S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/28/2016 - 18:07

ముంబై : ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ గా ఉన్న ఎన్ఎస్ విశ్వనాథన్ ను కొత్త డిప్యూటీ గవర్నర్ గా నియమిస్తూ ప్రభుత్వ ప్యానల్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ ఈ పదవిలో ఉన్న హెచ్ఆర్ ఖాన్ జూలై 3తో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నియమకాన్ని చేపట్టింది. ఆర్బీఐ గవర్నర్ గా రెండోసారి కొనసాగలేనని రఘురాంరాజన్ స్పష్టంచేయడంతో ఆ పదవిలోకి ఎవరొస్తారన్న ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే.

06/28/2016 - 18:01

ముంబై: మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ తీవ్ర ఒడిదుడుకులను ఫేస్ చేశాయి. బ్రెగ్జిట్ పరిణామాల అనంతరం తొలిసారి ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాలతో.. నష్టాలతో బెంబేలెత్తిన దేశీయ మార్కెట్లు మంగళవారం గా కోలుకున్నాయి. దీంతో సెన్సెక్స్ 122 పాయింట్ల లాభంతో 26,524 దగ్గర, నిఫ్టీ 33 పాయింట్ల లాభంతో 8,127 దగ్గర ముగిసాయి.

06/28/2016 - 17:49

ముంబయి: మాలెగావ్‌ పేలుళ్ల కేసులో నిందితురాలిగా ఉన్న సాధ్వి ప్రజ్ఞ సింగ్‌ ఠాకూర్‌కుజాతీయ దర్యాప్తు ఏజెన్సీ(ఎన్‌ఐఏ) ప్రత్యేక కోర్టు మంగళవారం బెయిల్‌ నిరాకరించింది. సాధ్వి ప్రజ్ఞకు వ్యతిరేకంగా ఆధారాలు లభించకపోవడం వల్ల ఆమెపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని ఎన్‌ఐఏ వెల్లడించింది. ఆమె బెయిల్‌ పిటిషన్‌పైనా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఎన్‌ఐఏ జూన్‌ 6న స్పష్టంచేసింది.

06/28/2016 - 17:07

మహారాష్ట్ర : ఇంజిన్‌లో సమస్య కారణంగా ఆగిపోయిన మడగావ్‌-నిజాముద్దిన్‌ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ఒక్కసారిగా కదిలి- దాదాపు 15 కిలోమీటర్లు డ్రైవర్‌ లేకుండా ప్రయాణించింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే రైలును నిలిపివేశారు. ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో రత్నగిరి స్టేషన్‌ సమీపంలోని ఓ సొరంగ మార్గం వద్ద నిలిపివేశారు. అయితే ఓ వైపు టెక్నీషియన్లు సరిచేస్తుండగానే.. రైలు ఉన్నట్లుండి కదలడం ప్రారంభించింది.

06/28/2016 - 16:48

దిల్లీ: దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ సిఎం కెసిఆర్ ధర్నా చేస్తే తాము స్వాగతిస్తామని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై కెసిఆర్ విమర్శలు చేయడం తనకు విస్మయం కలిగించందని ఆయన మంగళవారం తెలిపారు. హైకోర్టు విభజన విషయమై కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ తనను కలిసిన సందర్భంగా గౌడ ఈ వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు విభజన అనేది తన పరిధిలో లేదన్నారు.

06/28/2016 - 16:48

ముంబయి: అమరావతి ప్రాంతంలోని అంజన్‌గావ్‌లో మంగళవారం నాడు ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. వీరి ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.

06/28/2016 - 16:46

దిల్లీ: అణు సరఫరాదారుల బృందం (ఎఎస్‌జి)లో భారత్ చేరికకు చైనా మద్దతు ఇవ్వనందుకు నిరసనగా ఆ దేశానికి చెందిన వస్తువులను ప్రజలంతా బహిష్కరించాలని స్వదేశీ జాగరణ్ మంచ్ పిలుపునిచ్చింది. చైనాకు నిరసనగా మంగళవారం ఇక్కడ మంచ్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. చైనా రాయబార కార్యాలయం వద్ద నిరసనకు దిగిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించడంతో కొంతసేపు ఉద్రిక్తత ఏర్పడింది.

06/28/2016 - 16:46

దిల్లీ: తెలుగురాష్ట్రాలకు చెందిన ఉమ్మడి హైకోర్టును త్వరితగతిన విభజించాలని తెరాస ఎంపీలు మంగళవారం ఇక్కడ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. హైకోర్టు విభజన, ఆంధ్రా జడ్జిల ఆప్షన్ల రద్దు కోసం న్యాయవాదులు చేస్తున్న సమ్మె తీవ్రరూపం దాల్చుతోందని, ఇప్పటివరకూ ఏడుగురు తెలంగాణ జడ్జిలపై హైకోర్టు సస్పెన్షన్ విధించిందని వారు వివరించారు.

06/28/2016 - 16:45

చెన్నై: శాంతి భద్రతలపై ప్రజల్లో నమ్మకం సడలిపోకుండా గట్టి చర్యలు తీసుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పోలీస్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆమె మంగళవారం పోలీస్ బాస్‌లతో సమావేశమై రాష్ట్రంలో శాంతి భద్రతల విషయమై ఆరా తీశారు.

06/28/2016 - 14:30

దిల్లీ: ఎపి, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు (బిజెపి), విజయసాయిరెడ్డి (వైకాపా), డి.శ్రీనివాస్ (తెరాస), కెప్టెన్ లక్ష్మీకాంతరావు (తెరాస) మంగళవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ఉప రాష్టప్రతి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హమీద్ అన్సారీ వీరిచేత ప్రమాణం చేయించారు.

Pages