S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/21/2016 - 18:05

దిల్లీ: బ్యాంకులకు రుణాల ఎగవేతకు సంబంధించి ఎట్టకేలకు కింగ్‌ఫిషర్ యజమాని విజయ్ మాల్యా సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. తన ఆస్తుల వివరాలు అడిగే హక్కు బ్యాంకులకు లేదని ఆయన పేర్కొన్నారు. విచారణకు హాజరుకావాలని ఈడీ పంపిన సమన్లను పట్టించుకోని మాల్యా గడువు ముగిసే రోజున సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.

04/21/2016 - 18:03

నైనిటాల్: ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలనను రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య వ్యవస్థకు ఊపిరి పోసిందని మాజీ సిఎం హరీష్ రావత్ (కాంగ్రెస్) అన్నారు. రాష్టప్రతికి తప్పుడు సలహాలిచ్చి ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన విధించినందుకు ప్రధాని మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా భారత జాతికి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

04/21/2016 - 16:45

దిల్లీ: ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించిన తొలి భారతీయ మహిళా జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ విదేశాల నుంచి గురువారం దిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నపుడు క్రీడాభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. దేశ ప్రజల ఆకాంక్షల మేరకు రియో ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తానన్న ఆత్మవిశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేసింది. జిమ్నాస్టిక్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందని ఆమె సంతోషం వ్యక్తం చేసింది.

04/21/2016 - 16:44

నైనిటాల్: ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలనను రద్దు చేస్తూ నైనిటాల్‌లోని హైకోర్టు ధర్మాసనం గురువారం చారిత్రక తీర్పు ఇచ్చింది. రాష్టప్రతి పాలన విధించడంలో కేంద్ర ప్రభుత్వం తీరును కోర్టు తప్పు పట్టింది. రాష్టప్రతి పాలన రద్దు కావడంతో మాజీ ముఖ్యమంత్రి హరీష్‌రావత్‌కు ఈ నెల 29న అసెంబ్లీలో బలనిరూపణకు అవకాశం కల్పించాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది.

04/21/2016 - 16:40

దిల్లీ: కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా ఆస్తులను జప్తు చేసే దిశగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ (ఈడీ) అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది. మాల్యా, ఆయన కుటుంబ సభ్యులు ఆస్తుల వివరాలు ప్రకటించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన గడువు గురువారంతో ముగిసింది. అయినప్పటికీ మాల్యా నుంచి ఎలాంటి స్పందన లేనందున ఇక ఆయన ఆస్తులను జప్తు చేయాలన్న ఆలోచనలో ఈడీ ఉన్నట్లు తెలుస్తోంది.

04/21/2016 - 14:54

నాసిక్ (మహారాష్ట్ర): నాసిక్‌లోని అత్యంత ప్రాచీనమైన త్రయంబకేశ్వర ఆలయం గర్భగుడిలోకి గురువారం ఉదయం మహిళలు ప్రవేశించి పూజలు చేశారు. ఆలయాల్లోకి మహిళలను అడ్డుకోరాదని ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో త్రయంబకేశ్వర ఆలయ ట్రస్టు బోర్డు పాత నిబంధనలను సడలించింది. ఉదయం 6 నుంచి ఒక గంటసేపు తడి దుస్తులతో వచ్చి మహిళలను గర్భగుడిలోకి రావచ్చని ఆంక్షలను సడలించారు.

04/21/2016 - 14:54

కోయంబత్తూరు: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు, ఎన్నికల పర్యవేక్షకులు వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తూ భారీగా నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. కోయంబత్తూరులో గురువారం ఉదయం 1.34 కోట్ల నగదును పట్టుకున్నారు. కర్నాటక నుంచి కారులో ఈ నగదును తెస్తున్నట్లు కనుగొని, ఇద్దరిని అరెస్టు చేశారు.

04/21/2016 - 12:20

శ్రీనగర్: జమ్ము-కాశ్మీర్‌లోని కుప్పారా జిల్లాలో గురువారం ఉదయం భద్రతాదళాలకు, విద్రోహ శక్తులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది మరణించాడని భద్రతాసిబ్బంది తెలిపారు.

04/21/2016 - 12:16

కోల్‌కత: పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి గురువారం జరుగుతున్న మూడో విడత పోలింగ్‌లో హింస చోటుచేసుకుంది. బుర్ద్వాన్ జిల్లా కేటుగ్రామ్‌లో పోలింగ్ బూత్ వద్ద ప్రత్యర్థులు నాటు బాంబు విసరగా ఓ సిపిఎం కార్యకర్త మృతిచెందాడు. గాయపడ్డ ఇద్దరిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. మూడో విడతలో 62 నియోజవర్గాల్లో 16వేల పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు.

04/21/2016 - 10:56

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: శ్రీనగర్ నిట్ విద్యార్థులు డిమాండ్లపై యాజమాన్యం సానుకూలంగా స్పందించింది. స్టూడెంట్ కౌన్సిల్ ఏర్పాటుతోపాటు జాతీయ పండుగలు నిర్వహించాలన్న డిమాండ్లకు అధికారులు అంగీకరించారు. ఇటీవల నిట్‌లో జరిగిన ఘర్షణల నేపథ్యంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పడంలో భాగంగా బుధవారం ఇక్కడ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.

Pages