S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/11/2016 - 16:07

దిల్లీ: పలు ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకుని బకాయిపడిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) నోటీసులు జారీ చేసింది. విచారణకు స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది. మాల్యా దేశం విడిచివెళ్లిపోయిన నేపథ్యంలో ఇడి సమన్లు జారీ చేయడం గమనార్హం.

03/11/2016 - 13:15

ముంబయి: బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయలు బకాయిపడి లండన్ వెళ్లిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా విషయంలో ఎన్‌డిఎ సర్కారు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించినట్లు శివసేన ఆరోపించింది. ఈ మేరకు ఆ పార్టీ పత్రిక ‘సామ్నా’లో మోదీ ప్రభుత్వం తీరును తీవ్ర విమర్శలు చేశారు.

03/11/2016 - 12:52

ముంబయి: కింగ్‌ఫిషర్‌ సంస్థ మాజీ సీఎఫ్‌వో ఎ.రఘనాథన్‌ని ముంబయిలోని ఈడీ అధికారులు శుక్రవారం ప్రశ్నించారు. ఐదుగురు ఐడీబీఐ అధికారులకు మనీలాండరింగ్‌ కేసులో దర్యాప్తు నిమిత్తం ఈడీ సమన్లు జారీ చేసింది. రుణాల ఎగవేతకు సంబంధించిన వివరాలు ఈడీ రాబడుతోంది.

03/11/2016 - 12:46

దిల్లీ: ఏపీ రాజధాని అమరావతికి పర్యావరణ అనుమతులను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణను నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఏప్రిల్‌ 4కు వాయిదా వేసింది. తదుపరి విచారణకు హాజరుకావాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశించింది. పిటిషనర్‌ కోర్టులో పోరాడేందుకు ఫేస్‌బుక్‌ ద్వారా విరాళాలు సేకరిస్తున్నారని ఏపీ న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. విరాళాల సేకరణపై క్షమాపణ చెప్పాలని పిటిషనర్‌కు ఎన్జీటీ ఆదేశించింది.

03/11/2016 - 11:40

రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్- తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని కుంట అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో కూంబింగ్ నిర్వహిస్తున్న సిఆర్‌పిఎఫ్ జవాన్లలో 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను భద్రాచలం ఆస్పత్రిలో చేర్పించారు. ఈ సంఘటనతో అటవీప్రాంత ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.

03/11/2016 - 07:04

న్యూఢిల్లీ, మార్చి 10: ముస్లిం వర్గానికి చెందిన నూర్‌బాష, దూదేకుల ఎస్సీ హోదా పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం గురువారం జంతర్‌మంతర్ వద్ద వౌన ప్రదర్శన నిర్వహించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దళిత ముస్లింలు విద్యాపరంగా, ఆర్థికంగానూ ఎంతో వెనుకబడి ఉన్నారని సంఘం అధ్యక్షుడు సత్తార్ సాహెబ్ ఆవేదన వ్యక్తం చేశారు.

03/11/2016 - 06:34

న్యూఢిల్లీ, మార్చి 10: బాబ్రీ మసీదు కేసులో బిజెపి నేతలు ఎల్‌కె అద్వానీ, మురళీమనోహర్ జోషీ, ఉమాభారతిపై దాఖలైన నేరపూరిత కుట్ర కేసు విచారించే బెంచ్ నుంచి సుప్రీం కోర్టు న్యాయమూర్తి వి గోపాలగౌడ్ తప్పుకున్నారు. అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేతపై పలువురు బిజెపి, విహెచ్‌పి నేతలపై కేసులు నమోదయ్యాయి.

03/11/2016 - 06:34

పట్టించుకోని చంద్రబాబు
ఎంపీలు కెవిపి, సుబ్బరామిరెడ్డి, జెడి శీలం ధ్వజం
రాష్టప్రతికి కోటి సంతకాలు సమర్పించనున్న ఏపిపిసిసి నేతలు
మోదీ హామీని గుర్తుచేసేందుకే ఢిల్లీ టూర్ అని వెల్లడి

03/11/2016 - 06:32

అటవీ అధికారులే కేసు బనాయించారు
కృష్ణ జింకల కేసులో సల్మాన్‌ఖాన్ వాదన

03/11/2016 - 06:31

రాజ్యసభలో బిజెడి ఆరోపణ * పునరావాస పనులపై నిలదీత

Pages