S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/26/2016 - 11:54

ముంబయి: స్వల్ప నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు కొనసాగుతున్నాయి. 15 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్‌, 7 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 67.36 పైసలు వద్ద కొనసాగుతోంది.

07/26/2016 - 04:57

న్యూఢిల్లీ, జూలై 25: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కాంగ్రెస్ సభ్యులు సోమవారం రాజ్యసభను స్తంభింపజేశారు. సభ్యుల ఆందోళన మధ్య రాజ్యసభ మూడుసార్లు వాయిదా పడింది. ప్రత్యేక హోదా బిల్లుపై చర్చ జరగకుండా ప్రభుత్వమే అడ్డుపడుతోందని కాంగ్రెస్ పక్ష ఉపనేత ఆనంద్ శర్మ, సీనియర్ నాయకుడు జైరాం రమేష్ ఆరోపించారు.

07/26/2016 - 04:56

న్యూఢిల్లీ, జూలై 25: భారత్-పాకిస్తాన్‌ల మధ్య తలెత్తుతున్న ఉద్రిక్త పరిస్థితులు ఓ అనూహ్య పరిణామాలకు దారితీసింది. పాకిస్తాన్‌లోని భారత హైకమిషన్‌లో పనిచేస్తున్న దౌత్యవేత్తలు, ఇతర అధికారుల పిల్లల్ని ఇతర దేశాల్లో చదివించాలని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే తమ పిల్లల్ని ఇతర దేశాల్లో చదివించాలని పేర్కొంది.

07/26/2016 - 04:53

బదోహి, జూలై 25: ఉత్తరప్రదేశ్‌లో ఒక స్కూలు బస్సును రైలు ఢీకొన్న దుర్ఘటనలో ఎనిమిది మంది పిల్లలు దుర్మరణం చెందారు. మరో 14 మంది గాయపడ్డారు. ఎలాంటి కాపలా లేని లెవెల్ క్రాసింగ్ వద్ద సోమవారం ఈ ప్రమాదం జరిగింది. రైలు వేగంగా వస్తున్నా దాన్ని ఎంతమాత్రం గమనించకుండా క్రాసింగ్‌కు దాటేందుకు స్కూలు బస్సు డ్రైవర్ ప్రయత్నించడం వల్లే ఈ ఘోరప్రమాదం జరిగింది.

07/26/2016 - 04:51

న్యూఢిల్లీ/చెన్నై, జూలై 25: గత నాలుగు రోజులుగా విస్తృత ఉపరితల అనే్వషణ జరుపుతున్న వైమానికి దళ రవాణా విమానం ఎఎన్-32 జాడ తెలియకపోవడంతో ప్రయాణికుల్లో ఎవరూ సజీవంగా బయటపడే అవకాశం లేదన్న సంకేతాలు కనిపిస్తున్నాయ. ఇప్పటివరకూ ఇటు శకలాలు గానీ, అటు ప్రయాణికుల ఆనవాళ్లు గాని కనిపించకపోవడంతో ఈ నిర్ధారణకు వస్తున్నట్లు తెలుస్తోంది.

07/26/2016 - 04:45

జోధ్‌పూర్, జూలై 25: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు కృష్ణ జింకలను వేటాడిన కేసులో ఊరట లభించింది. 1998లో జోధ్‌పూర్‌లో కృష్ణ జింకలను వేటాడినట్లు అభియోగాలు ఉన్న రెండు కేసులలో సల్మాన్ ఖాన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ రాజస్థాన్ హైకోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది. చనిపోయిన కృష్ణ జింకల నుంచి సేకరించిన తూటాలు సల్మాన్ ఖాన్ లైసెన్స్‌డ్ గన్‌నుంచి కాల్చినవి కాదని హైకోర్టు పేర్కొంది.

07/26/2016 - 04:43

న్యూఢిల్లీ, జూలై 25: దేశవ్యాప్తంగా లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకూ, పెన్షనర్లకు జీతాలు పెంచుతూ 7వ వేతన సంఘం చేసిన సిఫార్సులు ఆగస్టు నెల నుంచే అమలులోకి అమలులోకి రాబోతున్నాయి. ఇందుకు సంబంధించి ఈ వారంలోనే నోటిఫికేషన్ రావచ్చునని తాజా సంకేతాలను బట్టి స్పష్టమవుతోంది.

07/26/2016 - 04:42

న్యూఢిల్లీ, జూలై 25: ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీస్ చేపట్టిన నిరసన కార్యక్రమాలు ఏడో రోజుకు చేరుకున్నాయి. సోమవారం మాదిగ కవులు-రచయితలు జంతర్ మంతర్‌లో జరుగుతున్న నిరసన కార్యమ్రంలో పాల్గొన్నారు. యెండ్లూరి సుధాకర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధించుకొని స్వేచ్ఛాప్రతిమ డప్పు కొట్టాలని ఉందని అన్నారు.

07/26/2016 - 04:41

న్యూఢిల్లీ, జూలై 25: దేశంలో అత్యంత సంపన్న వర్గంగా భావించే పార్శీ జనాభా గత పదేళ్లలో గణనీయంగా తగ్గిపోయింది. 2001లో 69వేలపై చిలుకు ఉన్న ఈ జనాభా 2011 నాటికి 22శాతం తగ్గి 57వేలకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ సహా కొన్ని రాష్ట్రాల్లో పార్శీలు కేవలం వందల సంఖ్యలోనే ఉన్నట్టు తాజా గణాంక వివరాలను బట్టి తెలుస్తోంది. ఢిల్లీలో కనిష్ఠ స్థాయిలో పార్సీలు కేవలం 221 మాత్రమే.

07/26/2016 - 04:39

న్యూఢిల్లీ, జూలై 25: పొకెమాన్ గొ గేమ్ జ్వరం హైరేంజ్‌కి చేరుకుంది. పర్ఫార్మెన్స్ కన్సార్టియంకు చెందిన వాలంటీర్లు ఆదివారం ఇండియాగేట్ వద్ద దాదాపు రెండున్నర గంటలపాటు పొకెమాన్ వాక్ నిర్వహించి అరుదైన డిజిటల్ పురుగులను పట్టుకునే కార్యక్రమాన్ని శిక్షకులతో నిర్వహించారు. ‘పొకె హంట్ ఇండియాగేట్ దగ్గర 5గంటలకు మొదలైంది. వీలైనన్ని పొకె బాల్స్‌ను సేకరించేందుకు ఆ ప్రాంతంలో పొకె స్టాప్స్ ఉన్నాయి.

Pages