S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/30/2016 - 08:06

చెన్నై, జూన్ 29: ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఏడవ వేతన సంఘం సిపార్సులు తమకు ఎంతమాత్రం అంగీకారం కాదని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల సమాఖ్య బుధవారం స్పష్టం చేసింది. వేతన పెంపును పెంచాలన్న తమ డిమాండ్‌ను ప్రభుత్వం గనుక అంగీకరించకపోతే డిమాండ్ల సాధనకోసం చేపట్టదలచిన నిరవధిక సమ్మెను వారం రోజుల ముందే చేపడతామని హెచ్చరించింది.

06/30/2016 - 08:06

న్యూఢిల్లీ, జూన్ 29: రాజ్యసభకు కొత్తగా ఎంపికయిన 57 మంది ఎంపీల్లో 55 మంది కోటీశ్వరులు. 13 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. ఢిల్లీకి చెందిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. అత్యధిక ఆస్తులు కలిగి ఉన్న ఎంపీల్లో ఎన్‌సిపికి చెందిన ప్రఫుల్ పటేల్ మొదటిస్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ రూ. 252 కోట్లు.

06/30/2016 - 07:54

ముంబై/న్యూఢిల్లీ, జూన్ 29: బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్‌పై మహారాష్ట్ర మహిళా కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇటీవల సల్మాన్ చేసిన ‘రేప్’ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు హాజరు కావలసిందిగా ఇచ్చిన సమన్లకు సల్మాన్ హాజరు కాకుండా తన లాయర్ల ద్వారా జవాబు పంపించటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

06/30/2016 - 08:41

న్యూఢిల్లీ, జూన్ 29: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 18న ప్రారంభమై ఆగస్టు 12 వరకు జరుగుతాయి. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధక్షతన బుధవారం జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశాల్లో వస్తుసేవల పన్ను చట్టాని (జిఎస్‌టి)కి రాజ్యసభలో కచ్చితంగా ఆమోదం పొందుతామని కేంద్రం ధీమా వ్యక్తం చేసింది.

06/30/2016 - 07:52

న్యూఢిల్లీ, జూన్ 29: కాశ్మీర్ సమస్య రావణ కాష్టంలా మండటానికి కారణం భారత ప్రథమ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూనే అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆరోపించారు. కాశ్మీర్ విషయంలో నెహ్రూ చారిత్రక తప్పిదానికి పాల్పడ్డారని ఆయన విమర్శించారు. భారత్, పాక్‌ల విభజనకు అప్పటి కాంగ్రెస్ నాయకత్వానిదే బాధ్యత అని ఆయన అన్నారు.

06/30/2016 - 07:49

న్యూఢిల్లీ, జూన్ 29: ముస్లిం మతంలో అమలవుతున్న ‘తలాక్’ (ట్రిపుల్ తలాక్) విధానం రాజ్యాంగ చట్రం ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో పరిశీలించనున్నట్లు సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది. తలాక్ చెప్పి విడాకులిచ్చే విధానం ప్రజలలో ఓ పెద్దవర్గాన్ని ప్రభావితం చేస్తోందని, అందువల్ల ఇది చాలా ముఖ్యమైన అంశమని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

06/30/2016 - 07:48

లక్నో, జూన్ 29: కొన్ని సంవత్సరాలుగా ‘గుమ్‌నామీ బాబా’ ఎవరన్నదానిపై ఎనలేని ఉత్కంఠ నెలకొంటూనే వస్తోంది. భారత స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్ర బోసే ఆ గుమ్‌నామీ బాబా అన్న ప్రచారం నేపథ్యంలో వాస్తవాలను నిగ్గుతేల్చడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏకసభ్య దర్యాప్తు కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

06/30/2016 - 07:48

న్యూఢిల్లీ, జూన్ 29: దేశంలో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే భారత శిక్షాస్మృతి (ఐపిసి)లోని 377 సెక్షన్‌ను కొట్టివేయాలని కోరుతూ స్వలింగ సంపర్కులమని ప్రకటించుకున్న కొంతమంది ప్రముఖులు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం ఇప్పటికే ఈ వ్యవహారాన్ని విచారిస్తున్న బెంచ్‌కి నివేదించింది.

06/30/2016 - 07:18

న్యూఢిల్లీ,జూన్ 29: ఆంధ్ర, తెలంగాణ ఉమ్మడి హైకోర్టును వీలున్నంత త్వరగా విభజించి రెండు తెలుగు రాష్ట్రాలకు హైకోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్.్ఠకుర్‌కు విజ్ఞప్తి చేశారు.

06/30/2016 - 07:15

న్యూఢిల్లీ, జూన్ 29: ఇకపై దేశంలో రోజంతా హంగామానే.. ఎప్పుడు పడితే అప్పుడు సినిమాలకు వెళ్లొచ్చు.. షాంపిగ్‌లు చేయొచ్చు.. బ్యాంకింగ్ చేసేయొచ్చు.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో బుధవారం జరిగిన కేంద్ర మంత్రిమండలి మోడల్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టానికి పచ్చజండా ఊపింది.

Pages