S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/26/2016 - 18:39

కోయంబత్తూర్‌: డీఎండీకే అధినేత, సినీనటుడు విజయ్‌కాంత్‌ దంపతులపై తిరుపూర్‌ ప్రిన్సిపల్‌ న్యాయస్థానం అరెస్టువారెంట్‌ జారీచేసింది. గత మూడు విచారణలకు హాజరుకాని విజయ్‌కాంత్‌ మంగళవారం కూడా హాజరుకాకపోవడంతో కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరుకానందుకు విజయ్‌కాంత్‌, ఆయన సతీమణి ప్రేమలతకు న్యాయమూర్తి అలమేలు నటరాజన్‌ వారెంట్‌ జారీ చేశారు.

07/26/2016 - 16:41

దిల్లీ: తమ పార్టీ ఎంపీ కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై చర్చ జరపాలని రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు మంగళవారం పట్టబట్టారు. ఈ బిల్లుపై ఇప్పట్లో ఓటింగ్ జరిగే అవకాశం లేదని ఇదివరకే తాను రూలింగ్ ఇచ్చానని, నోటీసు ఇస్తే చర్చకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని డిప్యూటీ చైర్మన్ కురియన్ అన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ ఎంపీలు వెల్‌లోకి దూసుకుపోయి నిరసన కొనసాగిస్తున్నారు.

07/26/2016 - 16:39

ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రాల్లో సైనికులకు ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ 16 ఏళ్లుగా నిరాహార దీక్ష చేస్తున్న ‘మణిపూర్ ఉక్కుమహిళ’ షర్మిల తన ఆందోళనకు స్వస్తి చెప్పబోతున్నారు. ఆగస్టు9న నిరాహార దీక్షను ముగిస్తానని ఆమె మంగళవారం ఇక్కడ ప్రకటించారు. ఇక తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆమె తెలిపారు. ముక్కుకు అమర్చిన పైపుద్వారా అందించే ద్రవ పదార్థాలతో ఇన్నాళ్లూ ఆమె జీవిస్తున్నారు.

07/26/2016 - 16:36

విశాఖ : మిస్సయిన విమానం జాడ కనుగొనే ప్రయత్నంలో నారింజరంగులో ఉన్న రెండు డ్రమ్ములను బంగాళాఖాతంలో ఎయిర్‌ఫోర్స్‌, నావీ సిబ్బంది గుర్తించారు. ఈ డ్రమ్ములు కూలిపోయిన విమానానికి సంబంధించినవిగా అధికారులు భావిస్తున్నారు. అయితే, ఈ డ్రమ్ములు ఆ విమానంకు చెందినవిగా అధికారికంగా ప్రకటించలేదు. నాలుగు రోజుల కిత్రం చెన్నై నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు బయలుదేరిన విమానం తప్పిపోయిన విషయం తెలిసిందే.

07/26/2016 - 16:32

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడవ వేతన సంఘం సిఫారుసుల అమలుకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. పెంచిన వేతనాలను ఆగస్టు నుంచి అందుకుంటారు. బేసిక్, పెన్షన్ పెంపునకు సంబంధించి 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 52 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు.

07/26/2016 - 15:53

ముంబై : దుబాయ్ నుంచి మాల్దీవులు వెళ్తున్న విమానంలో పొగలు రావడంతో పైలెట్ విమానాన్ని అత్యవసరంగా
మంగళవారం ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్‌ అయ్యింది. విమానంలో ఉన్న350 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

07/26/2016 - 13:40

మంబయి: పుణెకు చెందిన ఆరుగురు విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పుణె-మంబయి రహదారిలో బోల్తా పడటంతో ఐదుగురు మృతి చెందగా మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోగా, ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

07/26/2016 - 12:49

శ్రీనగర్: జమ్ము-కాశ్మీర్‌లో భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. నౌగామ్ వద్ద మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఓ ఉగ్రవాదిని సైనికులు పట్టుకున్నారు.

07/26/2016 - 12:39

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టగా - చర్చకు రాకుండా భాజపా సభ్యులు అడ్డుకుంటున్నారని, తన హక్కులకు భంగం కలిగించారని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు (కాంగ్రెస్‌) సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు.

07/26/2016 - 12:33

దిల్లీ: దేశ రక్షణ కోసం చివరి శ్వాస వరకూ పోరాడిన సైనికులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్గిల్‌ విజయ్‌ దివస్‌ను పురస్కరించుకుని అమరవీరులకు ట్విట్టర్‌ వేదికగా నివాళులర్పించారు. 1999 మేలో భారత్‌లో పాక్‌ సైనికులు చొరబడేందుకు ప్రయత్నించడంతో ఇరు దేశాల మధ్య కార్గిల్‌ యుద్ధం జరిగింది.

Pages