S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

,
06/26/2016 - 04:46

శ్రీనగర్, జూన్ 25: జమ్ముకాశ్మీర్‌లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సీఆర్‌పీఎఫ్ జవాన్లు వెళ్తున్న బస్సుపై ముష్కరమూక విచక్షణా రహితంగా కురిపించిన తూటాల వర్షానికి ఎనిమిది మంది జవాన్లు వీరమరణం పొందారు. కనీసం 21మంది జవాన్లకు గాయాలయ్యాయి. సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్‌కు 14కిలోమీటర్ల దూరంలో శనివారం ఈ దారుణం చోటు చేసుకుంది.

06/26/2016 - 04:52

పుణె, జూన్ 25: ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్మార్ట్ సిటీల ప్రాజెక్టులను ఏడాది క్రితం ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పుణెలో అట్టహాసంగా జరిగిన ఒక కార్యక్రమంలో ప్రారంభించారు. మొదటి దశలో స్మార్ట్ సిటీలుగా ఎంపికయిన 20 నగరాల్లో మొత్తం రూ.2,900 కోట్ల విలువైన 69 ప్రాజెక్టులను పుణెలోని శివ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ప్రారంభించారు.

06/26/2016 - 02:26

శ్రీనగర్, జూన్ 25: జమ్మూ, కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అనంత్‌నాగ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో 12 వేలకుపైగా భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ నెల 22న ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగ్గా, శనివారం ఫలితాలను ప్రకటించారు.

06/26/2016 - 02:07

న్యూఢిల్లీ, జూన్ 25: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో అత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించారని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీలో శనివారం ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే దినేశ్ మొహానియాను విలేఖరుల సమావేశంలో మాట్లాడుతుండగా పోలీసులు అరెస్టు చేయడంపై కేజ్రీవాల్ మండిపడ్డారు.

06/26/2016 - 02:04

బీజింగ్, జూన్ 25: భారత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం ఇక్కడ చైనా ఆర్థిక మంత్రి లో జివీతో సమావేశమై ద్వైపాక్షిక ఆర్థిక సహకారం, ప్రపంచ స్థూలార్థిక పరిస్థితిపై చర్చించారు. ఈ ఇద్దరు నేతలు ప్రపంచ స్థూలార్థిక పరిస్థితితోపాటు ద్వైపాక్షిక ఆర్థిక సహకారం, జి20, బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) అంశాలపై చర్చించారని ఇక్కడి భౌరత దౌత్య కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.

06/26/2016 - 02:01

హైదరాబాద్, జూన్ 25: తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ ఆన్‌లైన్ అడ్మిషన్లకు మరోమారు వెబ్ ఆప్షన్ల అవకాశం కల్పించారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీలో పాసైన అభ్యర్ధులు, గతంలో ఆన్‌లైన్ రిజిస్టర్ చేసుకోని వారు ఈ నెల 26 నుండి తమ వెబ్ ఆప్షన్లను ఇవ్వాలని కాలేజీయేట్ ఎడ్యుకేషన్ అధికారులు సూచించారు.

06/26/2016 - 02:00

హైదరాబాద్, జూన్ 25: దేశంలో పర్యావరణాభివృద్ధికి, అడవుల విస్తరణకు కేంద్రం గ్రీన్ సెస్‌ను విధించాలనే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. కేంద్ర పర్యావరణ శాఖకు భోపాల్‌లోని అడవుల పరిశోధన సంస్ధ అడవుల అభివృద్ధిపై జాతీయ విధాన పత్రాన్ని రూపొందించి సమర్పించింది. ఈ పత్రాన్ని అన్ని రాష్ట్రాలకు అభిప్రాయ సేకరణ నిమిత్తం కేంద్రం పంపించింది.

06/26/2016 - 01:58

పాట్నా, జూన్ 25: బిహార్ ఇంటర్‌మీడియట్ పరీక్షలో రాష్ట్ర టాపర్ రూబీరాయ్‌ని శనివారం అరెస్ట్ చేశారు. మోసం చేసి, మాస్ కాపీయింగ్‌తో టాపర్‌గా మారిన ఈ అమ్మాయిని ప్రత్యేక విచారణ బృందం అరెస్టు చేసింది. టాపర్‌గా నిలిచిన ఈ విద్యార్థిని పొలిటికల్ సైన్స్‌ని ‘ప్రోడికల్ సైన్స్’ అని సంబోధించటమే కాకుండా, అది వంటల శాస్తమ్రని చెప్పటం విస్తుపోయేలా చేసింది.

06/26/2016 - 01:54

చెన్నై, జూన్ 25: తమిళనాడు కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తున్నానంటూ తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇవికె ఎలంగోవన్ రాజీనామా చేశారు. పార్టీ రాష్ట్ర కమిటీకి ఈ నెల 15నే రాజీనామా చేశారని కాంగ్రెస్ నేత, ఇవికె ముఖ్యఅనుచరుడు శివరామన్ శనివారం ఇక్కడ వెల్లడించారు.

06/26/2016 - 01:54

న్యూఢిల్లీ, జూన్ 25: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా, బిజెపి రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యం స్వామి మధ్య శనివారం ట్వీట్ల వార్ మొదలైంది. హోటళ్లలో పనిచేసే వెయిటర్ల గురించి తక్కువ చేసి మాట్లాడడం సంస్కారం కాదని వాద్రా ట్వీట్ చేస్తే ‘మీరు రాజకీయ ప్రకటనలు చేసే బదులు జైల్లోకి వెళ్లకుండా ఎలా ఉండాలో జాగ్రత్త పడండి’ అంటూ స్వామి ఎద్దేవా చేశారు.

Pages