S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/25/2016 - 12:50

లక్నో: కాపలా లేని రైల్వే క్రాసింగ్ వద్ద స్కూల్ వ్యాన్‌ను పాసింజరు రైలు ఢీకొనగా 8 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. యుపిలోని బడోహి జిల్లాలో సోమవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. ఓ ప్రైవేటు స్కూల్‌కు చెందిన వ్యాన్ 19 మంది విద్యార్థులతో వెళుతుండగా కాపలాలేని రైల్వే క్రాసింగ్ వద్ద వారణాసి-అలహాబాద్ పాసింజరు ఢీకొట్టింది. వ్యాన్ నుజ్జునుజ్జవడంతో 8 మంది పిల్లలు మృత్యువాత పడ్డారు.

07/25/2016 - 12:48

దిల్లీ: ఎపికి ప్రత్యేక ప్యాకేజీ అవసరమని, ఈ విషయమై లోక్‌సభలో చర్చించాలని శ్రీకాకుళం ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు (టిడిపి) సోమవారం లోక్‌సభలో నోటీసు ఇచ్చారు. అశాస్ర్తియ పద్ధతుల్లో ఆదరాబాదరాగా రాష్ట్ర విభజన జరిగిందని, అన్ని విధాలా ఎపి నష్టపోయిందన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కేంద్రమే ఆదుకోవాలన్నారు.

07/25/2016 - 12:46

దిల్లీ: తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ సోమవారం ఉదయం ఇక్కడికి చేరుకున్నారు. ఈరోజు ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగే విందులో ఆయన పాల్గొంటారు. మంగళవారం నాడు పలువురు కేంద్ర మంత్రులను గవర్నర్ కలుస్తారు. విభజన సమస్యలు, నదీజలాల వివాదాలు, హైకోర్టు విభజన వంటి అంశాలను ఆయన కేంద్రమంత్రులతో చర్చించే అవకాశం ఉంది.

07/25/2016 - 12:44

జైపూర్‌: రెండు కృష్ణజింకలను వేటాడిన కేసులో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ రాజస్థాన్‌ హైకోర్టు సోమవారం తీర్పు చెప్పింది. సినిమా షూటింగ్‌ కోసం 1998లో సల్మాన్‌ రాజస్థాన్‌ వెళ్లారు. జోధ్‌పూర్‌ అటవీ ప్రాంతంలో సల్మాన్‌ రెండు కృష్ణజింకలను వేటాడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారించిన జోధ్‌పూర్‌ కోర్టు రెండు కేసుల్లోనూ ఏడాది, ఐదేళ్లపాటు జైలు శిక్ష విధించింది.

07/25/2016 - 12:36

దిల్లీ: దిల్లీలో మెహ్రౌలి నియోజకవర్గ ఆప్‌ ఎమ్మెల్యే నరేశ్‌ యాదవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పవిత్ర గ్రంథం ఖురాన్‌ను అపవిత్రం చేశారనే ఆరోపణలతో నరేశ్‌ను పంజాబ్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం తీసుకెళ్లారు. 12 గంటల వ్యవధిలో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులు అరెస్టయ్యారు.

07/25/2016 - 12:30

దిల్లీ: భద్రతా వ్యవస్థను దాటుతూ, పార్లమెంట్‌లోకి ఎలా ప్రవేశించాలో వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్‌ మాన్‌ను లోక్‌సభ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ సుమిత్రా మహజన్‌ ఆదేశాలు జారీచేశారు. మాన్‌పై విచారణకు 9మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేశామని, కమిటీ ఆగస్టు 3న నివేదిక సమర్పిస్తుందని తెలిపారు.

07/25/2016 - 07:56

శ్రీనగర్, జూలై 24: కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ తన ప్రవర్తనను మార్చుకోవాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హితవు పలికారు. జమ్మూకాశ్మీర్ ప్రజలకు ఏవైనా సమస్యలుంటే వాటిని చర్చల ద్వారా పరిష్కరించవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఏ రూపంలో ఉన్నా సహించబోదని స్పష్టం చేశారు.

07/25/2016 - 07:54

చెన్నై, జూలై 24: చెన్నైనుంచి పోర్ట్‌బ్లెయిర్ 29 మందితో వెళ్తూ జాడతెలియకుండాపోయిన వాయుసేనకు చెందిన ఎఎన్32 విమానంకోసం నిర్విరామంగా సాగిస్తున్న గాలింపు మూడోరోజుకు చేరుకున్నప్పటికీ విమానం జాడ ఏమాత్రం తెలియకపోవడంతో గాలింపు బృందాలు ఇప్పుడు ఉపగ్రహ చిత్రాల సాయం తీసుకోవాలని భావిస్తున్నారు.

07/25/2016 - 07:51

కుప్పం, జూలై 24: తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి-బెంగళూరు జాతీయ రహదారిలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పది మంది దుర్మరం చెందగా 28 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

07/25/2016 - 07:50

ఇస్లామాబాద్, జూలై 24: ఏదో ఒక రోజు కాశ్మీర్ పాకిస్తాన్‌లో కలవడం ఖాయమంటూ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు ఆయన మితిమీరిన ఆకాంక్షకు అద్దం పడుతున్నాయని దేశీయ పత్రికలే దుమ్మెత్మిపోశాయి. ఈ రకమైన ప్రకటనలు చేయడం ఇటు పాకిస్తాన్‌కు, అటు కాశ్మీర్ ప్రజలకు మంచిది కాదని డైలీ టైమ్స్ పత్రిక వ్యాఖ్యానించింది.

Pages