S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/26/2016 - 01:53

థానే, జూన్ 25: ఒక యువతిపై ఆమె అత్త కొడుకు అనేకసార్లు అత్యాచారానికి పాల్పడిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక సమయంలో బాధితురాలిని హతమార్చడానికి కూడా నిందితుడు ప్రయత్నించగా ఆమె తప్పించుకున్నట్లు పోలీసులు చెప్పారు. 23 ఏళ్ల బాధితురాలు మహారాష్టల్రోని భివండి తాలుకాలో గల జునద్రుఖెలో తన అత్తింట్లో ఉంటోంది.

06/25/2016 - 17:52

దిల్లీ: పసిడి ధర శనివారం కాస్త దిగొచ్చింది. రూ.485 తగ్గడంతో పది గ్రాముల బంగారం ధర రూ. 30,400కు చేరింది. వ్యాపారుల నుంచి డిమాండ్‌ పడిపోవడంతో ధర తగ్గినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి.
వెండి ధర మాత్రం నేడు స్వల్పంగా పెరిగింది. రూ. 90 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 42,390కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఎక్కువవడంతో ధర పెరిగింది.

06/25/2016 - 16:19

చెన్నై: ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తమిళనాడు పిసిసి అధ్యక్షుడు ఎలంగోవన్ తన పదవికి రాజీనామా చేశారు. వాస్తవానికి ఆయన ఈనెల 15నే రాజీనామా సమర్పించినప్పటికీ కాంగ్రెస్ అధిష్ఠానం ఇంతవరకూ స్పందించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకెతో జతకట్టిన కాంగ్రెస్ పార్టీ 41 స్థానాల్లో పోటీ చేయగా 8 చోట్ల మాత్రమే గెలిచింది.

06/25/2016 - 15:36

దిల్లీ: అనంత్‌నాగ్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో జమ్ము-కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఘన విజయం సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఆ ఉపఎన్నికలో 12వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందిన సంగతి తెలిసిందే.

06/25/2016 - 15:35

దిల్లీ: దిల్లీలో ప్రధాని మోదీ ఎమర్జన్సీ విధించారా?- అంటూ దిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ తాజాగా ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. ఆప్ ఎమ్మెల్యే దినేశ్‌ను పోలీసులు అకారణంగా అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. తన పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులపై తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులతో వేధిస్తున్నారన్నారు.

06/25/2016 - 15:34

శ్రీనగర్: జమ్ము-కాశ్మీర్‌లోని అనంతనాగ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ 12వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈనెల 22న ఉపఎన్నికకు పోలింగ్ నిర్వహించగా శనివారం కౌంటింగ్ జరిగింది. కౌంటింగ్‌లో తొలి రౌండ్ నుంచి ఆధిక్యతలో ఉన్న మెహబూబా సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై సునాయాసంగా గెలిచారు.

06/25/2016 - 13:45

దిల్లీ: దిల్లీలోని సంగమ్ విహార్ నియోజకవర్గానికి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న దినేశ్ మొహానియాను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నీటి సరఫరా సరిగా లేదని ఫిర్యాదు చేసినందుకు వచ్చిన మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆయనపై కేసు నమోదైంది. మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా దినేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

06/25/2016 - 08:24

తాష్కెంట్, జూన్ 24: షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ)లో భారత్ పూర్తిస్థాయి సభ్యురాలిగా చేరడం దేశ ఆర్థికాభివృద్ధికి ఊతమివ్వడంతో పాటు అతివాదం, హింస, ఉగ్రవాద ముప్పు నుంచి ఈ ప్రాంతాన్ని రక్షించేందుకు ఉపకరిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. షాంఘై సహకార సంస్థలో భారత్ చేరిక ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో మోదీ శుక్రవారం ఎస్‌సిఓ శిఖరాగ్ర సమావేశంలో ప్రసంగిస్తూ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

06/25/2016 - 08:17

న్యూఢిల్లీ,జూన్ 24: ఐరోపా దేశాల కూటమి నుండి బయటకు రావాలని బ్రిటన్ నిర్ణయించుకున్న నేపథ్యంలో నేపథ్యంలో బ్రెగ్జిట్ ఫలితాలను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి మంత్రి అరుణ్‌జైట్లీ భరోసా ఇచ్చారు. బ్రిటన్ యూరో నుంచి బయటకు రావడం వల్ల పలు దేశాల ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందనే ప్రచారం జరుగుతున్న సమయంలో జైట్లీ శుక్రవారం ఈ ప్రకటన చేయటం గమనార్హం.

06/25/2016 - 08:16

న్యూఢిల్లీ, జూన్ 24: యూరోపియన్ యూనియన్‌లో కొనసాగాలా, వైదొలగాలా అనే అం శంపై బ్రిటన్‌లో నిర్వహించిన బ్రెగ్జిట్ తరహా ప్రజాభిప్రాయ సేకరణను ఢిల్లీలోనూ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. బ్రెగ్జిట్ ఫలితాలు శుక్రవారం వెల్లడైన నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. యుకె రిఫరెండం తర్వాత ఢిల్లీలో కూడా త్వరలో ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతామని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Pages