S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/28/2015 - 07:06

కోల్‌కతా, డిసెంబర్ 27: భారత్-పాక్ చర్చలు నాయకులను దాటి ముందుకెల్లాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అంటూ, పాకిస్తాన్ ఆటగాళ్లను, కళాకారులను భారత్‌లో ప్రదర్శనలు ఇవ్వడానికి అనుమతించనప్పుడు చర్చలు జరిపి ఏం ప్రయోజనం? అని ప్రశ్నించారు. ‘ఇప్పుడు చర్చలు ప్రారంభమైనాయి.

12/28/2015 - 07:06

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డిడిసిఎ)లో అక్రమాలపై దర్యాప్తు జరిపిన ఢిల్లీ ప్రభుత్వ కమిటీ తన నివేదికలో ఎక్కడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పేరును ప్రస్తావించలేదు. అరుణ్ జైట్లీ గతంలో 13 ఏళ్ల పాటు (2013 వరకు) డిడిసిఎ అధ్యక్షునిగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

12/28/2015 - 07:03

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లుకు రాజ్యసభలో ఆమోదముద్ర వేయించుకోవడంతో పాటు కాలం చెల్లిన పలు చట్టాలను రద్దు చేయాలని ఆలోచిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. దేశంలో కాలం చెల్లిన వెయ్యికి పైగా చట్టాలను రద్దు చేసేందుకు ఉద్దేశించిన రెండు బిల్లులకు శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ ఆమోదం లభించకపోవడమే ఇందుకు కారణం.

12/28/2015 - 06:39

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే నర్సరీ అడ్మిషన్లలో పాటించే ప్రమాణాలను ప్రకటించని పాఠశాలలపై కఠిన చర్యలు చేపడతామని ఢిల్లీ ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ దేశ రాజధానిలో 9 వందలకు పైగా ప్రైవేటు పాఠశాలలు ఇప్పటికీ ఆ ప్రమాణాలను నోటిఫై చేయలేదు. దీంతో ఈ విషయమై గందరగోళం నెలకొంది.

12/28/2015 - 06:38

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: గనుల వేలానికి సిద్ధం కావాలని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సూచించింది. గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్నాటక, జార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో 31 గనుల వేలానికి కేంద్రం సమాయత్తమైనది తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఒడిషా, మధ్యప్రదేశ్‌లలో గనుల వేలం ప్రక్రియ ఇంకా ఊపందుకోకపోవడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

12/28/2015 - 05:06

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా పథకం బ్లూప్రింట్‌ను 16న ప్రకటించనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దేశంలోని అన్ని ఐఐటిలు, ఐఐఎంలు, కేంద్ర వర్శిటీలు, ఎన్‌ఐటిల ద్వారా యువతను కార్యక్రమంతో అనుసంధానిస్తామని అన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ పథకం గినె్నస్ బుక్‌కు ఎక్కిందని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. ఆదివారం ఆకాశవాణిలో 15వసారి మనసులో మాట కార్యక్రమంలో మాట్లాడారు.

12/27/2015 - 06:19

నాగ్‌పూర్, డిసెంబర్ 26: మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా శుక్రవారం రాత్రి ఇక్కడి సెంట్రల్ జైలు అధికారుల ఎదుట లొంగిపోయినట్లు జైలు వర్గాలు శనివారం తెలిపాయి.

12/27/2015 - 05:39

భారత్, పాక్, బంగ్లాదేశ్ ప్రజల అభీష్టం మేరకే జరుగుతుంది
చారిత్రక కారణాలతోనే భారత్‌లో పాక్, బంగ్లాదేశ్ విలీనం
బిజెపి ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ధీమా

12/27/2015 - 05:06

ఇండోర్, డిసెంబర్ 26: యుపిఎస్‌సి పరీక్షకు సిద్ధమవుతున్న యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర క్యాడర్ ఐపిఎస్ అధికారి లోహిత్ మితానీపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు.

12/27/2015 - 05:05

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్

Pages