S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/27/2016 - 07:58

న్యూఢిల్లీ, జూన్ 26: అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పిటి)పై సంతకం చేయని దేశాలకు సభ్యత్వం కల్పించే ప్రక్రియపై ప్రత్యేకంగా చర్చించడానికి అణు సరఫరాదారుల గ్రూప్ (ఎన్‌ఎస్‌జి) ఈ ఏడాది చివరిలోపు మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉంది. దీంతో 48 దేశాలతో కూడిన ఈ గ్రూపులో తనకు సభ్యత్వం కల్పించాలని భారత్ మరోసారి కోరే అవకాశం లభిస్తుంది.

06/27/2016 - 07:57

న్యూఢిల్లీ, జూన్ 26: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే దినేష్ మోహన్యా అరెస్టు వ్యవహారం కేంద్రానికి, ఢిల్లీ ప్రభుత్వానికి మధ్య అగాధాన్ని మరింత పెంచింది. లైంగిక వేధింపుల ఆరోపణలపై దినేష్ మోహన్యాను అరెస్టు చేయటంతో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనిష్ సిసోడియాతోపాటు 52మంది ఆప్ ఎమ్మెల్యేలు ఆదివారం ప్రధాని మోదీకి ‘లొంగిపోవటం’కోసం ఆయన అధికార నివాసం 7రేస్‌కోర్స్ రోడ్‌కు ప్రదర్శనగా బయలుదేరి వెళ్లారు.

06/27/2016 - 07:56

న్యూఢిల్లీ, జూన్ 26: దూరదర్శన్, ఆకాశవాణిల ప్రసారాలు ఇక అన్ని రకాల డిజిటల్ వేదికలపై ప్రత్యక్షం కానున్నాయి. ప్రపంచ ప్రేక్షకులకు ఈ రెండింటి ప్రసారాలను అందుబాటులోకి తీసుకురావటానికి ప్రసారభారతి అన్ని సన్నాహాలు చేస్తోంది.

06/27/2016 - 05:50

న్యూఢిల్లీ, జూన్ 26: భారత్, అమెరికా, ఫ్రాన్స్ సహా ప్రపంచ వ్యా ప్తంగా 5వేల మందిని చంపేస్తామం టూ ఐసిస్ ఓ జాబితా విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల నిఘా సంస్థల్లోనూ అలజడి రేకెత్తిస్తున్న ఈ ‘మరణ’శాసనాన్ని ఐసిస్‌కు అనుబంధంగా ఉన్న కలీఫా సైబర్ ఆర్మీ (సిసిఎ) జారీ చేసింది. 285మంది భారతీయులు కూడా ఉన్న ఈ జాబితాలో మొత్తం 4వేల మంది ఇమెయిల్స్, వారి చిరునామాలను కూడా ప్రచురించింది.

06/27/2016 - 04:32

న్యూఢిల్లీ, జూన్ 26: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం లేదా మంగళవారం తమ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయనున్నట్లు బిజెపి వర్గాలు చెబుతున్నాయి. ఉత్తరప్రదేశ్ నుండి ఇద్దరు లేదా ముగ్గురు, అస్సాం నుండి ఒకరు, ఉత్తరాఖండ్ నుండి ఒకరిని మంత్రివర్గంలో చేర్చుకుంటారని తెలిసింది. అస్సాం ముఖ్యమంత్రి పదవి చేపట్టిన సోనోవాల్ స్థానంలో ఒకరికి ఈ రాష్ట్రం నుండి అవకాశం లభించవచ్చు.

06/27/2016 - 04:16

గడువులోగా నల్లధనాన్ని స్వచ్ఛందంగా వెల్లడిస్తే.. ఆ సంపద వివరాలను అడిగే ప్రసక్తే ఉండదు. అయితే అక్రమార్జనపై కొంత జరిమానా చెల్లించి తదుపరి సమస్యల నుంచి పూర్తిగా బయటపడిపోవచ్చు. సెప్టెంబర్ 30తో ముగిసే చివరి గడువును పొడిగించే ప్రసక్తే ఉండదు.

06/26/2016 - 16:08

న్యూదిల్లీ:ప్రపంచానికి అంతటికీ యోగా విలువేమిటో తెలిసిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. రేడియోలో ఆయన మన్‌కీబాత్‌లో పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇటీవల ఇస్రో చేపట్టిన 20 ఉప్రగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి పంపిన ప్రయోగాన్ని ఆయన ఉదహరిస్తూ అభినందనలు చెప్పారు. అలాగే భారత నావికాదళంలో తొలిసారిగా ముగ్గురు మహిళలు యుద్ధ విమానాల పైలట్‌లుగా బాధ్యతలు స్వీకరించడాన్ని ఆయన గుర్తు చేశారు.

06/26/2016 - 16:07

న్యూదిల్లి:ఆప్ ఎమ్మెల్యే దినేష్ మోహనియా అరెస్టుకు నిరసనగా ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాసహా 52మంది ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. వారంతా ర్యాలీకి బయలుదేరుతుండగా అందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపటి తరువాత వారిని విడుదల చేశారు.

06/26/2016 - 07:03

బెంగళూరు, జూన్ 25: బ్రహ్మోస్ క్షిపణి బిగించిన సుఖోయ్ యుద్ధ విమానం శనివారం మహారాష్టల్రోని నాసిక్‌లో ఉన్న హెచ్‌ఏఎల్ విమానాశ్రయంనుంచి తొలిసారిగా శనివారం గగనతలంలో విహరించింది. దీంతో అత్యంత శక్తివంతమైన ఈ క్షిపణిని ప్రయోగించడానికి ఈ యుద్ధ విమానం భారత వైమానిక దళానికి వేదిక కానుంది.

06/26/2016 - 07:01

న్యూఢిల్లీ, జూన్ 25: అమెరికా నుంచి సుమారు 750 మిలియన్ డాలర్ల వ్యయంతో 145 అతి తేలికయిన పొట్టి ఫిరంగులను కొనుగోలు చేయడానికి భారత రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం అనుమతించింది. 18 ధనుష్ ఆర్టిల్లరీ గన్‌లను పెద్ద మొత్తంలో తయారు చేయడానికి కూడా అనుమతించింది. బోఫోర్స్ కుంభకోణం వెలుగు చూసినప్పటి నుంచి గత మూడు దశాబ్దాలలో భారత్ ఇలాంటి ఆయుధ వ్యవస్థలను విదేశాల నుంచి సేకరించడం ఇదే తొలిసారి.

Pages