S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/12/2016 - 05:05

లడఖ్‌లో 6కిలోమీటర్లు దూసుకొచ్చిన పిఎల్‌ఎ
ప్రతిఘటించిన ఐటిబిపి దళాలు
గంటల పాటు సంఘర్షణ పరిస్థితి

03/12/2016 - 05:04

భిన్న సంస్కృతుల దిక్సూచి భారత్ సాంస్కృతిక సమ్మేళనంలో మోదీ
అవరోధాలు సహజం..ఎదుర్కోవాలి స్పష్టం చేసిన రవిశంకర్

03/11/2016 - 17:57

న్యూఢిల్లీ: ఆధార్ బిల్లును లోక్‌ సభ ముజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య వాదోపవాదనలు జరిగాయి. దీన్ని ఆర్థిక బిల్లు మాదిరిగా ప్రవేశపెట్టడంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందేలా చూడటమే ఆధార్ బిల్లు ముఖ్య ఉద్దేశమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సభకు వివరించారు.

03/11/2016 - 17:41

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్‌ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు శుక్రవారం ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ఆయన ప్రస్తావించారు. తెలుగు రాష్ర్టాలకు సంబంధించిన అంశాలను పలువురు ఎంపీలు రాజ్యసభలో ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించడంతోపాటు కొత్త రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.

03/11/2016 - 17:30

చెన్నై: త్వరలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 13వేల మంది ఖైదీలకు ఓటుహక్కు ఉందని, వారంతా ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి రాజేశ్‌ లఖోనీ తెలిపారు. మే 16న అసెంబ్లీ ఎన్నికల్లో 100శాతం పోలింగ్‌ నమోదయ్యేలా చర్యలు చేపట్టామని, ఖైదీలూ ఓటుహక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

03/11/2016 - 16:07

దిల్లీ: భారతీయ వాయుసేనలో యుద్ధ పైలెట్లుగా శిక్షణ పొందుతున్న భావనాకాంత్, మోహనాసింగ్, అవనీ చతుర్వేది నాలుగేళ్ల పాటు గర్భధారణకు దూరంగా ఉండాల్సి ఉంటుందని ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఈ ముగ్గురూ జూన్ 18న పూర్తి స్థాయిలో విధుల్లో చేరతారు.

03/11/2016 - 16:07

దిల్లీ: పలు ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకుని బకాయిపడిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) నోటీసులు జారీ చేసింది. విచారణకు స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది. మాల్యా దేశం విడిచివెళ్లిపోయిన నేపథ్యంలో ఇడి సమన్లు జారీ చేయడం గమనార్హం.

03/11/2016 - 13:15

ముంబయి: బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయలు బకాయిపడి లండన్ వెళ్లిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా విషయంలో ఎన్‌డిఎ సర్కారు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించినట్లు శివసేన ఆరోపించింది. ఈ మేరకు ఆ పార్టీ పత్రిక ‘సామ్నా’లో మోదీ ప్రభుత్వం తీరును తీవ్ర విమర్శలు చేశారు.

03/11/2016 - 12:52

ముంబయి: కింగ్‌ఫిషర్‌ సంస్థ మాజీ సీఎఫ్‌వో ఎ.రఘనాథన్‌ని ముంబయిలోని ఈడీ అధికారులు శుక్రవారం ప్రశ్నించారు. ఐదుగురు ఐడీబీఐ అధికారులకు మనీలాండరింగ్‌ కేసులో దర్యాప్తు నిమిత్తం ఈడీ సమన్లు జారీ చేసింది. రుణాల ఎగవేతకు సంబంధించిన వివరాలు ఈడీ రాబడుతోంది.

03/11/2016 - 12:46

దిల్లీ: ఏపీ రాజధాని అమరావతికి పర్యావరణ అనుమతులను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణను నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఏప్రిల్‌ 4కు వాయిదా వేసింది. తదుపరి విచారణకు హాజరుకావాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశించింది. పిటిషనర్‌ కోర్టులో పోరాడేందుకు ఫేస్‌బుక్‌ ద్వారా విరాళాలు సేకరిస్తున్నారని ఏపీ న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. విరాళాల సేకరణపై క్షమాపణ చెప్పాలని పిటిషనర్‌కు ఎన్జీటీ ఆదేశించింది.

Pages