S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/13/2016 - 16:43

దిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు చెందిన పాస్‌పోర్టును వెనక్కితీసుకోవాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దిల్లీలోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాన్ని కోరింది. పలు బ్యాంకులకు 9వేల కోట్ల రూపాయలను చెల్లించాల్సిన మాల్యాను విచారణకు హాజరు కావాలని తాము పలుసార్లు సమన్లు పంపినా స్పందించడం లేదని ఈడీ చెబుతోంది.

04/13/2016 - 16:41

దిల్లీ: ఆదాయానికి మించి ఆస్తులను కలిగినందున యుపి మాజీ సిఎం మాయావతిపై తాజాగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ బుధవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. సిబిఐ చేత సమగ్ర విచారణ జరిపించాలని పిటిషనర్లు కోరారు. దీన్ని విచారించేందుకు కోర్టు స్వీకరించింది.

04/13/2016 - 13:56

రాంచీ: తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల నుంచి గట్టెక్కేలా వానలు కురవాలని ఆకాంక్షిస్తూ భక్తులు నిప్పుల గుండంలో నడిచారు. జార్ఖండ్ రాజధాని రాంచీకి సమీపంలోని చిటియాలో బుధవారం నాడు భక్తులు ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ నిప్పులపై నడిచారు. ఇలా నడిస్తే ఈశ్వరుడు కరుణించి వర్షాలు కురిపిస్తాడని ఈ ప్రాంత వాసుల విశ్వాసం.

04/13/2016 - 13:56

దిల్లీ: స్థానిక విద్యార్థుల దాడుల నుంచి తమను కాపాడాలని కోరుతూ శ్రీనగర్ నిట్‌కు చెందిన స్థానికేతర విద్యార్థులు బుధవారం దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా ప్రారంభించారు. ఇటీవల క్రికెట్ మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయినపుడు స్థానిక విద్యార్థులు సంబరాలు జరుపుకున్నారని, దీన్ని తాము ప్రశ్నించగా దాడులకు దిగుతున్నారని స్థానికేతర విద్యార్థులు చెబుతున్నారు.

04/13/2016 - 13:55

హరిద్వార్: హనీమూన్ పేరిట కొత్తగా పెళ్లయిన వారు పుణ్యక్షేత్రాలకు వస్తూ అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నందునే వరదలు సంభవిస్తున్నాయని ద్వారకా శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, 2013లో కేదారినాథ్‌లో వరదలకు ఈ అపవిత్ర పనులే కారణమన్నారు.

04/13/2016 - 08:47

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: దేశంలో పేరుకు పోతున్న లక్షలాది కోట్ల రూపాయల మొండి బకాయిల పట్ల సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వందల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్న వ్యక్తులు తమ కంపెనీలు దివాలా తీశాయంటూ తప్పించుకు పారిపోతున్నారని, కానీ, 15వేలు, 20వేలు మేర చిన్న రుణాలు తీసుకున్న పేద రైతులు వేధింపులకు గురవుతున్నారని సుప్రీం కోర్టు చురక వేసింది.

04/13/2016 - 07:24

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: మన దేశంలో పర్యటిస్తున్న బ్రిటిష్ యువరాజు విలియమ్, ఆయన సతీమణి కేట్ మిడిల్టన్‌లకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రాత్రి హైదరాబాద్ హౌస్‌లో విందు ఇచ్చారు. ఇండియా గేట్ పక్కన ఉన్న హైదరాబాద్ హౌస్ మెట్ల వద్ద ప్రధాని మోదీ యువరాజు దంపతులకు స్వయంగా స్వాగతం పలికారు. విందులో నాలుగు రకాల భారతీయ శాకాహార, మాంసాహార వంటకాలను వడ్డించారు.

04/13/2016 - 07:21

‘పత్రికా రంగానికి చెందిన నన్ను పద్మ విభూషణ్‌తో సత్కరించి కేంద్రం పత్రిక స్వేచ్ఛ పట్ల తన నిబద్ధత చాటుకుంది. పత్రిక రంగం ప్రజాసేవకు అద్భుత వేదిక. నిబద్ధతతో పనిచేస్తూ పోతే గుర్తింపు దానంతటదే వస్తుంది’
- రామోజీ
‘హిందీ, తెలుగు భాషకు వారధిగా వ్యవహరిస్తాను. హిందీ భాషతో జాతీయ సమైక్యతకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి దక్కిన గౌరవం ఇది’
- యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్

04/13/2016 - 07:21

కొచ్చి/కొల్లాం, ఏప్రిల్ 12: కేరళలోని అన్ని దేవాలయాల్లో భారీ ధ్వనికారక బాణసంచా వినియోగంపై హైకోర్టు మంగళవారం నిషేధం విధించింది. కొల్లాంలోని పరువూర్ పుట్టింగల్ దేవి ఆలయంలో 110మంది ప్రాణాలను బలిగొన్న బాణసంచా పేలుడుపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాసనం, తీవ్రస్థాయిలో స్పందించింది.

04/13/2016 - 07:18

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (నిట్)ను శ్రీనగర్‌నుంచి మార్చే ప్రసక్తి లేదని జమ్మూ,కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి దేశ రాజధాని ఢిల్లీ వచ్చిన మెహబూబా అంతకుముందు హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. కాగా, రాజ్‌నాథ్‌తో తన భేటీని ఆమె కేవలం మర్యాదపూర్వక భేటీగా అభివర్ణించారు.

Pages