S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/27/2016 - 18:15

దిల్లీ: మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే దినేష్ మోహనియాకు బెయిల్ ఇచ్చేందుకు నగరంలోని సాకేత్ కోర్టు సోమవారం నిరాకరించింది. నిందితుడిని రెండువారాల పాటు రిమాండ్‌కు పంపాలని న్యాయమూర్తి ఆదేశించారు. మంచినీటి సరఫరా తీరు సరిగాలేదని ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన మహిళల పట్ల దినేష్ అమానుషంగా ప్రవర్తించారని కేసు నమోదైంది.

06/27/2016 - 18:12

దిల్లీ: ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలుకు ప్రధాని నరేంద్ర మోదీ సుముఖంగా ఉన్నట్టు సమాచారం. ఈ విషయమై ఆయన ఆర్థికశాఖకు ఆదేశాలు జారీ చేశారని తెలిసింది. ఏడో వేతన సంఘం సిఫార్సులను అమలు చేసే విషయమై బుధవారం జరిగే కేంద్ర క్యాబినెట్ సమావేశంలో తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. 47 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 52 లక్షల మంది పెన్షన్‌దారులకు దీని వల్ల ఆర్థిక ప్రయోజన0 చేకూరుతుంది.

06/27/2016 - 18:09

దిల్లీ: రూ. 150 పెరగడంతో 10గ్రాముల పసిడి ధర సోమవారం రూ. 30,550కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లు, నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు ఎక్కువవడంతో ధర పెరిగిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. బ్రెగ్జిట్‌ ప్రభావంతో రెండేళ్ల గరిష్ఠానికి చేరుకుని, ఆ మరుసటి రోజే కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ బంగారం ధర మళ్లీ పెరిగింది. సోమవారం వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. రూ.

06/27/2016 - 13:34

ముంబయి: రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) తదుపరి గవర్నర్‌గా ఎవరిని నియమించాలన్న అంశంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుత ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పదవీ కాలం కొద్దిరోజుల్లోనే పూర్తవుతుంది. రెండోసారి ఆ బాధ్యతలను చేపట్టే ఆసక్తి తనకు లేదని రాజన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో గవర్నర్ పదవిని భర్తీ చేసేందుకు కొన్ని పేర్లను కేంద్రం పరిశీలిస్తోంది.

06/27/2016 - 12:11

మైసూర్: మైసూర్ యువరాజు యధువీర్ కృష్ణదత్త చామరాజ ఒడియార్‌కు రాజస్థాన్‌లోని దుంగర్‌పూర్ రాజ కుటుంబానికి చెందిన త్రిషికా కుమారి సింగ్‌తో సోమవారం ఉదయం వివాహం జరిగింది. ప్యాలెస్ కల్యాణ మంటపంలో ఉదయం 9.05 నుంచి 9.30 గంటల మధ్య కర్కాటక లగ్నం, సావిత్రి ముహూర్తంలో యదువీర్, త్రిశికా కుమారి సింగ్‌ల వివాహం జరిగింది.

06/27/2016 - 12:03

దిల్లీ: యుపి సిఎం అభ్యర్థిత్వానికి దిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ సుముఖత చూపలేదని కాంగ్రెస్ వర్గాల సమాచారం. వచ్చే ఏడాది యుపి అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నందున ఆమెను సిఎం అభ్యర్థిగా ప్రకటించాలని కాంగ్రెస్ హైకమాండ్ యోచించింది. అయితే, అందుకు షీలా అయిష్టంగా ఉన్నారని తెలిసింది. దీంతో పార్టీ పంజాబ్ వ్యవహరాల ఇన్‌చార్జి బాధ్యతలను ఆమెకు అప్పగించాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది.

06/27/2016 - 08:22

న్యూఢిల్లీ, జూన్ 26: ఉగ్రవాదం, అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలు (డ్రగ్స్) ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నాయని, ఈ బంధాన్ని విచ్ఛిన్నం చేయాల్సిన అవసరం ఉందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఉద్ఘాటించారు. దేశ సామాజిక జీవనంపై పెను ప్రభావం చూపుతున్న వీటి నిరోధానికి సమష్టి పోరాటం అవసరమని ఆయన పిలుపునిచ్చారు. మద్యపానం, మాదక ద్రవ్యాల వినియోగంతో విలువలు నశించిపోయి నేరాల సంఖ్య పెరుగుతోందని అన్నారు.

06/27/2016 - 08:00

బెంగళూరు, జూన్ 26: ముద్దంటే ఎవరికి చేదు...? అయితే బహిరంగంగా అందరూ చూస్తుండగా ముద్దు పెట్టుకుంటే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. ముఖ్యమంత్రి లాంటి ప్రజా జీవితంలో ఉన్న వాళ్లయితే మరీ చెప్పాల్సిన పని లేదు. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరాయమ్యకు పాపం ఇలాంటి అనుభవమే ఎదురయింది. ఆదివారం నగరంలో జరిగిన ఓ బహిరంగ సభలో ఓ మహిళ ఆయన బుగ్గమీద ముద్దు పెట్టుకుంది.

06/27/2016 - 07:59

న్యూఢిల్లీ, జూన్ 26: ప్రజాస్వామ్యమే భారతదేశానికి తిరుగులేని బలమని, దీన్ని మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. నాలుగు దశాబ్దాల క్రితం దేశంలో ఎమర్జెన్సీ విధించారని పేర్కొన్న ఆయన ఆ చీకటి రోజుల నుంచి బయటపడి భారత దేశం ప్రజాస్వామ్యయుతంగా బలమైన అడుగులు వేస్తూ దూసుకుపోతోందని ఆయన అన్నారు.

06/27/2016 - 07:59

ఫతేగఢ్ సాహిబ్ (పంజాబ్), జూన్ 26: భారతదేశాన్ని అస్థిర పరచేందుకు పొరుగుదేశం కుట్ర చేస్తోందని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్ము కాశ్మీర్‌లోని పాంపోర్‌లో ఎనిమిది మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లను పాక్ ప్రేరేపిత లష్కర్ ఉగ్రవాదులు విచక్షణారహితంగా హతమార్చటంపై రాజ్‌నాథ్ ఆదివారం స్పందించారు.

Pages