S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/06/2016 - 12:46

శ్రీనగర్‌: కశ్మీర్‌ పండిట్లకు సైనిక కాలనీ ఏర్పాటుకు నిరసనగా హురియత్ కాన్ఫరెన్స్ బుధవారం ఆందోళనకు దిగింది. పాకిస్తాన్, ఐసీస్‌ జెండాలతో ఆందోళనకు దిగారు. ఆర్మీ జవాన్లపై రాల్లు రువ్వారు. దీంతో శ్రీనగర్‌లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆందోళనకారులపై జవాన్లు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు.

07/06/2016 - 12:12

దిల్లీ: ప్రపంచ దేశాలతో పోటీపడేలా మన విద్యావ్యవస్థను తీర్చిదిద్దడమే తన ఏకైక లక్ష్యమని కేంద్ర మానవ వనరుల శాఖామంత్రిగా పదోన్నతి పొందిన ప్రకాష్ జవదేకర్ అన్నారు. శాఖ మారిన అనంతరం ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచేలా విద్యారంగాన్ని మార్చాల్సి ఉందన్నారు.

07/06/2016 - 11:29

పూరీ : బుధవారం పూరీ జగన్నాథ రథయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. శ్రీకృష్ణుడు, బలరామదేవుడు, సుభద్ర విగ్రహాలను ఘనంగా నరగ వీథుల్లో ఊరేగిస్తున్నారు. యాత్రను తిలకించేందుకు భారీ సంఖ్యలో దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వచ్చారు. ఆషాఢ శుక్ల విదియనాడు ప్రారంభమయ్యే యాత్ర 9 రోజుల పాటు సాగుతుంది. 9వ రోజున ప్రధాన ఆలయానికి చేరుకుంటుంది.

07/06/2016 - 03:26

కేబినెట్ మంత్రులు
రాజ్‌నాథ్‌సింగ్ హోం శాఖ
సుష్మా స్వరాజ్ విదేశీ వ్యవహారాలు
అరుణ్ జైట్లీ ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాలు
వెంకయ్యనాయుడు పట్టణాభివృద్ధి, సమాచార ప్రసార శాఖ,
హౌసింగ్, పట్టణ పేదరిక నిర్మూలన
నితిన్ గడ్కరీ రోడ్డు రవాణా, హైవేలు, షిప్పింగ్
మనోహర్ పారికర్ రక్షణ
సురేశ్ ప్రభు రైల్వేలు

07/06/2016 - 04:50

న్యూఢిల్లీ, జూలై 5: ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గాన్ని 19మంది కొత్త సహాయ మంత్రులతో నింపేశారు. ప్రస్తుత సహాయ మంత్రి ప్రకాశ్ జావడేకర్‌కు మాత్రమే కేబినెట్ హోదా పదోన్నతి కల్పించి అందరినీ ఆశ్చర్యపర్చారు. బిజెపికి చెందిన ఐదుగురు సహాయ మంత్రులకు ఉద్వాసన పలకటం ద్వారా మానభంగాలకు పాల్పడేవారికి, అసమర్థులకు తన మంత్రివర్గంలో స్థానం ఉండదని స్పష్టం చేశారు.

,
07/06/2016 - 02:40

న్యూఢిల్లీ, జూలై 5: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ మరికొందరు మంత్రుల శాఖలు మార్చివేయటం ద్వారా షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. మంత్రివర్గం విస్తరణలో క్యాబినెట్ మంత్రులను చేర్చుకుని పాత మంత్రుల శాఖలను ప్రధాని పెద్దగా మార్చకపోవచ్చుననుకున్న వారి అంచనాలు తలకిందులయ్యాయి.

07/06/2016 - 04:59

ఎంజె అక్బర్

,
07/06/2016 - 00:54

న్యూఢిల్లీ, జూలై 5: అర్జున్‌రామ్ మేఘ్వాల్, రాందాస్ అతవాలే రాష్టప్రతి భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకారానికి తలపాగాలు ధరించి వచ్చారు. లోక్‌సభలో బిజెపి చీఫ్‌విప్ అయిన మేఘ్వాల్ ఎప్పుడూ కూడా రంగురంగుల తలపాగా ధరించే ఉంటుండగా, అతవాలే నేవీబ్లూ తలపాగా ధరించి ప్రమాణ స్వీకారానికి వచ్చారు.

చిత్రాలు.. సైకిల్‌పై ప్రమాణ స్వీకారానికి వస్తున్న మన్సుఖ్ భాయ్ మాండవియ, అర్జున్‌రామ్ మేఘ్వాల్

07/06/2016 - 00:09

మెల్‌బోర్న్, జూలై 5: లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని భారత ఎన్నికల కమిషనర్ నజీమ్ జైదీ స్పష్టం చేశారు. అయితే ఇందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలు తీసుకురావాలని, అదే విధంగా రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయాన్ని పాదుకొల్పాలని స్పష్టం చేశారు.

07/06/2016 - 05:04

న్యూఢిల్లీ, జూలై 5: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన రాజకీయ నేపథ్యం, ఓబిసి మూలాలు కలిగిన అనుప్రియ పట్టేల్ బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దిగే అవకాశం ఉందా? ప్రధాని మోదీకి విధేయురాలిగా భావిస్తున్న అనుప్రియ అప్నాదళ్ టికెట్‌పై మీర్జాపూర్ నుంచి ఘన విజయం సాధించారు.

Pages