S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/25/2016 - 07:49

న్యూఢిల్లీ, జూలై 24: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. విద్యుత్ కోతల గురించి అడిగేందుకు వెళ్లిన తనను హతమార్చబోయాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే అమానతుల్లాఖాన్‌ను అరెస్టు చేశారు. ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే ఖాన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన అనంతరం ఆయన్ను అరెస్టు చేశారు.

07/25/2016 - 07:49

న్యూఢిల్లీ, జూలై 24: ఉగ్రవాద దాడి జరిగేందుకు ఆస్కారం ఉందంటూ కేంద్ర నిఘా ఏజెన్సీలు ఢిల్లీ పోలీసులను, ఇతర సీనియర్ అధికారులను హెచ్చరించాయి. దేశ రాజధాని నగరంలోని అన్ని కీలక స్థావరాలు, ప్రాంతాల వద్ద గట్టి నిఘా, నియంత్రణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశాయి. తమకు అందిన సమాచారం ప్రకారం ఢిల్లీలోని కీలక ప్రాంతాలపై దాడులు జరిపేందుకు ఉగ్రవాదులు పన్నాగం పన్నినట్లు స్పష్టం అవుతోందని వెల్లడించాయి.

07/25/2016 - 07:17

చెన్నై, జూలై 24: ప్రముఖ వయొలిన్ విద్వాంసురాలు ఎ కన్యాకుమారి ఈ ఏడాది మద్రాసు మ్యూజిక్ అకాడమీ ప్రతిష్ఠాత్మక సంగీత కళానిధి పురస్కారానికి ఎంపికయ్యారు. ఆదివారం ఇక్కడ సమావేశమైన కార్యవర్గం ఆమెను ఈ పురస్కారానికి ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు అకాడమీ అధ్యక్షుడు ఎన్ మురళి చెప్పారు.

07/24/2016 - 18:13

పాట్నా: హౌరా-గోరఖ్‌పూర్ రైలులో ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న బిజెపి ఎమ్మెల్సీ తున్నా పాండేపై ఆ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. పాండేను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు బిజెపి బిహార్ శాఖ ప్రకటించింది. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుపై హాజీపూర్ పోలీసులు కేసు నమోదు చేసి పాండేను కోర్టులో హాజరుపరిచారు. ఆగస్టు 6వరకూ ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది.

07/24/2016 - 18:07

చెన్నై: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏఎన్-32 విమానం అదృశ్యమై మూడు రోజులు కావస్తున్నా ఇంకా ఆచూకీ దొరకలేదు. మూడో రోజు ఆదివారం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సముద్రంలో ప్రతికూల వాతావరణం ఉండటం గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. 18 నౌకలు, 8 విమానాలు, ఒక సబ్మెరైన్ సాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఉపగ్రహాల సాయంతో శోధిస్తున్నారు.

07/24/2016 - 16:51

చెన్నై: తమిళనాడులో కృష్ణగిరి-హోసూరు ప్రధాన మార్గంలో ఆదివారం ఆర్టీసీ బస్సు, కంటైనర్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 8 మృతిచెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు.

07/24/2016 - 14:21

పాట్నా: హౌరా- గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన బిజెపి ఎమ్మెల్సీ తున్నాజీ పాండేను పోలీసులు అరెస్టు చేశారు. దురగ్‌పూర్ వద్ద రైలులో ఎక్కిన పాండే ఆదివారం తెల్లవారు జామున అదే కోచ్‌లో ప్రయాణిస్తున్న బాలిక వద్దకు వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆ బాలిక కేకలు వేయగా ఆమె తల్లిదండ్రులు వచ్చి పాండేను నిలదీశారు.

07/24/2016 - 15:36

భువనేశ్వర్: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లే తప్పుడు మార్గంలో వెళితే మనం ముక్కున వేలేసుకోవాల్సిందే. తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఏడుగురు టీచర్లపై 15 మంది బాలికలు ధైర్యంగా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కోరాపుట్‌ జిల్లా దమన్‌జోడిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఈ ఉదంతం వెలుగు చూసింది.

07/24/2016 - 12:52

దిల్లీ: ఓ మహిళను బెదిరించినట్లు వచ్చిన అభియోగంపై దిల్లీలో ఆదివారం ఉదయం ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానుల్లా ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవలి కాలంలో పలు కేసుల్లో ఆప్ ఎమ్మెల్యేలు వరుసగా అరెస్టు కావడం గమనార్హం. తమ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేను ప్రధాని మోదీజీ అరెస్టు చేయించారని ఆప్ అధినేత, దిల్లీ సిఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

07/24/2016 - 12:41

విశాఖ : విమానంలో గల్లంతైన ఎన్ఏడీ ఉద్యోగుల కుటుంబాలను తూర్పు నావికాదళ వైస్‌ అడ్మిరల్‌ బిస్త్‌ ఆదివారం పరామర్శించారు. గల్లంతైన విమానంలో విశాఖపట్టణానికి చెందిన 8 మంది ఎన్ఏడీ ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు మొత్తం ఆందోళనలో ఉన్నారు.

Pages