S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/30/2016 - 06:39

న్యూఢిల్లీ, జనవరి 29: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం ఆటవీ హక్కుల చట్టాన్ని సవరించటం ద్వారా గిరిజనులకు తీరని అన్యాయం చేస్తూ బడా పారిశ్రామికవేత్తల కొమ్ము కాస్తోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరామ్ రమేశ్ ఆరోపించారు.

01/30/2016 - 06:39

న్యూఢిల్లీ, జనవరి 29: ప్రమాదకరమైన జికా వైరస్ భారత్‌కు వ్యాపించే అవకాశాలు ఉన్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో దేశంలో నెలకొన్న పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఒక టెక్నికల్ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిర్ణయించింది. జికా వైరస్‌ను ఆదిలోనే కనిపెట్టే నిఘా వ్యవస్థను పటిష్ఠం చేయడంపైనా ఈ సాంకేతిక బృందం దృష్టి పెడుతుంది.

01/30/2016 - 05:36

భారత 67వ గణతంత్ర దినోత్సవ ఉత్సవాల ముగింపు అనంతరం మూడో రోజు జరిగే బీటింగ్ రిట్రీట్ శుక్రవారం ఢిల్లీ వీధుల్లో కనువిందుగా జరిగింది. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ గుర్రపు బగ్గీలో సంప్రదాయక రీతిలో విజయ్‌చౌక్‌కి తరలివచ్చారు. ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

01/30/2016 - 05:29

ముంబయి, జనవరి 29: దాదాపు 36 అడుగుల పొడవుండే బ్రిడే జాతికి చెందిన భారీ తిమింగలం ఒకటి ముంబయి సమీపంలోని జుహూ బీచ్‌లో ఒడ్డుకు కొట్టుకు రావడంతో ఈ భారీ ప్రాణిని చూడడానికి జనం పెద్ద సంఖ్యలో బీచ్‌కి చేరుకున్నారు. దాదాపు 20 టన్నుల బరువు, 11.3 మీటర్ల పొడవుండే ఈ తిమింగలం గురువారం రాత్రి ఒడ్డుకు కొట్టుకు వచ్చింది.

01/30/2016 - 01:57

బెంగళూరు, జనవరి 29: బెంగళూరులోని చర్చ్ స్ట్రీట్ పేలుళ్ల కేసు దర్యాప్తులో ఎట్టకేలకు దర్యాప్తు అధికారులు పురోగతి సాధించారు. పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడైన మొహమ్మద్ రఫీక్ అలియాస్ జావీద్ అలియాస్ ఆలం జెబ్ అఫ్రిదీని జాతీయ దర్యాప్తు సంస్థ శుక్రవారం అరెస్టు చేసింది.

01/29/2016 - 17:09

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని విధాన సౌధలో 8వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం(బీఐఎఫ్‌ఎఫ్‌ఈఎస్‌) అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని గురువారం రాత్రి ప్రముఖ బాలీవుడ్‌ నటి జయాబచ్చన్‌ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

01/29/2016 - 14:05

న్యూఢిల్లీ :భారత వనే్డ క్రికెట్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. మ్యాగ్‌జైన్ కవర్ పేజీ వివాదంపై ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం కోర్టులో జరుగుతున్న విచారణపై సుప్రీం కోర్టు స్టే విధించింది. కేసును అనంతపురం నుంచి బెంగుళూరుకు బదిలీ చేయాలని చేసిన విజ్ఞప్తిపై వివరణ ఇవ్వాల్సిందిగా పోలీసులను ఆదేశించింది.

01/29/2016 - 14:04

న్యూఢిల్లీ : పంజాబ్‌లోని పఠాన్‌కోటలో ఉగ్రవాదుల దాడి సంఘటన మరువకముందే రైల్వేస్టేషన్‌లో అనుమానాస్పదంగా భావిస్తూఓ ఆఫ్గాన్‌వాసిని అరెస్టు చేశారు. టిక్కెట్టు లేకుండా ప్రయాణిస్తున్న ఆఫ్గాన్‌వాసిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు.

01/29/2016 - 11:32

జైపూర్: రాజస్థాన్ రాజధాని జైపూర్‌తోపాటు మరికొన్ని జిల్లాల్లో శుక్రవారం తెల్లవారుజామున భూప్రకంపనలు సంభవించాయి. ఒక్కసారి భూమి కంపించి ఇళ్లలోని సామాన్లు చల్లాచెదురు కావడంతో జనం భయాందోళనలకు లోనయ్యారు. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 3.8గా నమోదైందని, ఎక్కడా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

01/29/2016 - 08:11

పుణె, జనవరి 28: దేశంలో సామాజిక వివక్ష ఉన్నంతవరకు రిజర్వేషన్ల విధానం కొనసాగవలసిందేనని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ‘సామాజిక వివక్ష ఉన్నంతవరకు రిజర్వేషన్లు ఉండాల్సిందే. అయితే దాన్ని నిజాయితీగా అమలు చేయాలి’ అని గురువారం ఇక్కడ మహారాష్ట్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటి) ఏర్పాటు చేసిన ‘స్టూడెంట్స్ పార్లమెంటు’ కార్యక్రమంలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా భగవత్ చెప్పారు.

Pages