S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/26/2016 - 04:38

న్యూఢిల్లీ, జూలై 25: పార్లమెంటు హౌస్ కాంప్లెక్స్‌ను వీడియో తీసిన సంఘటనపై జరుగుతున్న దర్యాప్తు పూర్తయ్యేవరకు లోక్‌సభకు హాజరుకావద్దని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ మాన్‌ను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆదేశించారు. అయితే త్వరలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్లమెంటులో తన గళాన్ని నొక్కేసేందుకే బిజెపి, కాంగ్రెస్, అకాలీదళ్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని మాన్ ఆరోపించారు.

07/26/2016 - 03:10

న్యూఢిల్లీ, జూలై 25: గర్భస్రావం చట్టంలోని ఒక నిబంధన ప్రకారం ఒక అత్యాచార బాధితురాలు సరిగా ఎదగని తన 24 వారాల గర్భస్థ పిండాన్ని తొలగించుకోవడానికి సుప్రీంకోర్టు సోమవారం అనుమతిచ్చింది. గర్భాన్ని కొనసాగించుకోవడం వల్ల తల్లికి శారీరకంగా, మానసికంగా ముప్పు పొంచి ఉన్నదనే కారణంతో అత్యున్నత న్యాయస్థానం మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్-1971లోని సెక్షన్ 5 ప్రకారం ఈ అనుమతి ఇచ్చింది.

07/25/2016 - 18:29

జైపూర్: పోలీసులపైకి కాల్పులు జరుపుతూ ఖైదీలు జీపులో పారిపోతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. మృతుల్లో అయిదుగురు ఖైదీలున్నారు. రాజస్థాన్‌లోని చురూ జిల్లాలో సోమవారం ఈ ఘటన జరిగింది. భూ వివాదానికి సంబంధించి పరారైన ఖైదీలు కోహినా గ్రామానికి చేరుకున్నారన్న సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చూసి ఖైదీలు కాల్పులు జరుపుతూ జీపులో పారిపోతుండగా మరో జీపు ఢీకొంది.

07/25/2016 - 18:28

అమృత్‌సర్ : పంజాబ్‌కు దూరంగా ఉండాలని బిజెపి నాయకత్వం తనకు చెప్పినందువల్లే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ సోమవారం మీడియాకు తెలిపారు. పంజాబ్ కంటే ఏ రాజకీయ పార్టీ తనకు ఎక్కువ కాదని, సొంత ఇంటిని కాదని తాను ఎక్కడికీ పోలేనన్నారు. సొంత రాష్ట్రం,సొంత ప్రజలే తనకు ముఖ్యమన్నారు. ఎంపి పదవికి రాజీనామా చేసిన సిద్ధూ బిజెపిని మాత్రం వీడలేదు.

07/25/2016 - 18:27

మనాలి (హిమాచల్ ప్రదేశ్): ఇజ్రాయల్ దేశానికి చెందిన యువతిపై మనాలి వద్ద ఇద్దరు దుండగులు అత్యాచారం చేసిన ఘటన సోమవారం వెలుగు చూసింది. మనాలిలో పర్యాటక ప్రాంతాలను చూసేందుకు ఇజ్రాయల్ యువతి తన స్నేహితులతో కలిసి ఆదివారం వచ్చింది. ఆమె స్నేహితులు మరో ప్రాంతాన్ని సందర్శించేందుకు వెళ్లగా ఆమె మనాలిలో ఉండిపోయింది.

07/25/2016 - 17:14

ముజఫర్‌పూర్: ముజఫర్‌పూర్‌ ( బీహార్‌)లోని అహియాపూర్ ప్రాంతంలో సోమవారం ఆటో, బస్సు ఢీకొని 14 మంది చనిపోయారు. గాయపడినవారిని ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

07/25/2016 - 17:10

దిల్లీ: అత్యాచార బాధితురాలి కడుపులో పెరుగుతున్న పిండం ఆమె ప్రాణాలకు ముప్పుగా మారవచ్చని వైద్యుల కమిటీ నివేదికతో అబార్షన్‌కు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. 24 వారాల గర్భవతి అయిన బాధితురాలి పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం దీనిపై ముంబై వైద్యులతో ఓ కమిటీ ఏర్పాటు చేసి నివేదిక కోరింది. అత్యాచార బాధితురాలి కడుపులో పెరుగుతున్న పిండం అసాధారణంగా ఉందని ద్యుల కమిటీ రిపోర్ట్ ఇచ్చింది.

07/25/2016 - 15:59

ముంబయి: దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 292 పాయింట్లు లాభపడి 28,095 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 94 పాయింట్ల లాభంతో 8,635 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 67.27 వద్ద కొనసాగుతోంది.

07/25/2016 - 15:40

దిల్లీ: తమ పార్టీ సభ్యుడు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపీలు పట్టుబట్టడంతో రాజ్యసభలో సోమవారం గందరగోళం ఏర్పడింది. ఎపికి ప్రత్యేక హోదాకోసం పెట్టిన ప్రైవేటు బిల్లును చర్చించాలని వారు కోరారు. నిబంధనల ప్రకారం దీన్ని ఇపుడు చర్చించలేమని ఆగస్టు 6న సభలో ప్రవేశపెడతామని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ చెప్పినప్పటికీ కాంగ్రెస్ సభ్యులు వినిపించుకోలేదు.

07/25/2016 - 12:51

దిల్లీ: తమ పార్టీ ఎంపి కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన బిల్లు చర్చకు రాకుండా అధికార పక్షం అడ్డుకుందని, ఈరోజైనా చర్చకు అవకాశం కల్పించాలని రాజ్యసభలో సోమవారం నాడు కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. సభలో బిల్లురాకుండా అడ్డుకోవడం సరికాదని, సభ్యుల హక్కులను కాలరాస్తున్నారని కాంగ్రెస్ ఎంపి ఆనంద్ శర్మ అన్నారు. ఈరోజు బిల్లుపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపీలు పట్టుబట్టడంతో గందరగోళ వాతావరణం ఏర్పడింది.

Pages