S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/07/2016 - 17:49

దిల్లీ: పారదర్శక పాలన, అవినీతి నిర్మూలన గురించి అనునిత్యం మాట్లాడే ప్రధాని మోదీ సుమారు 45 వేల కోట్ల రూపాయల టెలికాం స్కామ్‌ను తొక్కిపెడుతున్నారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆర్‌ఎస్ సుర్జేవాలా గురువారం ఆరోపించారు. కొంతమంది పారిశ్రామికవేత్తలకు కొమ్ము కాస్తున్న ఎన్‌డిఎ ప్రభుత్వం ఆరు టెలికాం కంపెనీలపై జరిమానా విధించకుండా ఆశ్రీతపక్షపాతంతో వ్యవహరిస్తోందన్నారు.

07/07/2016 - 17:49

విజయవాడ: అన్ని రంగాల్లోనూ విఫలమైన మోదీ ప్రభుత్వాన్ని వచ్చే పార్లమెంటు సమావేశాల్లో నిలదీస్తామని సిపిఎం అగ్రనేత ప్రకాష్ కారత్ అన్నారు. ఇక్కడ గురువారం జరిగిన ఎపి సిపిఎం కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికధరలు, నిరుద్యోగం, అవినీతి నిర్మూలనలో ప్రధాని మోదీ విఫలమయ్యారని ఆరోపించారు. ప్రజాసమస్యలపై జూలై 11 నుంచి 17 వరకూ జాతీయస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తామన్నారు.

07/07/2016 - 17:36

ముంబయి: ‘మతం పేరుతో ఎవరైనా ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తే దానిని అనుసరించవద్దు. ఉగ్రవాదానికి, మతానికి సంబంధం లేదు. ఉగ్ర చర్యలకు పాల్పడే వారు మాత్రం తమ మతం కోసం చేస్తున్నామని చెపుతున్నారు. వారికి మతంతో సంబంధమే ఉండదు.’ అని బాలీవుడ్‌ స్టార్‌ ఆమీర్‌ఖాన్‌ పేర్కొన్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఉగ్రభూతంపై గురువారం ఆయన స్పందించారు.

07/07/2016 - 15:49

దిల్లీ: ఇక్కడ కేంద్రమంత్రి షానవాజ్ నివాసంలో గురువారం జరిగిన రంజాన్ వేడుకల్లో బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ, ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్,వెంకయ్య నాయుడు, ప్రకాష్ జవదేకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు షానవాజ్‌కు శుభాకాంక్షలు తెలిపి కీర్ సేవించారు.

07/07/2016 - 15:48

పూణె: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో తొలిసారి ముస్లిం మహిళలు ప్రార్ధనలు చేసుకునేందుకు రంజాన్ సందర్భంగా గురువారం నాడు ఈద్గా మైదానంలోకి అనుమతి ఇచ్చారు. ముస్లిం మతపెద్దలు ఇందుకు అనుమతించడం గొప్ప విజయమని భూమాత బ్రిగేడ్ సంస్థ అధ్యక్షురాలు తృప్తి దేశాయ్ పూణెలో హర్షం వ్యక్తం చేశారు.

07/07/2016 - 15:44

శ్రీనగర్‌ : జమ్మూకాశ్మీర్‌ పూంచ్ సెక్టార్‌లో సైనికులు గురువారం భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరు ఉగ్రవాదులను జవాన్లు విచారించడంతో ఈ డంప్‌ బయటపడింది.

07/07/2016 - 14:36

ఢిల్లీ: సవాళ్లను అధిగమించి వాటిని అవకాశాలుగా మార్చుకుంటామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. హెచ్ఆర్డీ అధికారులతో సమావేశమైన అనంతరం విద్యకు సంబంధించి రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తామన్నారు. విద్యారంగంలో సంస్కరణల అమలుకు కృషి చేయడంతోపాటు..

07/07/2016 - 07:33

న్యూఢిల్లీ, జూలై 6: ఆఫ్రికా ఖండంలోని అన్ని దేశాలతోనూ ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచుకోవాలన్నదే తాను చేపట్టనున్న తాజా పర్యటన లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఇక్కడ స్పష్టం చేశారు. ఆర్థిక సంబంధాలే కాకుండా ఈ దేశాల ప్రజలతో కూడా భారత్‌ను సన్నిహితం చేయాలన్నదే తన ఉద్దేశమని తెలిపారు.

07/07/2016 - 07:26

న్యూఢిల్లీ, జూలై 6: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పట్ట్భాషేకం సెప్టెంబర్ నెలాఖరులో ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాహుల్ గాంధీని కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించేందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్ని పనులు సక్రమంగా జరిగితే సెప్టెంబర్ నెలాఖరులో ఆయనను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకుంటారని సీనియర్ కాంగ్రెస్ నాయకుడొకరు వెల్లడించారు.

07/07/2016 - 07:24

న్యూఢిల్లీ, జూలై 6: కేంద్ర జవుళి శాఖ మంత్రిగా బుధవారం బాధ్యతలు స్వీకరించిన స్మృతి ఇరానీ తనను మానవ వనరుల మంత్రిత్వ శాఖనుంచి మారడం గురించి విలేఖరుల ప్రశ్నలకు సమాధానంగా ఓ పాపులర్ హిందీ పాటను ఉదహరించారు. ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు మరింత ఎక్కువ సమయం ఇవ్వడానికి ఈ మార్పు చేశారా?

Pages