S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/03/2016 - 03:32

డెహ్రాడూన్, జూలై 2: కుండపోత వర్షాలవల్ల అనేక నదులు పొంగుపొర్లుతుండటంతో ఉత్తరాఖండ్ అతలాకుతలం అవుతోంది. సహాయక బృందాలు శిథిలాల కింది నుంచి మరో రెండు మృతదేహాలను వెలికితీయడంతో భారీవర్షాల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య శనివారంనాటికి 14కు పెరిగింది. రాష్టవ్య్రాప్తంగా గల పది నదులు, ఇతర వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొండచరియలు విరిగిపడటం వల్ల అనేక మార్గాలలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.

07/03/2016 - 03:30

శ్రీనగర్, జూలై 2: దక్షిణ కాశ్మీరు హిమాలయాల్లోని పరమ పవిత్ర అమర్‌నాథ్ పుణ్యక్షేత్రానికి వార్షిక తీర్థయాత్రలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు జమ్మూ-కాశ్మీరు గవర్నర్ ఎన్‌ఎన్.వోహ్రా శనివారం భక్తులతో కలసి అమరేశ్వరునికి పూజలు నిర్వహించారు.

07/02/2016 - 18:29

తిరువనంతపురం: సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతాను తెరిచారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండటంతో పాటు ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

07/02/2016 - 18:16

ఘజియాబాద్‌ ( ఉత్తరప్రదేశ్‌): ఆస్తి తగాదాలతో భార్యే భర్తను చంపిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. తండ్రి జితేంద్ర సింగ్‌ తోమర్‌ జూన్‌ 26 నుంచి కనిపించడం లేదని ఆయన కూతురు కవినగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆయన కుమారుడు అమిత్‌, కారు డ్రైవర్‌ ప్రవీణ్‌ను ప్రశ్నించారు. తల్లి, కారు డ్రైవర్‌లతో కలిసి తండ్రిని హత్య చేసినట్లు అమిత్‌ అంగీకరించారు.

07/02/2016 - 17:36

ముంబయి: ముంబయి నగరాన్ని వర్షాలు వణికిస్తున్నాయి. సబర్బన్‌ రైలు సర్వీసులు అన్నీ 15నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. వచ్చే 24గంటల్లో ముంబయిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ముంబయితో పాటు మహారాష్ట్ర, గోవా ప్రాంతాల్లో కూడా వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కొలాబాలో 77 మిల్లీమీటర్ల వర్షపాతం, శాంతాక్రజ్‌లో 77 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

07/02/2016 - 17:29

దిల్లీ: తెలంగాణలో న్యాయాధికారుల నియామకాలపై నిరసనల నేపథ్యంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్‌ ఠాకూర్‌తో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి దిలీప్‌ భోసలే శనివారం భేటీ అయ్యారు. న్యాయాధికారుల సస్పెన్షన్‌ తదనంతర పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.

07/02/2016 - 11:41

చెన్నై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్యకేసులో అనుమానితుడైన రామ్‌కుమార్ (24)ను చెన్నై పోలీసులు తిరునెల్వేలిలో ఎట్టకేలకు అరెస్టు చేశారు. పోలీసులను చూడగానే బ్లేడుతో గొంతుకోసుకుని నిందితుడు ఆత్మహత్యకు యత్నించి గాయపడడంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడు కోలుకున్న తర్వాత పోలీసులు విచారణ జరిపితే హత్యకు దారితీసిన కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

07/02/2016 - 08:05

ముంబయి, జులై 1: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో మరో విషయం వెలుగులోకి వచ్చింది. 2012 ఏప్రిల్ 24వ తేదీన తాము కారులో వెళ్తున్నప్పుడు షీనా తల్లి ఇంద్రాణీ ముఖర్జియా తన కుమార్తెపై కూర్చుని ఆమె గొంతు నులిమిందని ఈ కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్ శ్యామవర్ రాయ్ ఆరోపించాడు.

07/02/2016 - 08:05

థానే, జూలై 1: ఏటిఎం ఆఫీసుపై దాడి చేసి 9.16 కోట్ల రూపాయలు లూటీ కేసును మహారాష్ట్ర పోలీసులు ఛేదించారు. ముఠాలో ఆరుగురని థానే పోలీసులు అరెస్టుచేశారు. వారి వద్ద నుంచి 3.12 కోట్ల రూపాయలు రికవరీ చేశారు. ఏటిఎంలలో నగదు నింపే ఆఫీసుపై జూన్ 28 తెల్లవారుజామున దోపిడీ ముఠా దాడి చేసింది. లూటీలో 15 మంది వరకూ పాల్గొన్నట్టు పోలీసులు భావిస్తున్నారు.

07/02/2016 - 08:03

బస్తీ (ఉత్తరప్రదేశ్), జూలై 1: ఏడాదిలో వస్తున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ మూడింట రెండొంతుల మెజారిటీతో బిజెపి విజయం సాధించడం ఖాయమని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా జోస్యం చెప్పారు. పదిహేనేళ్లపాటు వంతులవారీ అధికారాన్ని అందుకున్న సమాజ్‌వాది, బహుజన్ సమాజ్‌వాది పార్టీలు భ్రష్టుపట్టుకుపోయాయని, ఆ పార్టీలకు ఇక కాలం చెల్లిందన్నారు.

Pages