S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/02/2016 - 07:54

బెంగళూరు, జూలై 1: స్వదేశీ యుద్ధ విమానం ‘తేజాస్’ శుక్రవారం భారత వైమానిక దళంలో చేరింది. ఈ తేలిక పాటి పోరాట విమానాన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) అభివృద్ధి చేసింది. బెంగళూరులోని హెచ్‌ఏఎల్ వైమానిక శిక్షణా ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలో వైమానిక దళం దక్షిణ విభాగం అధిపతి జస్బీర్ వాలియా సమక్షంలో రెండు తేజాస్ విమానాలను హెచ్‌ఏఎల్ వైమానిక దళానికి అప్పగించింది.

07/02/2016 - 04:56

న్యూఢిల్లీ, జూలై 1: స్వాతంత్రం వచ్చిన తరువాత మొదటిసారి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దేశ ప్రజలు అందరికీ ఒకే చట్టం అమలు చేసేందుకు రంగం సిద్ధంచేస్తోంది. అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఉమ్మడి పౌరస్మృతి అమలుకు ఎన్డీయే సిద్ధం కావటం ప్రాధాన్యత సంతరించుకుంది.

07/02/2016 - 03:37

న్యూఢిల్లీ, జూలై 1:ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయాలని కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి విజ్ఞప్తి చేశారు. ఐదు రోజుల చైనా పర్యటన ముగించుకొని గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి శుక్రవారం కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, ఉమాభారతి, రాజ్‌నాథ్ సింగ్‌లతో సమావేశమై చర్చలు జరిపారు.

07/02/2016 - 03:34

చెన్నై, జూలై 1: అంతర్ రాష్ట్ర పాలార్ నదిపై ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో గల చెక్‌డ్యామ్ ఎత్తు పెంచడాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి జె.జయలలిత తీవ్రంగా ఖండించారు. చిత్తూరు జిల్లాలోని పెరుంబల్లం గ్రామం వద్ద నిర్మించిన ఈ చెక్ డ్యామ్ ఎత్తును అయిదు అడుగుల నుంచి 12 అడుగులకు పెంచడాన్ని నిరసిస్తూ ఆమె ఏపి సిఎం చంద్రబాబు నాయుడుకు ఒక లేఖ రాశారు.

07/02/2016 - 03:17

ఢాకా, జూలై 1: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో శుక్రవారం అర్ధరాత్రి ప్రాంతంలో సాయుధ ఉగ్రవాదులు ఓ రెస్టారెంట్‌లోకి ప్రవేశించి 60మందిని బందీలుగా చేసుకున్నారు. పోలీసులతో విచ్చల విడిగా కాల్పులకు దిగడంతో అనేక మంది మరణించినట్టుగా స్పష్టమవుతోంది. అత్యధిక స్థాయి భద్రత కలిగిన గుల్షన్ ప్రాంతంలోనే ఈ సంఘటన చోటుచేసుకోవడం దేశ వ్యాప్తంగా అలజడి రేకెత్తింత్తించింది.

07/01/2016 - 18:19

దిల్లీ: నిత్యం ఎవరిపైనో విమర్శనాస్త్రాలు సంధిస్తూ వివాదాస్పదుడిగా పేరు పొందిన బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఇక కొన్నాళ్లు ట్విట్టర్‌లో తన వ్యాఖ్యలను తగ్గిస్తారట! ఆర్‌బిఐ గవర్నర్ రఘురాం రాజన్‌తో పాటు పలువురు ప్రముఖులపై ఆయన ఇటీవల ఘాటైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆర్‌బిఐ గవర్నర్‌పై చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించడంతో స్వామి ఇపుడు కాస్త నెమ్మదించారు.

07/01/2016 - 18:18

థానే: బూట్లు కొనివ్వమని అడిగిన నేరానికి ఆరేళ్ల పాపను కన్నతండ్రే నదిలో పడేయగా.. ఆ చిన్నారి మృత్యువును జయించి క్షేమంగా ఇంటికి చేరింది. కర్కశ హృదయులను సైతం కదిలించే ఈ ఘటన మహారాష్టల్రోని థానే జిల్లాలో జరిగింది. ఆరేళ్ల పాప ఏక్తాతులసీరాం సైనీ తనకు బూట్లు కొనాలని అడగడంతో కోపగించుకున్న తండ్రి తన స్నేహితుడితో కలిసి ఆమెను బద్లాపూర్ వద్ద వాలివ్లి వంతెనపై నుంచి బుధవారం రాత్రి 8 గంటల సమయంలో నదిలో పడేశాడు.

07/01/2016 - 18:16

చెన్నై: చిత్తూరు జిల్లాలోని పాలార్ నదిపై చెక్‌డ్యామ్ ఎత్తును పెంచాలన్న ఆలోచనకు స్వస్తి పలకాలని తమిళనాడు సిఎం జయలలిత ఎపి ప్రభుత్వాన్ని కోరారు. చెక్‌డ్యామ్ ఎత్తును పెంచాలన్న ప్రతిపాదన పట్ల ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎపి ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు.

07/01/2016 - 17:33

దిల్లీ: ఈనెల 7 నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాలుగు దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. మొజాంబిక్‌, దక్షిణాఫ్రికా, టాంజానియా, కెన్యా దేశాల్లో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు.

07/01/2016 - 17:07

ముంబై : 2005 ముందు ముద్రించిన నోట్లను మార్చుకునే అవకాశం శుక్రవారం నుంచి లేదని ఆర్ బీఐ ప్రకటించింది. 2005కు ముందు ముద్రించిన నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్ బీఐ గతంలోనే తెలిపింది. ఆ నోట్లను బ్యాంకుల్లో ఇచ్చి కొత్త నోట్లను పొందేందుకు గతేడాది చివరి వరకున్న గడువును మరో ఆరు నెలలు (జూన్ 30 వరకు) పొడిగించిన సంగతి తెలిసిందే.

Pages