S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/01/2016 - 00:57

ముంబయి, జూన్ 30: ముంబయిలోని అంధేరీ ప్రాంతంలోని ఓ మందుల దుకాణంలో గురువారం తెల్లవారుజామున సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయారు. చనిపోయిన వారిలో నలుగురు చిన్నారులు, ఓ పసికందు ఉన్నారని అగ్నిమాపక అధికారులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవించి ఉండవచ్చని భావిస్తున్నామని, ఏది ఏమయినప్పటికీ ప్రమాద కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు చెప్పారు.

07/01/2016 - 00:53

న్యూఢిల్లీ, జూన్ 30: ఉగ్రవాదానికి ఆశ్రయమిస్తూ పెంచిపోషిస్తున్న దేశాలు మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ హెచ్చరించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఐక్యంగా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు.

07/01/2016 - 00:52

న్యూఢిల్లీ, జూన్ 30: ఉపాధ్యాయుల్లో వృత్తి నైపుణ్యాన్ని వెలికితీయాలన్న ఉద్దేశంతో కేంద్రం ఓ పోర్టల్‌ను ప్రారంభించింది. ప్రజలకు విద్యాహక్కు ప్రాధాన్యత గుర్తుచేయడంతోపాటు మెరుగైన బోధన అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ స్పష్టం చేశారు.

07/01/2016 - 00:50

బాలసోర్ (ఒడిశా), జూన్ 30: మన దేశం ఇజ్రాయెల్‌తో కలిసి సంయుక్తంగా రూపొందించిన భూతలనుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే కొత్త క్షిపణిని గురువారం తొలిసారిగా విజయవంతంగా ప్రయోగించి పరీక్షించింది.

07/01/2016 - 00:48

న్యూఢిల్లీ, జూన్ 30: సైన్యంలోని త్రివిధ దళాలతో పాటుగా ప్రత్యేక దళాల కమాండ్ అత్యవసర పరిస్థితుల్లో పరిస్థితిని ఆకళింపు చేసుకుని సత్వర నిర్ణయాలు తీసుకోవడానికి వీలుగా మొట్టమొదటిసారిగా ఒక సమీకృత రక్షణ కమ్యూనికేషన్ వ్యవస్థను గురువారం ప్రారంభించారు.

07/01/2016 - 00:47

పనాజీ, జూన్ 30: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తన ప్రభుత్వం ప్రచార ఆర్భాటం కోసం కోట్లాది రూపాయలను వెచ్చిస్తోందంటూ వచ్చిన విమర్శలను ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తిప్పికొట్టారు. ప్రధాన మంత్రి మోదీ దుస్తులపై పెట్టిన ఖర్చుకంటే కూడా ప్రకటనల ద్వారా తాము వెచ్చించింది చాలా తక్కువేనని అన్నారు.

07/01/2016 - 00:46

న్యూఢిల్లీ, జూన్ 30: ‘అత్యాచారం’ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దేశవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు జాతీయ మహిళా కమిషన్ తాజాగా సమన్లు పంపింది. తన వ్యాఖ్యల విషయంలో సల్మాన్ ఇచ్చిన వివరణ ఏమాత్రం సంతృప్తికరంగా లేదని, దీని దృష్ట్యా జూలై 8న తమముందు హాజరుకావాలని ఆదేశించింది. సమన్లను ఖాతరు చేయని పక్షంలో చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించింది.

07/01/2016 - 00:45

న్యూఢిల్లీ, జూన్ 30: ఏడో వేతన సంఘ సిఫార్సులను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జూలై 11న చేపట్టిన దేశ వ్యాప్త సమ్మెకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. 70 ఏళ్లలో ఇలాంటి సిఫార్సులు చూడలేదని, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తనకు తీవ్ర అన్యాయం చేసిందంటూ ఉద్యోగులు మండిపడుతున్నారు.

07/01/2016 - 00:45

న్యూఢిల్లీ, జూన్ 30: స్వలింగ సంపర్కులను మూడో వర్గంకిందికి రారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హిజ్రాలను మాత్రమే మూడోవర్గంగా పరిగణించాలని కూడా తేల్చి చెప్పింది. హిజ్రాలకు సంబంధించి 2014 ఏప్రిల్‌లో ఇచ్చిన తీర్పును సవరించడానికి సైతం న్యాయమూర్తులు ఎకె సిక్రీ, ఎన్‌వి రమణలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది.

06/30/2016 - 18:18

హైదరాబాద్: పాతబస్తీలో ఉగ్రవాద సానుభూతిపరులను విచారించిన సందర్భంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) అధికారులకు కీలక సమాచారం లభించినట్లు తెలిసింది. పాతబస్తీలో బుధవారం ఉదయం 11 మందిని అదుపులోకి తీసుకుని ఎన్‌ఐఎ అధికారులు లోతుగా విచారించారు. చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని పేల్చివేసేందుకు ఐసిస్ ఉగ్రవాద సంస్థ కుట్ర పన్నిందన్న విషయాన్ని విచారణలో అనుమానిత వ్యక్తులు వెల్లడించినట్టు సమాచారం.

Pages