:18

ఔరంగాబాద్, జూలై 27: మహోధృతంగా ప్రారంభమైన స్వచ్ఛ్భారత్ కార్యక్రమం ప్రస్తుతం ఓ సువర్ణావకాశాన్ని కోల్పోయిన చందంగా మారిందని పారిశుధ్య నిపుణుడు గౌరీశంకర్ ఘోష్ తీవ్రస్వరంతో వ్యాఖ్యానించారు. అనుకున్న స్థాయిలో ఇది ముందుకు సాగకపోవడం వల్ల పారిశుధ్య భారత్ ఆవిష్కరణ గాడి తప్పిందని వ్యాఖ్యానించారు.

07/28/2016 - 05:17

చెన్నై, జూలై 27: చెన్నై సమీపంలోని తాంబరం ఎయిర్‌బేస్‌నుంచి పోర్టు బ్లెయిర్‌కు వెళ్తూ ఆరు రోజుల క్రితం బంగాళాఖాతంపై కనిపించకుండా పోయిన వాయుసేన విమానం ఎఎన్-32 కోసం బుధవారం కూడా గాలింపు కొనసాగింది. కాగా, సముద్రంలో కొన్ని శకలాలు కనిపించాయని, అయితే అవి ఎఎన్-32 విమానానికి చెందినవో, కాదో నిర్ధారించాల్సి ఉందని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ రామేశ్వరంలో విలేఖరులతో చెప్పారు.

Pages