S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/29/2016 - 18:16

దిల్లీ: ఎన్నాళ్లగానో అనుకుంటున్న కేంద్ర క్యాబినెట్ ప్రక్షాళనకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరిందన్న ఊహాగానాలు దేశ రాజధానిలో వ్యాపించాయి. గురువారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గంలోకి కొత్తగా కొందరికి తీసుకుంటారని, ఇంకొందరికి ఉద్వాసన చెబుతారని తాజా సమాచారం. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారని తెలిసింది.

06/29/2016 - 18:15

దిల్లీ: సినిమా థియేటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, స్టోర్లు ఇక 24 గంటలూ వ్యాపారం చేసుకోవచ్చు. ఇక్కడ బుధవారం జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంటు చట్టానికి సవరణ చేస్తారు. ప్రస్తుతం దేశంలో సేవారంగ సంస్థలు, భారీ ఉత్పత్తి సంస్థలకు మాత్రమే ఈ అవకాశం ఉంది.

06/29/2016 - 18:10

ఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ జేపీ రాజ్కోవా అనారోగ్యంతో సెలవుపై ఉన్న కారణంగా త్రిపుర గవర్నర్ తథగట రాయ్కు అరుణాచల్ ప్రదేశ్ బాధ్యతలు అప్పగిస్తూ బుధవారం రాష్ట్రపతి భవన్ నిర్ణయం తీసుకుంది. రాజ్కోవా(72) అనారోగ్యంతో మంగళవారం కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు.

06/29/2016 - 17:39

దిల్లీ: బుధవారం ఒక్క రోజే రూ. 800 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 42,910కి చేరింది. అంతర్జాతీయంగా వెండి ధర 2.54శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, డిమాండ్‌ ఎక్కువవడంతో వెండి ధర పెరిగిపోయింది. నేడు బంగారం ధర మాత్రం స్థిరంగా ఉంది. బులియన్‌ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ. 30,250గా ఉంది.

06/29/2016 - 17:34

దిల్లీ: భారత ఆడిట్‌, అకౌంట్‌ సేవలకు చెందిన 1981 బ్యాచ్‌ ఆఫీసర్‌ నందకిశోర్‌ డిప్యూటీ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌)గా నియమితులయ్యారు. నందకిశోర్‌ ఈ ఏడాది సెప్టెంబరు 1న డిప్యూటీ కాగ్‌గా బాధ్యతలు తీసుకోనున్నారని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆయన నియామకాన్ని కేబినెట్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆమోదించింది.

06/29/2016 - 17:29

గాంధీనగర్: దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సూరత్‌లో నిర్వహించతలపెట్టిన సభకు గుజరాత్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. వచ్చే నెల 9,10 తేదీల్లో అరవింద్ కేజ్రీవాల్ రెండురోజుల పాటు గుజరాత్‌లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. సోమనాథ దేవాలయ సందర్శన, రైతులతో ముఖాముఖి అనంతరం ఆయన సూరత్‌లో జరిగే సభలో ప్రసంగించాల్సి ఉంది. అయితే, సూరత్‌లో సభకు అనుమతించరాదని గుజరాత్ సర్కారు నిర్ణయించింది.

06/29/2016 - 17:28

ముంబయి: కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యాను ఇప్పటికే ‘ఉద్దేశ పూర్వక ఎగవేతదారుడి’గా ప్రకటించిన ముంబయిలోని ప్రత్యేక కోర్టు ఆయనకు బుధవారం మరో షాక్ ఇచ్చింది. మనీ ల్యాండరింగ్ కేసులో జూలై 29న ఉదయం 11 గంటల లోగా తమ ఎదుట మాల్యా హాజరుకావాలని కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి పిఆర్ భావ్‌కే ఆదేశించారు.

06/29/2016 - 17:27

దిల్లీ: జన బాహుళ్యంలో ఎంతో ప్రసిద్ధి చెందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను నిషేధించలేమని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. సమాచార హక్కు కార్యకర్తల సుధీర్ యాదవ్ వాట్సాప్‌ను నిషేధించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం బుధవారం తిరస్కరించింది. నేరాలు పెరగడానికి దోహదపడుతున్నందున వాట్సాప్‌ను నిషేధించేలా ఉత్తర్వులు ఇవ్వాలని సుధీర్ యాదవ్ తన పిటిషన్‌లో కోరారు.

06/29/2016 - 17:27

పాట్నా: ఇటీవల యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని అవమానపరిచారని బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లా కోర్టులో ప్రకాష్‌కుమార్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. జాతీయ పతాకాన్ని మడిచి పెట్టడమే కాకుండా, దాంతో మోదీ ముఖం తుడుచుకున్నారని అంతర్జాలంలో వచ్చిన ఫొటోలను పిటిషన్‌దారు కోర్టుకు సాక్ష్యాలుగా సమర్పించారు. ఈ పిటిషన్‌పై జూలై 16న విచారణ జరుగుతుందని న్యాయమూర్తి ప్రకటించారు.

06/29/2016 - 17:26

దిల్లీ: అత్యాచారం గురించి మహిళలను కించపరచేలా మాట్లాడిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తన వ్యాఖ్యలకు ఎలాంటి క్షమాపణ చెప్పలేదు. జాతీయ మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసుకు ఆయన తన లాయర్ ద్వారా సమాధానం పంపారని, ఎక్కడా క్షమాపణ ప్రస్తావన లేదని జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ లలితా కుమారమంగళం బుధవారం తెలిపారు.

Pages